
మంచు లక్ష్మి ఈ పేరు టాలీవుడ్‌లో తెలియని వారుండరు. విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తనలోని నటిని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించేందుకు కొత్త కథ, కథనాలకు ఆమె ఎన్నుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంచు లక్ష్మి లీడ్ రోల్‌లో చేస్తున్న ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా టీజర్‌ను కింగ్ అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఈ టీజర్‌ను చూస్తే ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలిసిపోతోంది. చనిపోయిన తన భర్త కేసు మిస్టరీని ఛేదించడం, పోలీసు విచారణలో ఎదుర్కొనే ఇబ్బందులు.. ఇలా సినిమాను ఒక సస్పెన్స్‌తో నడిపించినట్టు కనిపిస్తోంది. ప్రియదర్శి పోలీస్ పాత్రలో నటించాడు. విజయ్ యేలకంటి దర్శకత్వం వహించగా... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
The season's most anticipated thriller movie to keep you guessing is here! Wishing all the best to my dear friend @LakshmiManchu ! I am excited to reveal the official Teaser for #WifeOfRam.https://t.co/Z54Duh3eiw
— Nagarjuna Akkineni (@iamnagarjuna) 27 April 2018
Comments
Please login to add a commentAdd a comment