Priyadarshi Stands As Embodiment Of Hardwork And Dedication - Sakshi
Sakshi News home page

ప్రియదర్శి కాలికి గాయం, మానడానికి 3 నెలలు!

Published Tue, Jun 8 2021 6:19 PM | Last Updated on Tue, Jun 8 2021 7:05 PM

Priyadarshi Stands As Embodiment Of Hard Work And Dedication - Sakshi

'మల్లేశం' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రియదర్శి. ఈ మధ్యే వచ్చిన 'జాతిరత్నాలు' సినిమాలోనూ తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు. అయితే ఎప్పుడూ కామెడీ పండించే పాత్రలు ఎంచుకునే అతడు ఈసారి మాత్రం డిఫరెంట్‌ ట్రాక్‌ ఎక్కాడు. క్రైమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌తో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ ది గాడ్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. విద్యాసాగర్‌ ముత్తు కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను బాషా, మాస్టర్‌, డాడీ చిత్రాల దర్శకుడు సురేశ్‌ కృష్ణ నిర్మిస్తున్నాడు.

ఈ వెబ్‌ సిరీస్‌లో కీలకమైన సన్నివేశం షూట్‌ చేస్తున్న సమయంలో ప్రియదర్శి కాలికి గాయమైందట. అయినప్పటికీ తన గాయాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా షూటింగ్‌ పూర్తి చేశాడట. కానీ ఆ గాయం నుంచి కోలుకోవడానికి ప్రియదర్శికి మూడు నెలలు పట్టిందట. ఈ విషయం తెలిసిన అభిమానులు ప్రియదర్శి అంకితభావాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్చి త్వరలోనే ఆహాలో ప్రసారం కానుంది. 

చదవండి: ఆ లెజెండ్స్‌తో పనిచేయడంతో నా కల నిజమైంది: ప్రియదర్శి

Aha : జూన్‌లో విడుదలయ్యే సినిమాలు ఇవే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement