గ్రామాల్లో బలగం సినిమా ప్రదర్శనను తాము అడ్డుకోవడం లేదని నిర్మాత దిల్ రాజు అన్నారు. సినిమా ప్రేక్షకులకు చేరువ కావడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. మా సినిమా చూసిన ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా ఉన్న మనస్పర్థలు మరిచిపోయి కలుసుకుంటున్నారని వెల్లడించారు. ఒక నిర్మాతగా తనకు ఇంతకంటే అదృష్టం ఏముంటుంది అని అన్నారు. ప్రజలు వివాదాలు పక్కనపెట్టి కలుస్తున్నారంటే తమకు చాలా సంతోషంగా ఉందన్నారు.
చిన్న మాట అంటేనే తట్టుకోలేను
మీరు రాజకీయాల్లో వస్తారన్న ప్రశ్నపై దిల్ రాజు స్పందించారు. నేను రాజకీయాల్లో వస్తానా లేదా అన్నది అప్రస్తుతమని కొట్టి పారేశారు. రాజకీయాల్లో ఎన్నో అడ్డుంకులు ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. సినీ ఇండస్ట్రీలో చిన్నమాట అంటేనే నేను తట్టుకోలేనని తెలిపారు. అలాంటిది నేను రాజకీయాల్లోకి వస్తాననడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
కాగా.. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించిన 'బలగం'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. చిన్న సినిమా అయినా మానవ సంబంధాలను హృదయాలకు హత్తుకునేలా ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. తెలంగాణ పల్లెల్లో జరిగే సంప్రదాయాలే కథాంశంగా ఈ సినిమాను రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment