
Lucknow Super Giants Logo Unveil: కేఎల్ రాహుల్ సారధ్యం వహించనున్న ఐపీఎల్ కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఆ జట్టు అధికారిక లోగోను ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా సోమవారం సాయంత్రం విడుదల చేశాడు. పక్షిని పోలి ఉన్న ఈ లోగో.. త్రివర్ణ పతాకంలోని మూడు రంగులతో(కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) కూడిన రెక్కలు, మధ్యలో బంతి, బ్యాట్‌తో కనిపించింది. గరుడ పక్షి నుంచి ప్రేరణ పొంది ఈ లోగోను రూపొందించినట్లు తెలుస్తోంది.
కాగా, లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా అరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. లక్నో జట్టు రూ. 17 కోట్లు పెట్టి కేఎల్ రాహుల్‌ను సారథిగా నియమించుకోగా.. అహ్మదాబాద్ రూ. 15 కోట్లు వెచ్చించి హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంచుకుంది.
Here's the story behind our identity. 🙌#LucknowSuperGiants #IPL pic.twitter.com/4qyuFeNgsR
— Lucknow Super Giants (@LucknowIPL) January 31, 2022
లక్నో జట్టు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌కి రూ.9.2 కోట్లు, పంజాబ్ కింగ్స్ మాజీ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కి 4 కోట్లు చెల్లించి సొంతం చేసుకోగా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రషీద్ ఖాన్‌కు 15 కోట్లు, శుభ్‌మన్ గిల్‌ను 8 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో జట్టుకు కోచ్‌గా ఆండీ ఫ్లవర్ వ్యవహరించనుండగా.. మెంటార్‌గా గౌతం గంభీర్ నియమితుడయ్యాడు. మరోవైపు అహ్మదాబాద్.. తమ కోచ్‌గా ఆశిష్ నెహ్రాను, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టన్‌ను నియమించుకుంది.
చదవండి: అరుదైన ఫీట్‌కు అడుగు దూరంలో ఉన్న టీమిండియా బౌలర్