లక్నో సూపర్‌ జెయింట్స్‌ లోగో ఆవిష్కరణ | IPL new franchise Lucknow Super Giants unveil team logo | Sakshi
Sakshi News home page

లక్నో సూపర్‌ జెయింట్స్‌ లోగో ఆవిష్కరణ

Published Tue, Feb 1 2022 6:28 AM | Last Updated on Tue, Feb 1 2022 6:28 AM

IPL new franchise Lucknow Super Giants unveil team logo - Sakshi

ముంబై: ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ తమ అధికారిక లోగోను ఆవిష్కరించింది. ‘గరుడ’ పక్షి రెండు రెక్కల మధ్య బ్యాట్‌ బాల్‌తో ఈ లోగో రూపుదిద్దుకుంది. ట్విట్టర్‌లో ఫ్రాంచైజీ యాజమాన్యం ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌ ఈ లోగో వీడియోను విడుదల చేసింది. రెక్కలకు జాతీయ జెండా రంగులద్దారు. ‘రెక్కలు విప్పుకొని మరింత ఎత్తుకు ఎగురుతాం’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో రూపొందింది. ఇదివరకే తమ జట్టు కెప్టెన్‌గా లోకేశ్‌ రాహుల్‌ను ప్రకటించిన ఫ్రాంచైజీ ఇటీవల జట్టు పేరును లక్నో సూపర్‌ జెయింట్స్‌గా ఖరారు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement