![Hello Madam Telugu Movie Logo Launch At Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/22/hello-madam-movie.jpg.webp?itok=vmyCdDP4)
నవీన్.కె.చారి, ప్రియాన్స, మేఘన చౌదరి, సుమాయ, కావ్య, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హలో మేడమ్’. వడ్ల జనార్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వడ్ల గురురాజ్, వడ్ల కార్తీక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా చిత్ర లోగోను ఆవిష్కరించారు. హైదరాబాద్ ఫిలించాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథిలుగా హాజరైన దర్శకుడు సాగర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్‌లు ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. చిత్ర యూనిట్‌కు విషెస్ తెలిపారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వడ్ల జనార్థన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత సమాజంలో మహిళలపై ఆకృత్యాలు జరుగుతున్నాయి. అవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అమ్మాయిలపై జరుగుతున్న దాడులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చెప్పే చిత్రం. ఘటికా చలం మంచి కథ, స్రీన్‌ప్లే, డైలాగులు అందించారు. సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. త్వరలో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు’ తెలిపారు. సాయి, జియో, లక్షన్, శీలం శ్రీను, వెంకటేష్ తాతిరాజు, ముప్పిడి వాసుదేవరాజు, లక్ష్మిదేవి, కాకినాడ గుప్త, వాస్తుప్రకాష్, హల్లాఫ్, జూ.బాబుమోహన్, మల్లాది శాస్త్రి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, సంగీతం ఘటికా చలం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment