అనీల్, సుబాంగి, విరాజ్
‘‘కథ బాగుంటే చిన్న సినిమా అయినా కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది. ‘రావే నా చెలియ’ టైటిల్ అట్రాక్టివ్‌గా ఉంది. ఈ సినిమా కంటెంట్ కూడా బాగుంటుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రానికి పని చేస్తున్న వారందరికీ అభినందనలు’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. నెమలి అనిల్, సుబాంగి పంథ్ జంటగా ఎన్. మహేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రావె నా చెలియ’. నెమలి సురేశ్ సమర్పణలో సూర్యచంద్ర ప్రొడక్షన్‌లో నెమలి అనీల్, నెమలి శ్రవణ్ రూపొందిస్తున్న ఈ చిత్రం లోగోని రాజ్ కందుకూరి ఆవిష్కరించారు.
హీరో నెమలి అనిల్ మాట్లాడుతూ– ‘‘ఇది మా బ్యానర్‌కి, నాకు మొదటి సినిమా. మా నాన్న, బాబాయి ఎంతో నమ్మకంతో ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టీమ్ అంతా ప్రాణం పెట్టి సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. నిర్మాతలు, అనిల్ నన్ను చాలా నమ్మి సపోర్ట్ చేశారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయను’’ అన్నారు ఎన్. మహేశ్వర రెడ్డి. నిర్వాహకుడు నెమలి సురేశ్, సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కుమార్, కెమెరామేన్ విజయ్ దగ్గుబాటి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment