మహిళలకు గొప్ప సందేశాత్మకంగా 'లవ్‌' | Love Movie Logo Launched By Director Nag Ashwin | Sakshi
Sakshi News home page

Nag Ashwin: వాస్తవానికి దగ్గరగా ఉండే 'లవ్‌' కథ

Published Sat, Aug 13 2022 3:49 PM | Last Updated on Sat, Aug 13 2022 3:53 PM

Love Movie Logo Launched By Director Nag Ashwin - Sakshi

Love Movie Logo Launched By Director Nag Ashwin: రామరాజు, సోనాక్షీ వర్మ, అభి, ప్రీతీ సింగ్, శ్రీకృష్ణ, డాక్టర్‌ మారుతి సకారం ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘లవ్‌’. శ్రీనారాయణ దర్శకత్వంలో మహేందర్‌ సింగ్, శైలజ తాటిచెర్ల, శ్రీనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ లోగోను ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ – ‘‘గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథతో రానున్న సినిమా ఇది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి రీచ్‌ అవ్వాలని కోరుతున్నా. అలాగే ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశా’’ అని తెలిపారు. ‘‘వాస్తవానికి దగ్గరగా ఉండే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. మహిళలకు సంబంధించిన ఓ గొప్ప సందేశం అంతర్లీనంగా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. 

చదవండి: రొమాంటిక్‌ వెబ్‌సిరీస్‌గా 'ఎమోజీ'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
షెడ్యూల్స్‌ కారణంగా విడిపోయిన లవ్‌బర్డ్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement