Deputy Chief Minister of Andhra Pradesh
-
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీదే విజయం :పుష్ప శ్రీవాణి
సాక్షి, పార్వతీపురం: పదవి వచ్చిందని ఏనాడూ విర్రవీగలేదు.. పదవి లేదనే నిరాశా లేదు.. నిరంతరం ప్రజాసేవే లక్ష్యం.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కర్తవ్యమని కురుపాం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షురాలు పాముల పుష్పశ్రీవాణి అన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన పదవితో మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీ విజయం తథ్యమని పేర్కొన్నారు. చిన్నమేరంగి గ్రామంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ‘సాక్షి’తో ఆదివారం మాట్లాడారు. రాష్ట్రంలోని సంక్షేమ పాలన, గిరిజన శాఖ మంత్రిగా ఆమె సాధించిన విజయాలు ఆమె మాటల్లోనే... సాక్షి: రాష్ట్రంలో మహిళా సంక్షేమం ఎలా ఉంది ? పుష్పశ్రీవాణి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మహిళా సంక్షేమం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మల ఖాతాలకు సీఎం జగన్మోహన్రెడ్డి సున్నావడ్డీ పథకం కింద మూడో విడత వడ్డీ నగదును జమచేయించారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, దిశ చట్టంతో మహిళా సంక్షేమానికి పాటుపడుతున్నారు. ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో రిజర్వేషన్ల శాతం పెంచిన ఘనత ఆయనదే. సాక్షి : గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా మీరు సాధించిన ఫలితాలు ? పుష్పశ్రీవాణి : మన్యం జిల్లాకు గిరిజన ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయించాను. రూ.105 కోట్లు మంజూరయ్యాయి. పాడేరులో రూ.500 కోట్ల వ్యయంతో మెడికల్ కళాశాల పనులు ప్రారంభించాం. 1.60 లక్షల మంది గిరిజనులకు పోడు వ్యవసాయ సాగు పట్టాలు అందించాం. డీబీటీ, నాన్ డీబీటీ విధానం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు రూపంలో రాష్ట్రంలోని గిరిజనులకు రూ.931 కోట్లు నిధులు వెచ్చించాం. సంక్షేమ పథకాలతో 49 లక్షలు మంది గిరిజనులు లబ్ధిపొందారు. సాక్షి : రాష్ట్రంలో భవిష్యత్ ఎన్నికలు ఎలా ఉంటాయి ? పుష్పశ్రీవాణి : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ సీపీ విజయం ఖాయం. ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలన్నీ శాతశాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కింది. ప్రజా సంక్షేమానికి సీఎం పెద్దపీట వేస్తున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పథకాలతో ప్రజలను ఆదుకున్నారు. టీడీపీ నేత చంద్రబా బు నాయుడిపై ప్రజలకు నమ్మకం లేదు. ఆయన మాయమాటలకు మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. టీడీపీ వస్తే పథకాలు ఆపేస్తారన్నది అందరికీ తెలిసిన నిజం. అందు కే.. గతంలో వచ్చిన 23 ఎమ్మెల్యే స్థానాలు కూడా ఈ దఫా వచ్చే పరిస్థితి లేదు. సాక్షి : పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక? పుష్పశ్రీవాణి : క్షేత్ర స్థాయిలో ప్రతీ ఇంటికి వెళ్లి మా ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వివరిస్తాం. ప్రభుత్వ పథకాల లబ్ధిని తెలియజేస్తాం. సచివా లయాలు ఏర్పాటు, ఉద్యోగ కల్పన, వలంటీర్లు వ్యవస్థ ఏర్పాటు, కోవిడ్ నియంత్రణ సమయంలో ప్రజలకు అందించిన సేవలు, ఠంచన్‌గా అందిస్తున్న పింఛన్, ఇళ్ల స్థలాలు మంజూరు వంటివి ప్రజలకు వివరిస్తాం. అర్హులకు సంక్షేమ పథకాలను అందించిన ఘనతను గుర్తుచేస్తాం. గతంలో కంటే ఎక్కువ మందిని వైఎస్సార్సీపీ కుటుంబీకులుగా చేర్చుతాం. 2024 ఎన్నికల్లో ఎదురులేని విజయాన్ని అందుకుంటాం. సాక్షి : పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఎంపిక కావడం ఎలా అనిపిస్తోంది? పుష్పశ్రీవాణి: అధికారంలో ఉన్న పార్టీకి జిల్లా అధ్యక్షురాలిగా గుర్తింపు పొందడం అంటే ఆషామాషీ కాదు. నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. మొన్నటివరకూ రాష్ట్ర మంత్రిగా సేవలు అందించాను. ఇప్పుడు పా ర్టీ అధ్యక్షరాలిగా పార్టీకి సేవచేసే అదృష్టం రావడం సంతోషదాయకం. సీఎం నమ్మకంతో కట్టబెట్టిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను. -
తోలుబొమ్మల సిత్రాలు
‘‘సినిమా పుట్టుకకి బీజం తోలుబొమ్మలాట. ఈ కళ పేరుతో తోలుబొమ్మల సిత్రాలు అనే బ్యానర్ నెలకొల్పినందుకు యూనిట్‌ని అభినందిస్తున్నాను. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ బ్యానర్ పెద్ద సంస్థగా ఎదగాలని, ఈ బ్యానర్లో మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను’’ అని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు. తోలుబొమ్మల సిత్రాలు బేనర్లో కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు ఓ సినిమా నిర్మించారు. తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ వీడియో, లోగోని ఎస్.బి. అంజాద్ బాషా విడుదల చేశారు. ఈ సందర్భంగా కొమారి జానకిరామ్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా కథాంశాన్ని తెలుసుకున్న అంజాద్ బాషాగారు తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడం ఎంతో సంతోషం. మా చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా టైటిల్, నటీనటుల వివరాలను త్వరలో చెబుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం యు.వి. నిరంజన్. -
'పోలీసులకు సెలవు ఇవ్వడం కుదరదు'
రాజమండ్రి: రాష్ట్ర పోలీసు శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ, డిప్యూటీ సీఎం ఎన్.చినరాజప్ప తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. బుధవారం రాజమండ్రిలో చినరాజప్ప విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పోలీసులు వారంతపు సెలవుపై ఏం నిర్ణయం తీసుకున్నారని విలేకర్లు అడిగిన ప్రశ్నకు చినరాజప్పపై విధంగా సమాధానం చెప్పారు. నెలరోజుల్లో పోలీస్ శాఖను ప్రక్షాళిస్తామని చెప్పారు. ఇసుక తవ్వకాలుపై కొత్త పాలసీని త్వరలో వెల్లడిస్తామని అన్నారు. రాష్ట్రంలో రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ చేయాంటే ప్రభుత్వంపై రూ. 43 వేల కోట్ల భారం పడుతుందని చినరాజప్ప తెలిపారు. కోనసీమ ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిత్యవసర ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కాకినాడలో షెల్ ఆధ్వర్యంలో ఎల్ఎన్జీ టర్మినల్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో పెట్రో యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. పోలీసుల వాహనాల కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.100 కోట్ల ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు ప్రకటించారు. -
'ఆ రెండు జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు మేం ఆపలేదు'
కృష్ణా, గుంటూరు జిల్లాలలో భూముల రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం నిలిపివేయలేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఆ జిల్లాల మధ్య రాజధాని ఏర్పడితే ధరలు పెంచుకోవడం కోసం వ్యాపారులే రిజిస్ట్రేషన్లు చేసుకోవడం లేదని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో కేఈ కృష్ణమూర్తి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆ రెండు జిల్లాల మధ్యే రాజధాని ఏర్పాటవుతుందంటూ ప్రచారం జరగడంతోత వ్యాపారులు ధరలు విపరీతంగా పెంచారని చెప్పారు. భూమల ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అందులో భాగంగా ప్రభుత్వ పరిమితిని దాటిన వారిపై జరిమాన విధిస్తామని అన్నారు. ప్రభుత్వ భూముల వివరాలన్నీ సాధ్యమైనంత త్వరగా వెబ్సైట్లో పెడుతున్నామని వివరించారు. రైతులకు కొత్త పాసు పుస్తకాలు మంజూరు చేస్తామని చెప్పారు. త్వరలో 20 లక్షల మంది లబ్దిదారులకు 25 వేల ఎకరాల భూమి పంపిణీ చేస్తామని ఈ సందర్బంగా కేఈ కృష్ణమూర్తి తెలిపారు.