'ఆ రెండు జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు మేం ఆపలేదు' | We don't stop land registrations in Krishna and Guntur districts, says K E Krishna murthy | Sakshi
Sakshi News home page

'ఆ రెండు జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు మేం ఆపలేదు'

Published Fri, Jul 18 2014 1:48 PM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

'ఆ రెండు జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు మేం ఆపలేదు'

'ఆ రెండు జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు మేం ఆపలేదు'

కృష్ణా, గుంటూరు జిల్లాలలో భూముల రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం నిలిపివేయలేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఆ జిల్లాల మధ్య రాజధాని ఏర్పడితే ధరలు పెంచుకోవడం కోసం వ్యాపారులే రిజిస్ట్రేషన్లు చేసుకోవడం లేదని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో కేఈ కృష్ణమూర్తి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆ రెండు జిల్లాల మధ్యే రాజధాని ఏర్పాటవుతుందంటూ ప్రచారం జరగడంతోత వ్యాపారులు ధరలు విపరీతంగా పెంచారని చెప్పారు.

 

భూమల ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అందులో భాగంగా ప్రభుత్వ పరిమితిని దాటిన వారిపై జరిమాన విధిస్తామని అన్నారు. ప్రభుత్వ భూముల వివరాలన్నీ సాధ్యమైనంత త్వరగా వెబ్సైట్లో పెడుతున్నామని వివరించారు. రైతులకు కొత్త పాసు పుస్తకాలు మంజూరు చేస్తామని చెప్పారు. త్వరలో 20 లక్షల మంది లబ్దిదారులకు 25 వేల ఎకరాల భూమి పంపిణీ చేస్తామని ఈ సందర్బంగా కేఈ కృష్ణమూర్తి తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement