K E Krishna Murthy
-
రమణ దీక్షితులు హద్దులు దాటారు: కేఈ
సాక్షి, అమరావతి : టీటీడీ ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు అర్చక వృత్తిని వదిలేసి, రాజకీయ వృత్తిని తీసుకున్నారు...పబ్లిసిటీ కోసమే ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ...ఈ మధ్య కాలంలో రమణ దీక్షితులు హద్దుమీరి వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. పురావస్తు వారిని నియమించాలని చెప్పడానికి ఆయనకు ఏం అధికారముందని ప్రశ్నించారు. ‘రమణ దీక్షితులు చాలా తప్పులు చేసారు. ప్రధానాలయంలోకి మనవడిని తీసుకెళ్లారు, వీఐపీలు వస్తే గెస్ట్‌హౌస్‌ల్లోకి వెళ్లి ఆశీర్వాదం ఇచ్చేవారు. అలాగే కొంత మందిని ఆయన అర్థరాత్రి ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు చేయించారు. ఆ చర్యలను భరించలేకే టీటీడీ రమణ దీక్షితులను విధులనుంచి తొలగించింది. ఇంతవరకూ నేను రమణ దీక్షితులు వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన తన హద్దులను దాటి మరి ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఉపేక్షించేది లేదు...ఆయన చేసిన పనులపై ప్రత్యేక విచారణ జరిపిస్తాం. స్వామి వారి ఆస్తుల గురించి కూడా అవాకులు చేవాకులు మాట్లాడుతున్నారు. కానీ ప్రతియేడు స్వామి వారి అభరణాలను లెక్కిస్తున్నాము. 1996లో స్వయంగా రమణ దీక్షితులే అన్ని నగలు భద్రంగా ఉన్నాయన్నారు, మరి ఇప్పుడు ఇలా ఎందుకు అబద్దమాడుతున్నారో ఆయనకే తెలియాలన్నారు. రమణ దీక్షితులు ముగ్గురు కొడుకులు పూజలు, అర్చనలుకు హజరవ్వటం లేదు, అయినా వారిని అర్చకులుగా కొనసాగించాలనుకుంటున్నారు. అందుకే ఈ విషయంలో రమణ దీక్షితులుకు, మిగతా అర్చకులకు గొడవలు వచ్చాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శ్రీవారి దర్శనకు వచ్చినప్పుడు మేమే ఆయనకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయించాం. అలానే డాలర్ శేషాద్రి విషయం గురించి కూడా ఆరా తీస్తాం. కేవలం పబ్లిసిటీ కోసమే రమణ దీక్షితులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.’ అని కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. -
'వాళ్లకు ఇచ్చినా బీసీలకు నష్టం లేదు'
విజయవాడ : అమరావతిలో లంక గ్రామాల భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో కేఈ కృష్ణమూర్తి విలేకర్లతో మాట్లాడుతూ... రిజిస్ట్రేషన్ శాఖలోని సేవలను సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ఎన్నారై రిజిస్ట్రేషన్లను సులభతరం చేశామని తెలిపారు. రూ. వెయ్యిపైన స్టాంపుల కొనుగోలు ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖలో రూ. 3500 కోట్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చినా బీసీలకు నష్టం లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
'సీఎం, అటవీశాఖ మంత్రికి తెలియదు'
విజయవాడ : బాక్సైట్ జీవో జారీ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి సమాచారం లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ... కొన్నిసార్లు ఇలాంటి పొరపాట్లు జరుగుతాయని... అయితే వాటిని సవరించుకుంటామని చెప్పారు. రాయలసీమ అభివృద్ధి సమావేశానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని కేఈ కృష్ణమూర్తి చెప్పారు. అరుకులోని బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ జీవో జారీ చేసింది. దీనిని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆందోళనకు కూడా సమాయత్తమైంది. ఆ క్రమంలో బాక్సైట్ జీవో జారీపై అధికార పక్షంలోని వారు సైతం వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సదరు జీవోను తాత్కాలికంగా నిలిపివేయాలని సోమవారం విజయవాడలో సమావేశమైన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. -
చంద్రబాబుపై డిప్యూటీ సీఎం అలిగారా?
-
'తిరుపతిని మెగాసిటీగా మారుస్తాం'
తిరుమల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుపతి నగరాన్ని మెగాసిటీగా మారుస్తామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తిరుపతిలో వెల్లడించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుందని కేఈ తెలిపారు. ప్రజల కష్టాలను తీర్చడంమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతామని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు మీడియా సహకారంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను చాలా వరకు అరికట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం వద్ద నిల్వ ఉన్న బి,సి గ్రేడ్ ఎర్రచందనాన్ని ఆన్లైన్ ద్వారా వేలం వేస్తామని బొజ్జల చెప్పారు. అంతకు ముందు తిరుమలలో శ్రీవారిని కేఈ కృష్ణమూర్తి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు దర్శించుకున్నారు. వీరికి టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగానాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 6 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. -
'ఆ రెండు జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు మేం ఆపలేదు'
కృష్ణా, గుంటూరు జిల్లాలలో భూముల రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం నిలిపివేయలేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఆ జిల్లాల మధ్య రాజధాని ఏర్పడితే ధరలు పెంచుకోవడం కోసం వ్యాపారులే రిజిస్ట్రేషన్లు చేసుకోవడం లేదని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో కేఈ కృష్ణమూర్తి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆ రెండు జిల్లాల మధ్యే రాజధాని ఏర్పాటవుతుందంటూ ప్రచారం జరగడంతోత వ్యాపారులు ధరలు విపరీతంగా పెంచారని చెప్పారు. భూమల ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అందులో భాగంగా ప్రభుత్వ పరిమితిని దాటిన వారిపై జరిమాన విధిస్తామని అన్నారు. ప్రభుత్వ భూముల వివరాలన్నీ సాధ్యమైనంత త్వరగా వెబ్సైట్లో పెడుతున్నామని వివరించారు. రైతులకు కొత్త పాసు పుస్తకాలు మంజూరు చేస్తామని చెప్పారు. త్వరలో 20 లక్షల మంది లబ్దిదారులకు 25 వేల ఎకరాల భూమి పంపిణీ చేస్తామని ఈ సందర్బంగా కేఈ కృష్ణమూర్తి తెలిపారు. -
మాఫీ సంపూర్ణంగా ఉండకపోవచ్చు: కేఈ
సాక్షి, కర్నూలు: రైతులు సంతృప్తి చెందేవిధంగా రుణమాఫీ ఉంటుందని, అయితే పూర్తి స్థాయిలో చేయలేకపోవచ్చని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఏర్పాటయ్యేదీ తవుకే తెలియదని, ప్రస్తుతం వచ్చేవన్నీ ఊహాగానాలేనని పేర్కొన్నారు. అనూహ్యంగా పెరుగుతున్న భూముల ధరలకు కళ్లెం వేస్తామని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల జోరుకు అడ్డుకట్ట వేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన ట్లు చెప్పుకొచ్చారు.