
మాఫీ సంపూర్ణంగా ఉండకపోవచ్చు: కేఈ
సాక్షి, కర్నూలు: రైతులు సంతృప్తి చెందేవిధంగా రుణమాఫీ ఉంటుందని, అయితే పూర్తి స్థాయిలో చేయలేకపోవచ్చని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఏర్పాటయ్యేదీ తవుకే తెలియదని, ప్రస్తుతం వచ్చేవన్నీ ఊహాగానాలేనని పేర్కొన్నారు. అనూహ్యంగా పెరుగుతున్న భూముల ధరలకు కళ్లెం వేస్తామని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల జోరుకు అడ్డుకట్ట వేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన ట్లు చెప్పుకొచ్చారు.