* జీరో బ్యాలెన్స్ అకౌంట్లకు మంగళం
* నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుంచి ఖాతాకు రూ.200 చొప్పున వసూలు
* రూ.3.46 కోట్లు సేకరణ
* డిపాజిట్లు లేకపోవడం వల్లే అలా చేశారట
ఏలూరు (టూ టౌన్) : రైతులకు అండగా నిలవాల్సిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) నిబంధనలను తోసిరాజని వారిపైనే భారం మోపుతోంది. రుణమాఫీ కోసం డీసీసీబీ శాఖల్లో ప్రతి రైతుకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవాలని ఆదేశాలు అందాయి. ఇదే సందర్భంలో 34 కాలమ్స్‌లో పేర్కొన్న వివరాలు సేకరించాలని ఉత్తర్వులు వచ్చాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీబీలు రైతులకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఇచ్చారుు. మన జిల్లాలో మాత్రం డీసీసీబీ అధికారులు ప్రతి అకౌంట్‌కు రూ.200 చొప్పున కట్టి తీరాలనే నిబంధన పెట్టారు. జిల్లాలోని 258 సహకార సంఘాల్లో 1.99 లక్షల మంది రైతులు రుణాలు తీసుకోగా, ఇప్పటివరకూ 1.73 లక్షల మంది రైతులకు సంబంధించిన ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించి, ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఈ సందర్భంలో ఖాతాలు తెరిచిన ఒక్కొక్క రైతు నుంచి రూ.200 చొప్పున రూ.3.46 కోట్లను డీసీసీబీ సేకరించింది.
సహకార సంఘాల ఖర్చులూ
రైతుల నెత్తినే
రుణ మాఫీ అమలు కావాలంటే ఖాతాలన్నిటికీ ఆధార్ అనుసంధానించి, ఆన్‌లైన్ చేయూలనే నిబంధన విధించడంతో సహకార సంఘాలపైనా మోయలేని భారం పడుతోంది. రైతులకు సంబంధించిన డేటా ఎంట్రీ చేయించడంతోపాటు స్టేషనరీ, టీఏ, డీఏ తదితర ఖర్చులు తడిసి మోపుడవుతున్నారుు. ప్రతి సంఘంపై రూ.25 వేల నుంచి 30 వేల వరకూ ఖర్చువుతోంది. సహకార సంఘాలు ఈ ఖర్చులను కూడా రైతుల నెత్తినే వేసేందుకు సిద్ధమవుతున్నారుు. రుణమాఫీకి సంబంధించి తొలుత 31 కాలమ్స్‌తో వివరాలు నమోదు చేయూలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ తరువాత రైతు ఇంటి పేరును పూర్తిగా రాయూలని మరో కాలం, తదనంతరం రైతుకు పొలం ఎంత ఉంది. ఆ పొలంలో ఏ పంట వేశారనే వివరాలు అడగడంతో డేటా ఎంట్రీని మూడుసార్లు మార్చాల్సి వచ్చింది. దీనివల్ల సహకార సంఘాలపై అదనపు భారం పడింది. రుణమాఫీ అవుతుందో లేదో తెలియదు గాని, రైతులకు మాత్రం అదనపు ఖర్చు అవుతోంది.
డీసీసీబీ తీరిది
Published Sat, Oct 18 2014 2:47 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement