District Central Co-operative Bank
-
డీసీసీబీ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం!
♦ ప్రేమయ్యకు తప్పని పదవీ గండం ♦ డీసీవోకు 15 మంది డెరైక్టర్ల నోటీసులు ♦ త్వరలో అవిశ్వాస పరీక్ష తేదీ ప్రకటన ♦ ఏప్రిల్ 7న ఎన్నికలు జరిగే అవకాశం ♦ ఐడీసీఎంఎస్పై తాత్కాలికంగా వాయిదా ♦ డీసీసీబీ వైస్ చైర్మన్ రేసులో సంపత్ గౌడ్? సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ఉపాధ్యక్షుడు పరికె ప్రేమయ్య (ప్రేంకుమార్) పదవికి ఎసరు వచ్చింది. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయనను ఉపాధ్యక్ష పదవి నుంచి దింపేందుకు అవిశ్వాసం నోటీసు దాఖలైంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది డెరైక్టర్లు గురువారం నిజామాబాద్‌లోని డీసీవో కార్యాలయంలో జిల్లా సహకార అధికారి గంగాధర్‌ను కలిసి నోటీసు ఇచ్చారు. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గంగాధర్ పట్వారీ(బోధన్ మండలం) డీసీసీబీ చైర్మన్‌గా, దోమకొండ మండలానికి చెందిన ప్రేమయ్య పీఏసీఎస్ అధ్యక్షునిగా గెలిచి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలకు చెందిన పలువురు డెరైక్టర్లు టీఆర్ఎస్లో చేరగా, ఏకంగా డీసీసీబీ చైర్మన్ గంగాధర్ పట్వారీ పదవికే గండం ఏర్పడ ఆయన పార్టీ మార్చి పదవిని దక్కించుకున్నారు. కాగా తాజాగా వైస్ చైర్మన్ ప్రేమయ్యను దింపేందుకు అవిశ్వాసం నోటీసు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. డీసీసీబీ వైస్ చైర్మన్ ఎన్నికపై నేడో, రేపో ప్రకటన ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఇంట్లో కొద్ది రోజుల క్రితం సమావేశమైన మంత్రి, ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు మెజార్టీ సభ్యులు గురువారం డీసీవోకు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు మొత్తం 20 మంది డెరైక్టర్లలో 14 మంది మద్దతు అవసరం ఉంది. 2013లో మొత్తం 20 మంది డెరైక్టర్లకు 11 మంది కాంగ్రెస్, ఐదుగురు వైఎస్సార్ సీపీ, నలుగురు టీఆర్ఎస్కు చెందిన వారు ఎన్నికయ్యారు. ఎస్సీలకు రిజర్వు చేయబడిన ఒడ్డెపల్లికి ఎవరు నామినేషన్ వేయకపోవడంతో అప్పట్లో వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన గంగాధర్ పట్వారీ చైర్మన్‌గా, ప్రేమయ్య వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మారిన రాజకీయ పరిణామక్రమంలో అధికార పార్టీ నేతలు అవిశ్వాసంకు సరిపడే విధంగా 15 మంది డెరైక్టర్లను కూడగట్టారు. మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకున్న టీఆర్ఎస్ మరికొందరు డెరైక్టర్లను కూడగట్టి గంగాధర్ పట్వారీపై అవిశ్వాసంకు ప్రయత్నించగా పార్టీ మారి పదవిని కాపాడుకున్నారు. ఇప్పుడు వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు 15 మంది సంతకాలతో కూడిన లేఖను డీసీవోకు సమర్పించారు. ఈ అంశంపై జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గంలో వాడివేడి చర్చ సాగుతోంది. కాగా డెరైక్టర్ల నుంచి అవిశ్వాసం నోటీసు స్వీకరించిన మాట వాస్తవమేనని, అయితే అవిశ్వాస పరీక్షకు ఇంకా తేదీని ప్రకటించలేదని డీసీవో గంగాధర్ ‘సాక్షి’కి తెలిపారు. నోటీసును పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా దాదాపుగా డీసీసీబీ వైస్ చైర్మన్‌పై ఏఫ్రిల్ 7న అవిశ్వాస పరీక్ష, ఆ వెంటనే కొత్త వైస్ చైర్మన్ జరిగే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. వైస్ చైర్మన్ రేసులో సంపత్ గౌడ్.. డీసీసీబీ వైస్ చైర్మన్ ప్రేమయ్యకు పదవీ గండం ఖాయమైంది. ఎందుకంటే డీసీసీబీ ఎన్నికల సమయంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ పీఏసీఎస్, డీసీసీబీ డెరైక్టర్ల సంఖ్య తగ్గింది. ఒకప్పుడు 11 మంది డెరైక్టర్లు ఉంటే.. ఇప్పుడు వైస్ చైర్మన్ ప్రేమయ్య, మరో ముగ్గురు మిగిలారు. ప్రేమయ్యతోపాటు మీసాల శ్రీనివాస్, గంగారెడ్డి, డిచ్పల్లికి చైర్మన్ జైపాల్‌లు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అవిశ్వాసం నెగ్గడానికి సరిపడే సభ్యులతో కలిసి అధికార పార్టీకి చెందిన డెరైక్టర్లు డీసీవో నోటీసు ఇవ్వగా.. బలపరీక్షలో నెగ్గడం సమస్యే కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో గంగాధర్ పట్వారీపై అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నం చేసిన లింగంపేట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు, డీసీసీబీ డైరక్టర్ ఈదురుగట్ల సంపత్ గౌడ్ వైస్ చైర్మన్ రేసులో ఉన్నారు. టీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్‌కు బావమరిదైన సంపత్ చురుకైన నాయకుడిగా పేరుండటంతో ఎంపీ, ఎమ్మెల్యేలు ఆయనకే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు 15 మంది డెరైక్టర్లతో కలిసి గురువారం సంపత్‌గౌడ్ నిజామాబాద్‌లో డీసీవోకు అవిశ్వాసం నోటీసు అందజేశారు. ఇదిలా వుండగా ఐడీసీఎంఎస్ ఉపాధ్యక్షులపై అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్న టీఆర్ఎస్ నేతలు ప్రేంకుమార్ విషయంలో స్పష్టతకు వచ్చినా... శ్రావణ్‌రెడ్డి విషయంలో వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు తెలిసింది. ఉన్న ఫలంగా డీసీఎంఎస్‌లో ఖాళీగా ఉన్న రెండు డైరక్టర్ పోస్టులను భర్తీ చేసి, మెజార్టీ కూడగట్టి అవిశ్వాసం తీర్మానం పెట్టే అవసరం ఉన్నందున వాయిదా వేసుకున్నట్లు చెప్తున్నారు. -
ఎవరికో పీఠం!
- డీసీసీబీ చైర్మన్, ైవె స్ చైర్మన్ల ఎన్నిక నేడు - గులాబీ పార్టీకే దక్కనున్నా... సారథిపైనే సందిగ్ధం - రేసులో పెంటారెడ్డి, మాధవరెడ్డి - వ్యూహ, ప్రతివ్యూహాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పీఠం గులాబీ పార్టీకే దక్కనుంది. వ్యూహాత్మక ఎత్తుగడ వేసిన తెలంగాణ రాష్ట్ర సమితి.. కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్లను అవిశ్వాసంతో గద్దె దింపింది. ఈ క్రమంలో కొత్తగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ రెండు పీఠాల్ని దక్కించుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. శనివారం ఉదయం డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలకు సహకార శాఖ ఏర్పాట్లు చేసింది. గులాబీ దళానికే పీఠం దక్కనుందని స్పష్టమవుతున్నప్పటికీ.. సారథిపై మాత్రం ఆ పార్టీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఉత్కంఠ రేపుతోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పీఠం గులాబీ పార్టీకే దక్కనుందని స్పష్టత వచ్చినప్పటికీ.. సారథిపై ఇంకా సందిగ్ధం వీడలేదు. ప్రస్తుతం ఇన్చార్జి చైర్మన్‌గా కొనసాగుతున్న పెంటారెడ్డికే పూర్తిస్థాయి చైర్మన్‌గా పదవిని కట్టబెట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అధిష్టానం సైతం ఆయనవైపు మొగ్గు చూపుతున్నందున పార్టీ వర్గాల్లో పెంటారెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే హైదర్షాకోట్ సొసైటీ చైర్మన్ మాధవరెడ్డి సైతం చైర్మన్ రేసులో ఉన్నారు. ఈ క్రమంలో వారిమధ్య సమోధ్య తీసుకువచ్చేందుకు మంత్రి మహేందర్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాలు శుక్రవారం రాత్రి పొద్దుపోయేవరకు మంత్రి నివాసంలో మంతనాలు జరిపాయి. మరోవైపు పదవి కోల్పోవడంతో కొంత ఆవేశంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్లో నెలకొన్న గందరగోళాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. గతంలో చైర్మన్ రేసులో ఉన్న పెంటారెడ్డి, మాధవరెడ్డి కాంగ్రెస్ మాజీలే. తాజా సమీకరణాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కోల్పోయినప్పటికీ.. టీఆర్ఎస్ వ్యూహాన్ని తారుమారు చేసే అవకాశం లేకపోలేదు. పెంటారెడ్డికి అధిష్టానం మద్దతు ఉండగా.. మాధవరెడ్డికి కాంగ్రెస్ డెరైక్టర్లు పరోక్షంగా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో 2/3 మెజార్టీ(13మంది డెరైక్టర్లు) మద్దతు కావాలి. ఆశావహుల మధ్య సానుకూల వాతావరణం రాకుంటే శనివారం నాటి ఎన్నికలో టీఆర్ఎస్ అంచనాలు తలకిందులయ్యే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. -
దారుణంగా మాఫీ
వసూలు చేసుకోవడం చేతకాక.. కుదవపెట్టిన డాక్యుమెంట్లే లేవనే సాకుతో మొండిబకాయిల రద్దుకు రంగం సిద్ధం పాలకవర్గాన్ని ఏమారుస్తున్న అధికారులు చేతులు మారిన రూ.50 లక్షలు..? డీసీసీబీలో కొత్త అవినీతి కోణం.. రూ.4కోట్ల మాఫీకి మహాజన సభలో నేడు తీర్మానంతప్పుబడుతున్న సహకార సంఘ నిపుణులు ఏదైనా సంస్థలో మొండిబకాయిలుంటే వాటిని ఏ విధంగా వసూలు చేసు కోవాలా? అని ఆలోచిస్తారు. కుదువపెట్టిన ఆస్తులను,తనఖా పెట్టిన డాక్యుమెంట్లను అడ్డం పెట్టుకుని రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. సామ,దాన,భేద,దండోపాయాలను ఉపయోగించి ఏదో విధంగా రాబట్టేందుకు యత్నిస్తారు. అడ్డగోలుగా మాఫీ చేయాలని చూడరు. కానీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) తీరేవేరు. వసూలు చేసుకోవడం చేతకాక..చేతులెత్తేయడమే కాదు..వాటిని అడ్డుగోలుగా మాఫీకి సిద్ధమైంది. మంగళవారం జరుగనున్న 42వ మహాజన సభలో ఈ మేరకు తీర్మానించనున్నారు. మొండి బకాయిదారులకు రూ.4 కోట్ల మేర లబ్ధి చేకూర్చే ఈ వ్యవహారంలో రూ.అరకోటికిపైగా చేతులు మారినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) మూడు దశాబ్దాలుగా వివిధ పథకాల కింద మంజూరు చేసిన రుణాలు అధికారుల ఉదాశీన వైఖరివల్ల వసూలుకాక నిరర్ధక ఆస్తులుగా పేరుకు పోయాయి. వీటివిషయంలో తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఆడిట్ కమిటీ కొత్త పాలకవర్గానికి సిఫారసు చేసింది. అంటే వసూలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని. కానీ డీసీసీబీ అధికారులు మాత్రం వాటిని రద్దు చేసి చేతులుదులుపుకోవాలని నిర్ణయానికి వచ్చి మహాజనసభ తీర్మానం కోసం అజెండాలో పెట్టారు. ఈ మొండి బకాయిల్లో ప్రధానంగా చెప్పు కోవలసినవి భూమి అభివృద్ధి బ్యాంకు రుణాలు (ల్యాండ్మార్టిగేజ్ లోన్స్). తమ భూముల అభివృద్ధి కోసం వాటి డాక్యుమెంట్లను కుదవపెట్టి తీసుకునే రుణాలివి. వీటి కింద జిల్లాలోని 14 మండలాల పరిధిలో 11,702 మందికి రూ.2, 55,21,000 ఇచ్చారు. 1759 మంది మత్స్యకారులకు మంజూరు చేసిన రూ.99.5లక్షలు, రెండు చేనేత సహకార సంఘాలకు రూ.91వేల రుణాలుండగా, నగదు పరపతి రుణాల కింద విశాఖపట్నం, మహారాణిపేట బ్రాంచ్‌ల పరిధిలో సూపర్ బజార్ కో-ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్‌కు రూ.26.22లక్షలు, మాడుగుల ఏజెన్సీ ప్రొడ్యూసర్స్‌కు రూ.73వేలు, కస్తూర్బా కో- ఆపరేటివ్ స్టోర్స్‌కు రూ.1.56 లక్షలు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ స్టోర్స్‌కు రూ.2.18లక్షలు, టీవీ అసెంబ్లింగ్ కో- ఆపరేటివ్ సొసైటీస్‌కి రూ.65వేలున్నాయి. మధ్యకాలిక వ్యవసాయేతర ఉద్యోగ సహకారసంఘాలకు మంజూరుచేసిన రుణాల కింద గోపాలపట్నం, ద్వారకానగర్, మహారాణి పేట బ్రాంచ్‌ల పరిధిలో 14 కో-ఆపరేటివ్ సొసైటీలు, ఉద్యోగ సంఘాలకు మంజూరు చేసిన రూ.8.42 లక్షలున్నాయి. వీటిలో మత్స్యకార, చేనేత సంఘాలకు మంజూరు చేసిన రుణాలు రద్దుచేసినా ఎవరూ ఆక్షేపించరు. ల్యాండ్ మార్టిగేజ్,నగదు పరపతి, మధ్యకాలిక వ్యవసాయేతర ఉద్యోగ సంఘాలకు మంజూరు చేసినరుణాలను రద్దు చేయాలని అజెండాలో చేర్చడం పట్ల సహకార సంఘ నిపుణులు తప్పుబడుతున్నారు. ల్యాండ్ మార్టిగేజ్ రుణాలంటే కుదవపెట్టిన డాక్యుమెంట్ల సంగతేమిటంటే ఏ బ్రాంచ్‌లోనూ అవి కనిపించడంలేదని అధికారులు పేర్కొనడం వారి నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది. వందకోట్ల టర్నోవర్లక్ష్యంగా దూసు కెళ్తున్న సూపర్ బజార్ కో- ఆపరేటివ్ సొసైటీకి ఇచ్చిన రూ.26.22లక్షల రుణాలు రద్దు చేయాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందంటున్నారు. అలాగే ఉద్యోగ సంఘాలకు మంజూరు చేసిన రుణాలను వసూలు చేసుకోవాలని..లేకుంటే వీటినిమంజూరు చేసిన అధికారుల నుంచి రికవరీ చేయాలే తప్ప ఈవిధంగా రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇలా మొత్తం రూ.3.95కోట్ల మొండి బకాయిలను ‘టెక్నికల్ రైటాఫ్’కు మహాజనసభ ఆమోదం కోసం పెడుతున్నట్టు అజెండాలో పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహా రంలో మొండిబకాయిదారుల నుంచి రూ.50లక్షల వరకు చేతులు మారినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లనే ఇంతకాలంగా ఉన్న ఈ మొండి బకాయిలను రైటాప్ చేసేందుకు అధికారులు నిర్ణయించారని తెలుస్తోంది. ఏది ఏమైనా పాలకవర్గం ఈ మొండి బకాయిల వసూలు, మాఫీ విషయంలో పునరాలోచన చేయాల్సినఅవసరం ఎంతైనా ఉందని సహకార సంఘ నిపుణులు సూచిస్తున్నారు. ఇలా మాఫీ చేసుకుంటూ పోతే భవిష్యత్‌లో డీసీసీబీ ద్వారా రుణాలు తీసుకున్న వారు పాలకవర్గాన్ని, అధికారులను మేనేజ్ చేసుకుంటే మాఫీ చేయించు కోవచ్చన్న భావనతో చెల్లించడం మానేస్తారన్న వాదన వ్యక్తమవుతోంది. ఇక ఎంతమాత్రం వసూలు కాదనే నిర్ణయానికి వచ్చి మాఫీ చేసేపరిస్థితి ఉంటే..ఈ రుణాలు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. -
పెరిగిన డీసీసీబీ రుణ పరపతి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసి రైతులకు అండగా ఉండేందుకు ఏర్పాటైన డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) లాభాల బాటలో పయనిస్తోంది. ప్రస్తుత పాలకవర్గం వివిధ రకాల సేవలను అమల్లోకి తెచ్చి రైతులకు అన్ని విధాల సహకరిస్తోంది. నాబార్డు నిధులతో, ఆప్కాబ్ సలహాలతో ఆర్థిక లావాదేవీలను రూ.420 కోట్లకు పెంచడంలో ప్రస్తుత పాలక సభ్యులు విజయం సాధించారు. భవిష్యత్తులో డీసీసీబీని మరింత లాభాల బాటలోకి నడిపిస్తామని, రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని ఆ బ్యాంకు చైర్మన్ డోల జగన్ అన్నారు. ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. లాభాల్లో పీఏసీఎస్‌లు రైతులకు లాభాలు చేకూర్చడమే థ్యేయంగా పనిచేస్తున్నాం. గత బోర్డు రూ.270 కోట్ల లావాదేవీలకే పరిమితమైపోతే మేం దాన్ని రూ.420 కోట్లకు పెంచాం. ఇంకా పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. 49 సహకార సంఘాల్లో 34 సంఘాలు ఇప్పటికే లాభాల బాట పట్టాయి. రూ.110 కోట్ల స్వల్పకాలిక రుణాలిచ్చాం. వీటి ద్వారా ప్రతి సంఘానికి ఒక శాతం లాభం వస్తుంది. నాబార్డు సూచనలతో పీఏసీఎస్‌లను బలోపేతం చేసేందుకు బోర్డు సభ్యులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. సభ్యులు రూ.15 చెల్లిస్తే ఏడాదికి రూ. ఒక లక్ష వరకూ బీమా పొందే ందుకు అవకాశం కల్పించాం. ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్‌ల ద్వారా ఆ సొమ్ముకు బాధ్యత విహ ంచేలా చూస్తున్నాం. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. మల్టీ సర్వీస్ సెంటర్లతో ఫలితాలు డీసీసీబీ ద్వారా ప్రవేశపెట్టిన మల్టీ సర్వీస్ సెంటర్లు సత్ఫలితాలనిస్తున్నాయి. తొలుత కొత్తూరు ప్రాంతంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో దీన్ని ప్రారంభించాం. అక్కడ పది దుకాణాలు ఏర్పాటు చేశాం. దీనివల్ల ఆయా సొసైటీలకు నెలకు రూ. లక్ష ఆదాయం వచ్చే అవకాశం కలిగింది. త్వరలో సంతకవిటి, బుడితి, భామిని, లోలుగు, కొత్తూరు, ఇచ్చాపురం ప్రాంతాల్లో మల్టీ సర్వీస్ సెంటర్లు తెరుస్తాం. పంట రుణాలు విరివిగా అందజేయడం సంస్థకు భారమే అయినప్పటికీ రైతుల కోసం ఆ మాత్రం చేయక తప్పదు. దీర్ఘకాలిక రుణాలు, వ్యవసాయ పనిముట్లు అందజేయడం వల్ల రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్తులో రుణమేళాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలుస్తాం. గతంలో అలా..ఇప్పుడిలా.. డీసీసీబీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రూ.120 కోట్ల స్వల్పకాలిక రుణాలు, రూ.7 కోట్ల దీర్ఘకాలిక రుణాలు, బంగారు ఆభరణాలపై రూ.9 కోట్ల రుణాలు, ఇతర రుణాలు రూ.1.5 కోట్లు ఇచ్చాం. అదే సమయంలో రూ.32కోట్ల డిపాజిట్లు సేకరించాం. ఫిక్స్డ్ డిపాజిట్లపై వివిధ బ్యాంకులు 9.35 శాతం వరకే వడ్డీ ఇస్తుంటే మేం 9.75 శాతం ఇస్తున్నాం. మా వద్ద 1.30 లక్షల మంది రైతులకు ఖాతాలున్నాయి. నరసన్నపేటలో ఏప్రిల్ మొదటి వారంలో మరో బ్రాంచి తెరుస్తున్నాం. మొత్తం 49 సొసైటీల్లో 26 సొసైటీలకు సొంత భవనాలున్నాయి. మిగతా వాటికి సమకూర్చే ప్రయత్నాల్లో ఉన్నాం. రుణమాఫీకి సంబంధించి తొలివిడతలో రూ.79.55 లక్షలకు అప్లోడ్ చేశాం. రెండోదశకు సంబంధించి రూ.101 కోట్లకు ప్రభుత్వానికి నివేదించాం. గత బోర్డు ఆధ్వర్యంలో 9వేల మెట్రిక్ టన్నుల ఎరువుల వ్యాపారం చేస్తే ఇప్పుడు 19,045 టన్నుల వ్యాపారం చే శాం. గతంలో 2710 టన్నుల విత్తనాలు విక్రయిస్తే ఇప్పుడు 3795 టన్నులు విక్రయించాం. గతంలో 16,100 టన్నుల ధాన్యం సేకరించగా ఇప్పుడు 1,83,390 టన్నులు సేకరించాం. పెరుగుతున్న లాభాలు 2013లో సంస్థ రూ. 2.35 కోట్ల లాభాలు ఆర్జించగా 2014లో రూ.2.43 కోట్లకు చేరింది. ప్రస్తుతం అవి రూ.2.5 కోట్లకు పెరిగాయి. గతంలో మూడు సొసైటీలే లాభాల్లో ఉండగా ఇప్పుడు 34 సంఘాలు లాభాల్లో ఉన్నాయి. అప్పట్లో డీసీసీబీకి జిల్లాలో 13 బ్రాంచీలుంటే ఇప్పుడు 15కు పెరిగాయి. సంస్థకు చెందిన రూ.30 కోట్లు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. రైతులిచ్చిన ఆ సొమ్ముకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం లేకపోయినా మేం వడ్డీ కడుతున్నాం. ఆ సొమ్ము కోసం ఆప్కాబ్ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. -
కుంభకోణం..రూ.9.3 కోట్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలోని దేవరకొండ బ్రాంచిలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణం కథ క్లైమాక్స్‌కు చేరింది. మొత్తం రూ.9.3 కోట్ల కుంభకోణంలో కీలకపాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై జిల్లా సహకార అధికారి (డీసీఓ) సెక్షన్ 51 కింద చేపట్టిన విచారణ నివేదిక ఆధారంగా, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సహకార శాఖ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గత నెల 16న సహకార శాఖ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి డీసీఓకు సర్క్యులర్ నంబర్ 19567/2013-సీఆర్-2 పేరిట ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వుల్లో కుంభకోణ ంతో ప్రమేయం ఉందని 51 విచారణలో తేలిన 13 మందిపై క్రిమినల్ కేసులు పెట్టడంతోపాటు 21మంది ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. క్రిమినల్ కేసుల విషయంలో కలెక్టర్ అనుమతి తీసుకుని ముందుకెళ్లాలని, అదే విధంగా రిజిస్ట్రార్ నుంచి వచ్చిన సమీక్ష ఉత్తర్వులను, డీసీఓ విచారణ నివేదికను డీసీసీబీ జనరల్ బాడీ, ప్రత్యేక జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి నెలరోజుల్లోపు ఆమోదం పొందాలని సూచించింది. ఈ కుంభకోణంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు జాయింట్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకు అధికారాలు కట్టబెట్టింది. అసలేం జరిగిందంటే.. దేవరకొండ బ్రాంచి పరిధిలోని దేవరకొండ, పీఏపల్లి, తిమ్మాపూర్, చితిర్యాల, కొండమల్లేపల్లి, డిండి, తౌక్లాపూర్ ప్రాథమిక సహకార పరపతి సంఘాల్లో రైతులకు రుణాలిచ్చే విషయంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. 2010 నుంచి 2014 వరకు ఆయా సొసైటీల చైర్మన్లు, సీఈఓలు, బ్యాంకు ఉద్యోగులు కుమ్మక్కై మొత్తం 12.33 కోట్ల రూపాయలు కాజేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సహకార చట్టంలోని సెక్షన్ 51 కింద డీసీఓ విచారణ జరిపి సహకార శాఖ రిజిస్ట్రార్‌కు నివేదిక పంపారు. ఈ నివేదికలో బోగస్ టైటిల్ డీడ్లు, నకిలీ పాసు పుస్తకాల మీద రుణాలిచ్చారని, చనిపోయిన వారికి, నివాసేతరులకు, విదేశాల్లో ఉంటున్న వారికి కూడా రుణాలు మంజూరు చేశారని నివేదికలో పేర్కొన్నారు. అసలు రుణాలు ఎవరి పేరు మీద తీసుకున్నారో వారికి తన పేరు మీద రుణం తీసుకున్నట్టు కూడా తెలియదని కూడా తేలింది. ఇందుకు బాధ్యులైన వారి పేర్లను తెలియజేస్తూ వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిని సమీక్షించిన సహకార శాఖ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఎం.సురేందర్ ఈ నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలను సిఫారసు చేస్తూ గతనెల 16న సమీక్ష ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని రకాల చర్యలకూ సిఫారసు ఈ ఉత్తర్వుల ప్రకారం కుంభకోణంలో బా ధ్యులైన వారిపై క్రిమినల్,శాఖా పరమైన చర్య లు తీసుకోవాలని సహకార శాఖ రిజిస్ట్రార్ సురేందర్ జిల్లా సహకార అధికారిని ఆదేశించారు. మొత్తం 13 మందిపై క్రిమినల్, 21 మంది ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలకు సిఫారసు చేశారు. వీరినుంచి మొత్తం 9.27 కోట్ల రూపాయలను రికవరీ చేయాలని, రికవరీ చేసే నాటికి 12 శాతం వడ్డీతో సహా రా బట్టాలని సూచించారు. అవసరమైతే ఈ కుంభకోణంలో బాధ్యులైన వారి ఆస్తులను కూడా అటాచ్ చేసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష ఉత్తర్వుల ప్రకారం జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి ఎలా ముందుకెళ్లాలన్నది అనుమతి తీసుకోవాలని సూచించారు. అదే వి ధంగా విచారణ నివేదికతోపాటు సమీక్ష ఉత్తర్వులను కూడా డీసీసీబీ బోర్డు మీటింగ్‌లో ఆమోదం తీసుకుని ముందుకెళ్లాలని తెలి పా రు. ఆయా సొసైటీల్లో బోగస్ రుణాలుగా తేలి న 9.27 కోట్ల రూపాయల మేర పంటరుణాల కు రుణమాఫీని కూడా వర్తింపజేయవద్దని సొ సైటీల మేనేజింగ్ కమిటీలను ఆదేశించింది. పాస్ పుస్తకాలు తెప్పించండి.. దేవరకొండ, పీఏపల్లి, తిమ్మాపూర్, చితిర్యాల, కొండమల్లేపల్లి, డిండి, తౌక్లాపూర్ పరిధిలో అక్రమంగా రుణాలు తీసుకున్న వారి పాసు పుస్తకాలు, టైటిల్డీడ్లు తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయా సొసైటీల మేనేజింగ్ కమిటీలను సహకార రిజిస్ట్రార్ ఆదేశించారు. ఈ ఏడాది మార్చి 15లోగా వీటిని తెప్పించాలని, ఆయా సొసైటీలను సమన్వయం చేసుకుని ఆయా పుస్తకాలను తెప్పించే బాధ్యతను జిల్లా సహకార అధికారి తీసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి ప్రగతి సాధించారో పాసుపుస్తకాలు, టైటిల్డీడ్ల వారీగా ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదికను పంపాలని సూచించారు. అదే విధంగా ఈ ఏడాది మార్చి 15లోపు పాసుపుస్తకాలు, టైటిల్డీడ్లను స్వాధీనం చేసుకోని పక్షంలో డీసీసీబీ బ్రాంచి మేనేజర్‌తో పాటు ఆయా సొసైటీల అధ్యక్షులు, సీఈవోలను బాధ్యులను చేసి దుర్వినియోగమైన రూ.9.27 కోట్ల రూపాయలను వారి నుంచి రాబట్టాలని, క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరి, సహకార రిజిస్ట్రార్ సమీక్ష ఉత్తర్వులు ఏ మేరకు అమలవుతాయనేది వేచి చూడాల్సిందే. -
డీఛీఛీబీ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇంటిపేరు కస్తూరి వారు..ఇల్లంతా గబ్బిలాల కంపు అన్నట్టు ఉంది జిల్లాలో డీసీసీబీ(జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) పరిస్థితి. నమ్మకమే పెట్టుబడిగా ఈ బ్యాంకులో ఇన్నాళ్లూ లావాదేవీలు జరిగాయి. ప్రజలకు చెందిన కోట్లాది రూపాయల డిపాజిట్లు ఇందులో ఉన్నాయి. జిల్లాలోని రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది. దానిపై ఆధారపడి సుమారు రూ.350మంది ఉద్యోగులు ఉన్నారు. ఇదంతా గతం. అయితే బ్యాంకు వ్యవహారాల్లో మాత్రం ఎప్పుడూ అంత పారదర్శకత కనిపించడం లేదు. తరచూ అక్రమాల ఆరోపణలతో వార్తల్లోకి వస్తోంది. దీనికంతటికీ ఇక్కడ కేంద్రంగా తిష్ఠ వేసిన రాజకీయ పక్షాలు, వాళ్ల ఇష్టారాజ్యమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదులొచ్చినప్పుడు సంబంధిత శాఖల ఉన్నత స్థాయి వర్గాలు విచారణ చేసి వీరికి భయపడి చేతులు దులిపేస్తున్నాయి తప్పిస్తే..విచారణలో తేలిన అక్రమాలను బహిర్గతం చేయడం లేదు. ఇక అక్రమార్కులపై చర్యలు సరేసరి. డీసీసీబీలో పలు అక్రమాలు జరుగుతున్నట్లు విజయనగరానికి చెందిన హరోన్ రషీద్ అనే వ్యక్తి నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్, ఆప్కాబ్ మేనేజింగ్ డెరైక్టర్‌కు 2013డిసెంబర్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై ఆప్కాబ్ చీఫ్ జనరల్ మేనేజర్ (విజిలెన్స్)తో ప్రాథమిక విచారణ చేయించారు. ఈ ప్రాథమిక విచారణలో గుర్తించిన అంశాలతో విచారణాధికారి నివేదిక ఇచ్చారు. అందులో పలు అవినీతి అభియోగాలను పొందుపరిచారు. -
బొత్సే టార్గెట్ ?
* అందుకే రావివలస సొసైటీ డొంకలాగుతున్న టీడీపీ నేతలు * ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా అక్రమాలు జరిగినట్టు ఫోకస్ చేయనున్న దేశం తమ్ముళ్లు * అసెంబ్లీలో ప్రస్తావన తెచ్చేందుకు * ఇదో వ్యూహాత్మక ఎత్తుగడ అంటున్న పరిశీలకులు చంద్రబాబుతో కమిటీ * వేయించి బొత్సపై కేసులు పెట్టే యోచన? సాక్షి ప్రతినిధి, విజయనగరం : పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను టీడీపీ నేతలు టార్గెట్ చేసినట్టు సమాచారం. లిక్కర్ కేసుతో లక్ష్యం నెరవేరకపోవడంతో డీసీసీబీ(జిల్లా కేంద్ర సహకార బ్యాంకు)పై దృష్టి సారించారని తెలిసింది. డీసీసీబీ పరిధిలో జరిగిన అక్రమాల్ని బయటపెట్టి తద్వారా బొత్సపై కసి తీర్చుకోవచ్చని యోచిస్తున్నట్టు భోగట్టా. ఈమేరకు ఎప్పటినుంచో ఉన్న బినామీ రుణాల ఆరోపణలను తెరపైకి తీసుకొస్తున్నారు. అందుకు శాంపిల్‌గా గరుగుబిల్లి మండలం రావివలస ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో బినామీ రుణాల వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా సొసైటీల్లో బినామీల ముసుగులో కో ట్లాది రూపాయలు కాజేశారన్న ఆరోపణలు చేయనున్నారు. దీన్ని అసెంబ్లీలో ప్రస్తావనకు తెచ్చి, సీఎం చంద్రబాబునాయుడుతో డీసీసీబీ అక్రమాలపై విచారణ జరిపేందుకు కమిటీ వేయించి, తద్వారా బొత్సను ఇరికించవచ్చని భావిస్తున్నారని తెలిసింది. పీసీసీ అధ్యక్షుడు హోదా వరకు ఎదిగిన బొత్స సత్యనారాయణ తన రాజకీయ ప్రస్థానం గాజులరేగ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకారం నుంచే ప్రారంభించారు. ఆ సొసైటీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికై 1992 నుంచి 1995 వరకు మూడు సంవత్సరాల పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) చైర్మన్‌గా పనిచేశారు. 1995లో కూడా రెండోసారి డీసీసీబీ చైర్మన్‌గా పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ఏకైక డీసీసీబీ చైర్మన్ పోస్టు కూడా ఇదే. అయితే, ఆ సమయంలో డీసీసీబీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని టీడీపీ, వామపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. ముఖ్యంగా బినామీల పేరుతో డీసీసీబీ పరిధిలోని పీఏసీఎస్‌ల నుంచి బొత్స కుటుంబీకులు, వారి అనుచరులు పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నారని, అందుకే మొండి బకాయిలు ఎక్కువగా ఉండిపోయాయని అప్పట్లో విమర్శలొచ్చాయి. ఆరోపణలు ఎన్ని వచ్చినా అవేవీ నిర్ధారణ కాలేదు. ఆరోపణల గ్రాఫ్ ఎక్కువవుతున్న కొద్దీ రాజకీయంగా బొత్స ఎదుగుతూ వచ్చారు. ఒకసారి ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, పదేళ్ల కాలం మంత్రిగా పనిచేశారు. పీసీసీ అధ్యక్షునిగా నియమితులై తిరుగులేని రాజకీయ నేతగా ఎదిగారు. ఈ నేపథ్యంలోనే బొత్సను లిక్కర్ వివాదం చుట్టు ముట్టింది. లిక్కర్ సిండికేట్‌ను నిర్వహించి కోట్లు ఆర్జించారని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. దానిపై ఏసీబీ విచారణ కూడా జరిగింది. అయితే, బొత్స అప్రతిష్ట పాలయ్యారే తప్ప కేసుల బారిన పడలేదు. దీనివెనుక అనేక కారణాలున్నాయని సమాచారం. ఇంతలోనే ఎన్నికలు రావడం, అక్రమాలు, రాష్ట్ర విభజన ఆరోపణల నేపథ్యంలో ఓటమి పాలయ్యారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులంతా ఓడిపోయారు. దీంతో చక్రం తిప్పిన నేత జీరో అయ్యారు. బీజేపీలో చేరుతారనే ..? కొత్త ప్రభుత్వాలొచ్చిన కొన్నాళ్లకు బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు తెరపైకొచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన అనుచరులు బీజేపీలోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఇందుకూరి రఘురాజు, ముద్దాడ మధు ఆ పార్టీలో చేరారు. క్రమేపి పార్టీలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. టీడీపీకి ఈ పరిణామాలు మింగుడు పడడం లేదు. ఒకవేళ బొత్స బీజేపీలో చేరితే తమకు ఇబ్బందులెదురవుతాయని భావిస్తున్నారు. మిత్రపక్షంగా అజమాయిషీ చెలాయిస్తారేమోనని గుబులు చెందుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే బొత్సను మరింత బదనాం చేయాలని, ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తిని తీసుకుంటే పార్టీకే నష్టమే అన్న అభిప్రాయాన్ని బీజేపీ నేతల్లో తీసుకు రావాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఇందులో భాగంగా బినామీ రుణాల వ్యవహారాన్ని బయటికి తీసుకొస్తే తమ లక్ష్యం నెరవేరుతుందన్న యోచనలో ఉన్నట్టు తెలియవచ్చింది. ఇన్నాళ్లూ అధికారంలో లేకపోవడంతో అంతర్గతంగా ఏం జరిగిందో తెలియక ఏం చేయలేకపోయామని, ఇప్పుడు అధికారులు చెప్పినట్టు వింటారని, మొత్తం రికార్డులన్నీ బయటికి తీసి లోగుట్టు బయటపెట్టాలని భావిస్తున్నారు. డీసీసీబీలో పనిచేస్తున్న ఒకరిద్దరు అధికారులు గతంలో కాంగ్రెస్‌లో ఉన్న నేతలకు బంధువులు కావడం, ఇప్పుడదే నేతలు టీడీపీలో చేరడంతో సదరు అధికారుల ద్వారానే ఎప్పటికప్పుడు రికార్డులు తెప్పించుకోవచ్చని భావనతో ఉన్నట్టు సమాచారం. ఈ విధంగానో , మరే మార్గమో ద్వారా తెలియదు గాని వచ్చిన సమాచారంతో రావివలస సొసైటీలో చోటు చేసుకున్న బినామీ రుణాల వ్యవహరాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు తెలిసింది. రావివలసనే ఎందుకు ఎంచుకున్నారంటే... ఒకప్పుడు డీసీసీబీ చైర్మన్‌గా పనిచేసి, దివంగతులైన మరిశర్ల సింహాచలంనాయుడు బొత్సకు ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. అప్పట్లోనే బినామీ రుణాల ఆరోపణలొచ్చాయి. సింహాచలంనాయుడు మరణించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య తులసీ డీసీసీబీ చైర్మన్ అయ్యారు. ఈమె రావివలస పీఏసీఎస్ అధ్యక్షురాలు హోదాతో డీసీసీబీ చైర్మన్ అయ్యారు. ఈమె కాలంలో బినామీ పేర్లతో రుణాలు ఇచ్చారన్న విమర్శలొచ్చాయి. అయితే, ఇప్పుడా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడొకరు జిల్లాలో కీలక పదవి చేపడుతున్న ఓ మహిళ భర్త. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో చరుకుగా ఉన్నారు. అక్కడ జరుగుతున్న విషయాలను ఆయనే వెలుగులోకి తెచ్చారు. దీంతో మీడియాకు ఎక్కాయి. కాగా బినామీ రుణ బాధితులగా చెప్పుకుంటున్న కొందర్ని జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి టీడీపీ నాయకులే ప్రెస్మీట్లు పెట్టిస్తున్నారు. వాళ్లకయ్యే ఖర్చులన్నీ వారే భరిస్తున్నారు. ఇక్కడ వ్యవహారంపై నిగ్గు తేల్చితే డీసీసీబీ చైర్మన్ భయపడి వాస్తవాలు భయటపెడతారని వారి ఎత్తుగడ. తద్వారా బొత్సను లక్ష్యంగా చేసుకోవచ్చని భావిస్తున్నట్టు తెలిసింది.రావివలస విషయాన్ని ముందుపెట్టి ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా జరిగిందంటూ అసెంబ్లీలో ప్రస్తావించాలని కూటమిగా ఏర్పడ్డ ఇద్దరు ఎమ్మెల్యేలు, మరికొందరు నేతలు పథక రచన చేసినట్టు తెలిసింది. చంద్రబాబు చేత కమిటీ వేయించి, విచారణ చేపడితే వాస్తవాలు బయటికి వస్తాయని, తద్వారా బొత్స దొరుకుతారని అభిప్రాయపడుతున్నారు. అయితే, తిలాపాపం-తలా పిడికెడు అన్నట్టుగా బినామీ రుణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారని తెలిసింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన నేతలపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ కారణంగానే రావివలస సొసైటీ బినామీ రుణాల విషయంలో కొందరు ఎమ్మెల్యేలు కనీసం నోరెత్తడం లేదు. ఎటెళ్లి ఎటొస్తుందోనని భయంతో మాట్లాడటం లేదు. ఇంతవరకు పార్వతీపురం డివిజన్ నేతలు దీనిపై కనీసం స్పందించలేదు. ప్రతీదానికి అశోక్ బంగ్లాకొచ్చి గొంతు చించుకునే నేతలు ఈ విషయంలో ఆ జోలికే పోవడం లేదు. ఈ కారణంగానే గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు ఒక కూటమి సారధిగా వ్యవహరిస్తూ తరుచూ ప్రెస్మీట్లు పెడుతున్నారని సమారాం. అసెంబ్లీలో ప్రస్తావిస్తామంటూ చెప్పుకొస్తున్నారు. అయితే, పథకం ప్రకారం సక్సెస్ అవుతారో లేదంటే తెరవెనుక లాలూచీతో వెనక్కి తగ్గుతారో చూడాలి. -
డీసీసీబీ తీరిది
* జీరో బ్యాలెన్స్ అకౌంట్లకు మంగళం * నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుంచి ఖాతాకు రూ.200 చొప్పున వసూలు * రూ.3.46 కోట్లు సేకరణ * డిపాజిట్లు లేకపోవడం వల్లే అలా చేశారట ఏలూరు (టూ టౌన్) : రైతులకు అండగా నిలవాల్సిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) నిబంధనలను తోసిరాజని వారిపైనే భారం మోపుతోంది. రుణమాఫీ కోసం డీసీసీబీ శాఖల్లో ప్రతి రైతుకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవాలని ఆదేశాలు అందాయి. ఇదే సందర్భంలో 34 కాలమ్స్‌లో పేర్కొన్న వివరాలు సేకరించాలని ఉత్తర్వులు వచ్చాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీబీలు రైతులకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఇచ్చారుు. మన జిల్లాలో మాత్రం డీసీసీబీ అధికారులు ప్రతి అకౌంట్‌కు రూ.200 చొప్పున కట్టి తీరాలనే నిబంధన పెట్టారు. జిల్లాలోని 258 సహకార సంఘాల్లో 1.99 లక్షల మంది రైతులు రుణాలు తీసుకోగా, ఇప్పటివరకూ 1.73 లక్షల మంది రైతులకు సంబంధించిన ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించి, ఆన్లైన్లో పొందుపరిచారు. ఈ సందర్భంలో ఖాతాలు తెరిచిన ఒక్కొక్క రైతు నుంచి రూ.200 చొప్పున రూ.3.46 కోట్లను డీసీసీబీ సేకరించింది. సహకార సంఘాల ఖర్చులూ రైతుల నెత్తినే రుణ మాఫీ అమలు కావాలంటే ఖాతాలన్నిటికీ ఆధార్ అనుసంధానించి, ఆన్లైన్ చేయూలనే నిబంధన విధించడంతో సహకార సంఘాలపైనా మోయలేని భారం పడుతోంది. రైతులకు సంబంధించిన డేటా ఎంట్రీ చేయించడంతోపాటు స్టేషనరీ, టీఏ, డీఏ తదితర ఖర్చులు తడిసి మోపుడవుతున్నారుు. ప్రతి సంఘంపై రూ.25 వేల నుంచి 30 వేల వరకూ ఖర్చువుతోంది. సహకార సంఘాలు ఈ ఖర్చులను కూడా రైతుల నెత్తినే వేసేందుకు సిద్ధమవుతున్నారుు. రుణమాఫీకి సంబంధించి తొలుత 31 కాలమ్స్‌తో వివరాలు నమోదు చేయూలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ తరువాత రైతు ఇంటి పేరును పూర్తిగా రాయూలని మరో కాలం, తదనంతరం రైతుకు పొలం ఎంత ఉంది. ఆ పొలంలో ఏ పంట వేశారనే వివరాలు అడగడంతో డేటా ఎంట్రీని మూడుసార్లు మార్చాల్సి వచ్చింది. దీనివల్ల సహకార సంఘాలపై అదనపు భారం పడింది. రుణమాఫీ అవుతుందో లేదో తెలియదు గాని, రైతులకు మాత్రం అదనపు ఖర్చు అవుతోంది. -
డీసీసీబీలో ఇష్టారాజ్యం
వివాదాస్పదమైన రూ.కోటి విరాళం వినాయక ఆలయ నిర్మాణంపైన కోటి విమర్శలు చిత్తూరు(అగ్రికల్చర్): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లోని అధికారు లు, పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇవ్వ డం, డీసీసీబీ ఆవరణలో వినాయకస్వామి ఆలయ నిర్మాణం తదితర కీలక నిర్ణయాలు ముందస్తు అనుమతి లేకుండానే జరిగిపోయాయి. ఈ వ్యవహారంలో పాలకవర్గంలోని ప్రముఖ వ్యక్తి కీలకపాత్ర పోషించారు. సాధారణంగా సహకార శాఖలో ఏ అభివృద్ధి పని చేపట్టాలన్నా, ఇందుకు సంబంధించి పైసా నిధులు విడుదల చేయాలన్నా పాలకవర్గ సభ్యుల అనుమతి తప్పని సరి. అయితే డీసీసీబీలో మాత్రం ఇలాంటివి ఏమీ అమలుకావడం లేదు. పాలకవర్గంలోని ఓ ప్ర ముఖ వ్యక్తి కనుసన్నల్లోనే అన్ని పనులు జరుగుతా యి. ఈ విషయంగా పాలకవర్గంలోని పలువురు స భ్యులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నా రు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో టీడీపీ సహకారంతో డీసీసీబీ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న వ్యక్తికి, ఆ పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో చైర్మన్ వ్యవహారాన్ని ప్రశ్నించలేక సభ్యులు లోలోన కుమిలిపోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వివాదాస్పదమైన రూ.కోటి విరాళం పాలక వర్గ చైర్మన్ గత నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి రాజధాని నిర్మాణం కోసం రూ. కోటి చెక్కును విరాళంగా ఇచ్చారు. ఇంత మొత్తం పాలకవర్గ తీర్మా నం ఆమోదించకనే విరాళంగా ఇవ్వడాన్ని సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. కేవలం తాను చైర్మన్ అయ్యేందుకు గతంలో సహకరించారని, అందుకు ప్రతిఫలంగానే రాజధాని నిర్మాణానికి విరాళం ఇచ్చారని పాలవవర్గంలోని ఓ సభ్యుడు ‘సాక్షి’తో వాపోయారు. రెండు రోజుల క్రితం డీసీసీబీ పాలకమండలి సమావేశంలో ఈ విషయమై పాలకమండలి ఉపాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది. ఆలయ నిర్మాణంలో... డీసీసీబీ ఆవరణలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వినాయక స్వామి దేవాలయంపై కూడా విమర్శలు గుప్పుమంటున్నాయి. కార్యాలయానికి వాస్తు దోష నివారణకు వినాయకస్వామి దేవాలయాన్ని నిర్మించారు. దీనిపై కూడా పాలకవర్గ సభ్యులు ప్రశ్నించినట్లు తెలిసింది. వీధిపోటుకు చిన్నపాటి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే సరిపోయేది కదా, ఏకంగా లక్షలాది రూపాయలు వెచ్చించి గుడి నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదిలావుండగా ఆలయ నిర్మాణానికి సింగిల్‌విండోల నుంచి అనధికారికంగా పెద్ద మొత్తాల్లో విరాళాలు సేకరించడంపై కూడా సభ్యులు నిలదీసినట్లు తెలిసింది. నూతన భవన నిర్మాణంలోనూ... ప్రస్తుతం డీసీసీబీ ప్రధాన కార్యాలయ కార్యకలాపాలకు సరిపడా భవన సదుపాయం ఉన్నప్పటికీ, రూ.కోటి నిధులు వెచ్చించి నూతనంగా మరో భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ భవనం నిర్మాణానికి ఆప్కాబ్ నుంచి కొంత మేరకు సబ్సిడీ కింద నిధులు వచ్చాయని, అందుకు సంబంధించిన లెక్కలు తెలపడంలేదని సభ్యులు మండిపడుతున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచిచూడాల్సివుంది. చైర్మన్ అమాస రాజశేఖర్‌రెడ్డి ఏమన్నారంటే... రాజధాని నిర్మాణానికి రూ.కోటి ఇవ్వడంపై పాలకమండలి సభ్యులతో ముందే సంప్రదించాను. అయితే విరాళం చెక్కు ఇచ్చిన తరువాత సభ్యుల నుంచి ఆమోదం తీసుకున్నాను. వినాయకస్వామి ఆలయం నిర్మాణానికి నా సొంత నిధులు, కొందరు ఉద్యోగుల విరాళాలతో నిర్మించాం. కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న భవనానికి 8 నెలల క్రితమే సభ్యుల ఆమోదం పొంది టెండర్లు నిర్వహించాం. -
వెలుగు చూస్తున్న వ్యవహారాలు
- సీడీపీ నిధుల వినియోగంపై అభ్యంతరాలు - ‘అవిశ్వాసం’ అనంతరం వాడీవేడీగా డీసీసీబీ సమావేశం సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గంలో నెలకొన్న విభేదాలు మరోమారు బహిర్గతమయ్యాయి. ఇన్నాళ్లు అంతర్గతంగా సాగిన డీసీసీబీ వ్యవహారాలు ఈ విభేదాల పుణ్యమా అని ఇప్పుడు ఒక్కొక్కటిగా రచ్చకెక్కుతున్నాయి. ఇటీవల డీసీసీబీ చైర్మన్ ఎం.దామోదర్‌రెడ్డిపై అవిశ్వాసం అనంతరం తొలిసారిగా బుధవారం బ్యాంకు మేనేజింగ్ కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలో జరిగింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ , 2013-14 ఆర్థిక సంవత్సర అడిట్ నివేదికల ఆమోదం వంటి అంశాలపై సభ్యులు వాడీవేడీగా చర్చించారు. ఈ సమావేశానికి ఒకవర్గం డెరైక్టర్లు ఈ సమావేశానికి మీడియాను ఆహ్వానించాలని పట్టుబట్టగా, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి మాత్రం ఇందుకు అనుమతించలేదు. ఈసారి గతంలో ఎన్నడూ లేనివిధంగా డీసీసీబీలో కొనసాగుతున్న వ్యవహారాలు బయటకు పొక్కాయి. ఒకవర్గం డెరైక్టర్లు పలు అంశాలపై డీసీసీబీ ఉన్నతాధికారులను నిలదీశారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చు, బ్యాంకు లావాదేవీలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే సీడీపీ నిధుల వినియోగం అంశంపై కూడా వాడీవేడీగా చర్చ జరిగింది. ఈ నిధులను బ్యాంకు అధికారులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారని కొంద రు డెరైక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను ఖర్చు చేసినట్లు ఆరోపించారు. అలాగే మార్చి 31లోపు పంట రుణం బకాయిలను మొత్తం చెల్లించిన సుమారు 400 మంది రైతులకు ఈ సారి రుణాలు మంజూరు చేయకపోవడం పట్ల మరికొందరు డెరైక్టర్లు అధికారులను నిలదీశారు. ఈ సమావేశంలో బ్యాంకు చైర్మన్ ఎం.దామోదర్‌రెడ్డి, వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, డెరైక్టర్లు దుర్గం రాజేశ్వర్, జోగిందర్‌సింగ్, సీఈవో అనంత్‌రావు పాల్గొన్నారు. -
అవిశ్వాసం.. అయోమయం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు నేపథ్యంలో గురువారం నిర్వహించాలని తలపెట్టిన ప్రత్యేక సమావేశం విషయంలో గందరగోళం నెలకొంది. చైర్మన్ దామోదర్‌రెడ్డిపై వైస్‌చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి వర్గీయులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని భావించారు. ఈ సమావేశానికి చైర్మన్ మద్దతు డెరైక్టర్లు గైర్హాజరు కాగా, వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి మద్దతు డెరైక్టర్లు హాజరయ్యారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు చేరుకున్న చంద్రశేఖర్‌రెడ్డి తన మద్దతు డెరైక్టర్లతో కలిసి డీసీసీబీ సమావేశం హాలులోకి వెళ్లారు. జిల్లా సహకార అధికారి సూర్యచంద్రరావుతో అరగంట పాటు చర్చించారు. అనంతరం బయటకు వచ్చిన చంద్రశేఖర్‌రెడ్డి డీసీవోపై తీవ్ర ఆరోపణలు చేశారు. పక్షపాత ధోరణితో సహకార చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డీసీవోను సస్పెండ్ చేయాలని డిమాం డ్ చేశారు. ఈ విషయంలో తాము కోర్టును ఆశ్రయించనున్నట్లు చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. సమావేశానికి 11 మంది డెరైక్టర్లు హాజరైనప్పటికీ, కేవలం తొమ్మిది మంది మాత్రమే సంతకాలు చేసినట్లు డీసీవో పేర్కొన్నారు. నేటికి వాయిదా : డీసీవో అవిశ్వాస తీర్మానం నోటీసు నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేస్తున్నాముని డీసీవో ప్రకటించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక రోజు వాయిదా వేసేందుకు తమకు అధికారం ఉందని పేర్కొన్నారు. ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందనే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కో-ఆప్షన్ డెరైక్టర్లకు ఓటు హక్కు అంశంపై న్యాయ సలహా కోసం ఉన్నతాధికారులను సంప్రదించామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై రాత్రి ఏడు గంటలకు మరో ప్రకటన విడుదల చేశారు. ‘గురువారం 11 గంటలకు డీసీసీబీ పాలకవర్గ ప్రత్యేక సమావేశం డీసీవో అధ్యక్షతన జరుపబడినది. ఈ సమావేశానికి తొమ్మిది మంది పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. చట్ట ప్రకారం 11 మంది సభ్యులు ఉంటేనే కోరం ఉన్నట్లు.. కానీ కోరం లేనందున సహకార చట్టం సెక్షన్ 34-ఎ (12) ప్రకారం ఈ సమావేశం జరుపబడలేదు’ అని ప్రకటనలో డీసీవో పేర్కొన్నారు. సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేశామని మీడియాతో ప్రకటించిన డీసీవో.. సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో గందరగోళం నెలకొంది. అవిశ్వాసం వీగిపోయినట్లే.. : చైర్మన్ దామోదర్‌రెడ్డి తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లేనని చైర్మన్ దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. అవిశ్వాస నోటీసు ఇచ్చిన డెరైక్టర్లు ఆ మేరకు బలం నిరూపిం చుకోవాల్సి ఉంటుందని, లేనిపక్షంలో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లేనని స్పష్టం చేస్తున్నారు. కారణం లేకుండా సమావేశాన్ని ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఒకవేళ రేపటికి వాయిదా వేసిన పక్షం లో ఈ మేరకు అధికారికంగా నోటీసులు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. డీసీవోపై రాజకీయ ఒత్తిళ్లు? డీసీసీబీ చైర్మన్ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో జిల్లా సహకార అధికారిపై తీవ్ర స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఒక వర్గం చైర్మన్ దామోదర్‌రెడ్డికి, మరోవర్గం ముఖ్య నాయకులు చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా ఒత్తిళ్లకు గురి చేసినట్లు సమాచారం. దీంతో సహకార అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
డీసీసీబీ చైర్మన్ పదవిపై ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) చైర్మన్ పదవిపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో బలనిరూపణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశం తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఉత్కంఠ నెలకొంది. డీసీసీబీ చైర్మన్ ఎం.దామోదర్‌రెడ్డిపై.. వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి వర్గీయులు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం విధితమే. ఈ మేరకు 11 మంది డెరైక్టర్లు సంతకాలు చేసిన నోటీసును జూలై 17న జిల్లా సహకార అధికారి(డీసీవో) సూర్యచంద్రరావుకు అందజేశారు. ప్రాథమిక విచారణ చేపట్టిన డీసీవో బలనిరూపణ కోసం ఈనెల 7న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డీసీసీబీ డెరైక్టర్లందరికి నోటీసులు అందజేశారు. ఈ సమావేశానికి కేవలం రెండు రోజులే సమయం ఉండటంతో ఇరువర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. దామోదర్‌రెడ్డిని గద్దెదించేందుకు అవసరమైన మెజారిటీ డెరైక్టర్ల మద్దతును కూడగట్టేందుకు చంద్రశేఖర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. అవిశ్వాస తీర్మాణానికి అనుకూలంగా 14 మంది డెరైక్టర్లు మద్దతు ఉందని చంద్ర శేఖర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్‌రెడ్డికి టీఆర్ఎస్ జిల్లా అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారితోపాటు, మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డిల మద్దతుతో ఆయన ‘అవిశ్వాసం’పై ముందడుగేసినట్లు సమాచారం. తన పదవిని కాపాడుకునేందుకు చైర్మన్ దామోదర్‌రెడ్డి కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టును ఆశ్రయించే యోచనలో దామోదర్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇరువర్గాల నేతలు నెలరోజులుగా డెరైక్టర్లతో పోటాపోటీగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక సమావేశం రోజు గురువారం డెరైక్టర్లను నేరుగా డీసీసీబీకి తీసుకువచ్చేందుకు చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దామోదర్‌రెడ్డి వర్గం డెరైక్టర్లు ఈ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశాలున్నాయి. చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గితే వెంటనే నూతన చైర్మన్‌ను ఎన్నుకునేందుకు మరోమారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో నిర్వహిస్తున్న డీసీసీబీ ప్రత్యేక సమావేశానికి జిల్లా సహకార శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నిక జరిగే రోజు డీసీసీబీ పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ విధించే అవకాశాలున్నాయి. ఈ ఎన్నిక నిర్వహణ విషయమై డీసీవో సూర్యచంద్రరావు ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నిక విషయంలో ప్రభుత్వం నుంచి సహకార శాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు అందినట్లు సమాచారం. -
టీఆర్ఎస్ వైపు డీసీసీబీ డెరైక్టర్ల చూపు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సమసి పోయిందనుకుంటున్న డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) చైర్మన్ దామోదర్‌రెడ్డిపై అవిశ్వాసం అంశం ఇంకా రగులుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు డెరైక్టర్లు పార్టీ మారే యోచనలో ఉన్నారు. ముఖ్యంగా తూర్పు జిల్లాకు చెందిన ఈ డెరైక్టర్లు త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో చైర్మన్ దామోదర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. తనపై పొంచి ఉన్న ‘అవిశ్వాస’ గండం నుంచి గట్టెక్కేందుకు ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోపే ఈ భారీ మార్పులు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. వరుస ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. రైతులకు సంబంధించిన సహకార రంగంపై తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ముఖ్యంగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్న మంత్రి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. డెరైక్టర్లలో నిర్లిప్తత డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డిపై కొందరు డెరైక్టర్లు అసంతృప్తితో ఉన్నారు. తాము డెరైక్టర్లుగా ఎన్నికైనప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. నిధులు, నిర్ణయాల్లో తాము నిమిత్తమాత్రులగా ఉన్నామని నిర్లిప్తతో ఉన్నారు. డీసీసీబీ సమావేశాలకు హాజరు కావడం, ప్రయాణ భత్యాలు తీసుకుని వెళ్లిపోవడానికే పరిమితమవుతున్నామనే కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సర్కారు మారడంతో డీసీసీబీ చైర్మన్ పదవిపై అవిశ్వాస అంశం తెరపైకి వచ్చింది. డీసీసీబీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి ఈ అసంతృప్త డెరైక్టర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేశారు. కొందరు డెరైక్టర్లతో క్యాంపు నిర్వహించారు. ఈ మేరకు దామోదర్‌రెడ్డి జాగ్రత్త పడి 14 డెరైక్టర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు. గత నెల 27న నిర్మల్ మండలం మంజులాపూర్ సొసైటీలో ఈ డెరైక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి, డెరైక్టర్ల మద్దతు తనకు ఉందని దామోదర్‌రెడ్డి ప్రకటించారు. కానీ ఈ అవిశ్వాస అంశం ఇంకా రగులుతూనే ఉండటంతో దామోదర్‌రెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
‘పౌల్ట్రీ’కి ప్రోత్సాహం.. రైతుల్లో ఉత్సాహం
యాచారం: మండలంలో పౌల్ట్రీ పరిశ్రమ ప్రగతి కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) విరివిగా రుణాలు అందించేందుకు సంసిద్ధమైంది. పౌల్ట్రీఫాంల అభివృద్ధి కోసంనెదర్లాండ్‌కు చెందిన రోబో బ్యాంకు డీసీసీబీ ద్వారా రైతులకు రుణాలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే జిల్లాలోనే యాచారం మండలంలోని రైతులకు విరివిగా రుణాలిచ్చి పౌల్ట్రీఫాంలను అభివృద్ధిపరిచేందుకు సంకల్పించింది. మూడు నెలల క్రితం నెదర్లాండ్‌కు చెందిన రోబో బ్యాంకు ప్రతినిధులు మండలంలో పర్యటించారు. పౌల్ట్రీ రైతులు జీవన స్థితిగతులు, కోళ్ల పెంపకంతో వచ్చే ఆదాయం, రైతుల ఆసక్తి, బ్యాంకు రుణాల వివరాలు, బకాయిల చెల్లింపు తదితర విషయాలను అధ్యయనం చేశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా యాచారం మండలంలోని చిన్న, సన్నకారు రైతులు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు పొందడం, షెడ్ల నిర్మాణం చేపట్టి 5 వేలనుంచి 10 వేలకుపైగా కోళ్ల పెంపకానికి వివిధ కంపెనీలతో ఇంటెగ్రేషన్ పద్ధతిన లాభాలు పొందుతున్న విషయం తెలుసుకున్నారు. జిల్లాలో మిగతా మండలాల రైతులు అంతగా ఆసక్తి చూపకపోవడం గుర్తించి మండలాన్ని దత్తతగా తీసుకోవడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగానే మండలంలో పలు గ్రామాల్లో పౌల్ట్రీఫాంల ఏర్పాటుపై ఔత్సాహిక రైతులకు విరివిగా రుణాలు ఇవ్వడానికి నిర్ణయించారు. రూ.6 కోట్ల ప్రతిపాదనలు మండలంలోని పలు గ్రామాల రైతులకు విరివిగా రుణాలు ఇవ్వడానికి డీసీసీబీ ఉన్నతాధికారుల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం (పీఏసీఎస్) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. కొద్ది రోజులు క్రితం డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, సీఈఓ రాందాసు స్వయంగా ఇక్కడికి వచ్చి రైతులతో సమావేశమయ్యారు. రుణాల విషయంలో హామీ సైతం ఇచ్చారు. గతంలో పీఏసీఎస్‌ల ద్వారా 42 మంది రైతులు పౌల్ట్రీ పరిశ్రమ కోసం రూ.2 కోట్ల వరకు రుణాలు ఇచ్చారు. రుణాలు పొందిన 42 మంది రైతుల్లో మళ్లీ కొత్తగా పౌల్ట్రీ షెడ్లు నిర్మించుకుంటే రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు రుణాలు ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు. వీరిలో ఇప్పటికి 30 మంది రైతులు రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే పౌల్ట్రీ పరిశ్రమలో ఎటువంటి అనుభవం లేని రైతులకు సైతం పీఏసీఎస్ నుంచి రుణాలు ఇవ్వడానికి నిర్ణయించారు. గతంలో పౌల్ట్రీఫాంల కోసం పీఏసీఎస్ నుంచి కేవలం రూ. 5 లక్షలు మాత్రమే రుణాలిచ్చేవారు. కానీ ప్రస్తుతం రూ. 10లక్షలపైనే ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు. కొత్త రైతులు ఇప్పటి వరకు 18 మంది అర్జీలు పెట్టుకున్నారు. నిబంధనలు పూర్తి చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. రుణాలు విరివిగా అందజేస్తుండడంతో ఔత్సాహిక రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రానున్న రోజుల్లో మండలంలో పౌల్ట్రీఫాంల విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉంది. -
దడ పుట్టిస్తున్న నకిలీ బంగారం కుంభకోణం
డీసీసీబీ ఉద్యోగుల్లో కలకలం పూర్తి స్థాయిలో దర్యాప్తు: చైర్మన్ విశాఖపట్నం, న్యూస్‌లైన్ : తీగ లాగితే డొంక కదిలినట్టు నకిలీ బంగారం కుంభకోణం బ్యాంకు ఉద్యోగుల్లో దడ పుట్టిస్తోంది. నకిలీ బంగారం తాకట్టుతో ఉద్యోగులు బ్యాంకు సొమ్మును కాజేసిన సంఘటన బ్యాంకు వర్గాల్లో కలకలం రేపుతోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశాఖ మె యిన్రోడ్డు బ్రాంచిలో నకిలీ బంగారం కుంభకోణం బయటపడిన సంగతి తెలిసిందే. శనివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘నకిలీల’ వార్తా కథనంతో నకిలీ బంగారం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే బ్యాంకు అధికారులు ప్రాథమిక వివరాలు సేకరించి మోసం జరిగినట్టు గ్రహించారు. కుంభకోణంలో ఎంత మంది పాత్ర ఉందన్న దిశగా దర్యాప్తు జరుగుతోంది. బ్యాంక్‌లో రుణం పొందిన లబ్ధిదారులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. వీరంతా నిజమైన లబ్ధిదారులా! లేక బ్యాంక్ ఉద్యోగులు ఆధారాలు సష్టించి సొమ్ము స్వాహా జేశారా! అనే కోణంలో విచారణ జరిపేందుకు సిద్ధపడ్డారు. మోసానికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు రంగం సిద్ధమవుతోంది. ఇదే తరహా మోసం ఇతర బ్రాంచి బ్యాంకుల్లో జరిగిందా! అనే సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది. సమగ్ర విచారణ జరిపితే మరికొన్ని కుంభ కోణాలు వెలుగులోకి రావచ్చన్న అభిప్రాయాలు లేకపోలేదు. బ్యాంక్ సొమ్ము కాజేసిన సంఘటనలో బాధ్యులై వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీసీబీ చైర్మన్ ఉప్పలపాటి సుకుమార వర్మ తెలియజేశారు. బ్యాంక్ సొమ్ము కాజేసిన సంఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. 35 రుణాల మంజూరు విషయంలో రూ33.89 లక్షలు మోసం జరిగినట్టు నిర్థారించామని స్పష్టం చేశారు. విచారణాధికారిని నియమించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులను ఉపేక్షించే ప్రసక్తి లేదని చైర్మన్ హెచ్చరించారు. -
డీసీసీబీ... బోర్డు సమావేశం నేడు
దేవరకొండ బ్యాంకు అవినీతి లెక్కతేల్చడమే ప్రధాన ఎజెండా వైస్ చైర్మన్‌కు ఇన్చార్జ్ బాధ్యతల అప్పగింతకు ఆమోదముద్ర సాక్షిప్రతినిధి, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) రాజకీయ వ్యవ హారం సుఖాంతమైనట్లే కనిపిస్తోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచే చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి ఆరు నెలల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇక, వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు ఇన్చార్జ్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పజెప్పే తంతు మాత్రమే మిగిలి ఉంది. గత డి సెంబరు 28వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా శుక్రవారం మరోమారు బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే వైస్ చైర్మన్‌కు ఇన్చార్జి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పజెబుతారని, బోర్డు సభ్యులు ఆమోద ముద్ర వేస్తారని చెబుతున్నారు. దీంతో పాటు దేవరకొండ బ్రాంచ్‌లో చోటు చేసుకున్న అవినీతి లెక్క తేల్చడంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రామయ్య అవినీతి గుట్టు విప్పుతారా..? దేవరకొండ సహకార బ్యాంకు పరిధిలోని చిత్రియాల, తిమ్మాపురం, పీఏపల్లి, దేవరకొండ సంఘాల్లో అనర్హులకూ ఇబ్బడి ముబ్బడిగా రుణాలు ఇవ్వడంతో కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయి. ఈ అవినీతి వ్యవహారాన్ని తేల్చేందుకు ఏర్పాటైన కమిటీ ఇప్పటికే రూ.17.92కోట్లు అవినీతి జరిగినట్లు నిర్ధారించింది. అయితే, ఈ తతంగం వెనుక ఎవరెవరున్నారు..? ఎంతెంత మొత్తంలో డ బ్బులు చేతులు మారింది. అధికార కాంగ్రెస్ నాయకులు, అధికారుల్లో ఎవరికెంత వాటా ముట్టింది అన్న పూర్తి వివరాలను తేల్చేందుకు డీసీసీబీ సభ్యులంతా సీబీసీఐడితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం నాటి సమావేశం నేపథ్యంలోనే దేవరకొండ బ్రాంచ్ ఏజీఎంగా పనిచేసి, అవినీతి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామయ్య లొంగిపోవడం కొత్త చర్చకు ఆస్కారం ఇస్తోంది. ఇప్పటి దాకా ఆయనను పోలీసులు అరెస్టు చేయకపోవడం, ఆయనే నేరుగా లొంగిపోవడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన నోరు విప్పి అసలు గుట్టు విప్పుతారా అన్న విషయం కూడా ఆసక్తిగా మారింది. అవినీతిపై స్పందించని డీసీసీబీ రమారమి 18కోట్ల రూపాయల అవినీతి జరిగితే, డీసీసీబీ వైపు నుంచి ఏమంత స్పందన కనిపించలేదు. నామమాత్రంగానే పోలీసులకు ఫిర్యాదు చేసి చేదులు దులిపేసుకున్నారు. దీంతో ఎలాంటి ఒత్తిడీ లేని ఈ కేసును పోలీసులు సైతం అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించలేదు. ఈ అవినీతి వ్యవహారమంతా... పలువురు ముఖ్యులకు తెలిసే జరిగిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. జిల్లా సహకార రంగ ప్రతిష్టను మసకబారేలా చేసిన ఈ కుంభకోణంపై శుక్రవారం నాటి బోర్డు సీరియస్‌గా చర్చిస్తుందా..? బాధ్యులైన అధికారులను ఏం చేయనుంది..? అన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.