ICC WC 2023- Afg Vs Aus: అఫ్గనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అఫ్గన్ బ్యాటర్లెవరికీ గతంలో సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు. కాగా ప్రపంచకప్-2023లో భాగంగా ముంబైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ను ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ 21 పరుగులకే పెవిలియన్‌కు పంపగా.. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ నిలకడగా ఆడుతూ అర్ధ శతకంతో మెరిశాడు. అఫ్గన్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్ ఐదో బంతికి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఫోర్ బాది యాభై రెండు పరుగులు పూర్తి చేసుకున్నాడు.
అఫ్గన్ తొలి బ్యాటర్‌గా అరుదైన ఘనతలు
ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో ఒక ఏడాది(క్యాలెండర్ ఇయర్)లో అత్యధిక పరుగులు చేసిన అఫ్గనిస్తాన్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. తద్వారా అఫ్గన్ తరఫున మెరుగైన రికార్డు ఉన్న బ్యాటర్ రహ్మత్ షాను వెనక్కినెట్టి అతడి రికార్డు బ్రేక్ చేశాడు.
అదే విధంగా క్యాలెండర్ ఇయర్‌లో 50 కంటే ఎక్కువ పరుగులు ఏడుసార్లు సాధించిన అఫ్గన్ క్రికెటర్‌గా రహ్మత్ షా రికార్డును సమం చేశాడు. అంతేకాదు వరల్డ్‌కప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన అఫ్గన్ క్రికెటర్‌గా ఈ 21 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
అంతర్జాతీయ వన్డేల్లో క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు
►765* - ఇబ్రహీం జద్రాన్(2023)
►722 - రహ్మత్ షా (2018)
►646 - రహ్మత్ షా (2019)
►631 - రహ్మనుల్లా గుర్బాజ్ (2023)
►616 - రహ్మత్ షా (2022) .
వన్డేల్లో అఫ్గన్ తరఫున అత్యధికసార్లు 50కి పైగా పరుగులు సాధించిన అఫ్గనిస్తాన్ బ్యాటర్లు
►7 - రహ్మత్ షా(2018)
►7 - ఇబ్రహీం జద్రాన్(2023)
►6 - రహ్మత్ షా (2017)
►6 - రహ్మత్ షా (2022)
►6 - హష్మతుల్లా షాహిది (2023).
చదవండి: WC 2023: ‘టైమ్డ్ అవుట్’ అప్పీలుతో చరిత్రకెక్కిన బంగ్లాదేశ్‌కు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment