ICC WC 2023- Afg Vs Aus- Glenn Maxwell: వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ మరో శతకం సాధించాడు. అఫ్గనిస్తాన్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో 76 బంతుల్లోనే 100 పరుగుల మార్కు అందుకున్నాడు. జట్టు కష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు.
వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మాక్సీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో ఈ స్పిన్ ఆల్‌రౌండర్ నెదర్లాండ్స్‌పై తొలి శతకం నమోదు చేసిన విషయం తెలిసిందే.
కేవలం 40 బంతుల్లోనే 100 పరుగులు సాధించి వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా ఘనత సాధించాడు. తాజాగా అఫ్గనిస్తాన్‌పై మరోసారి హండ్రెడ్‌తో మెరిశాడు. సెమీస్ రేసులో ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా ముందుకు వెళ్లాలంటే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.
అయితే, అఫ్గనిస్తాన్ విధించిన 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభం నుంచే తడబడ్డ కంగారూ జట్టు.. 8 ఓవర్లు ముగిసే సరికి 49 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.
ఈ క్రమంలో తొమ్మిదో ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ డేవిడ్ వార్నర్ బౌల్డ్ కాగా.. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన జోష్ ఇంగ్లిష్(0) కూడా ఆ మరుసటి బంతికి పెవిలియన్ చేరాడు. ఇలా 50 పరుగులలోపే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను మాక్సీ గట్టెక్కించేందుకు కంకణం కట్టుకున్నాడు.
గాయం నుంచి కోలుకుని
అద్భుత శతకంతో ఆస్ట్రేలియా శిబిరంలో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతున్నాడు. 19 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు నష్టపోయి కేవలం 95 పరుగులు చేసిన ఆసీస్‌ను లక్ష్యాన్ని చేరువ చేస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు మాక్సీ గాయపడిన విషయం తెలిసిందే.
గోల్ఫ్ కార్ట్ వాహనం నుండి పట్టుతప్పి పడిపోయాడు. దీంతో అతడి తలకు గాయమైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్న మాక్స్‌వెల్.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్ మధ్యలో కూడా కాళ్ల నొప్పితో ఇబ్బంది పడ్డా 42వ ఓవర్ మూడో బంతికి 150 పరుగుల మార్కు అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment