ICC WC 2023- Ibrahim Zadran: వన్డే వరల్డ్‌కప్-2023లో అఫ్గనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పటిష్ట పేస్ దళం ఉన్న కంగారూ జట్టు బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని అజేయ శతకంతో మెరిశాడు. మొత్తంగా 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 129 పరుగులు రాబట్టాడు.
ఈ క్రమంలో అఫ్గన్ తరఫున ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసి తొలి బ్యాటర్‌గా నిలిచిన 21 ఏళ్ల ఇబ్రహీం.. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు.
వరల్డ్‌కప్ టోర్నీలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్ల జాబితాలో ధావన్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో జింబాబ్వే ఆటగాడు నీల్ జాన్సన్ 132* పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ హ్యారిస్ 130 పరుగులతో రెండో స్థానం ఆక్రమించాడు.
కష్టాల్లో ఆసీస్
కాగా అఫ్గనిస్తాన్ విధించిన 292 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడుతోంది. 25 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు నష్టపోయి 126 పరుగులు మాత్రమే చేసింది. అయితే, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ అద్భుత ఆట తీరుతో అర్ధ శతకం పూర్తి చేసుకుని ఆసీస్ శిబిరంలో ఆశలు రేకెత్తిస్తున్నాడు.
ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన టాప్-5 క్రికెటర్లు
1. నీల్ జాన్సన్(జింబాబ్వే)- 132* పరుగులు- 1999లో లార్డ్స్ మైదానంలో
2. క్రిస్ హ్యారిస్(న్యూజిలాండ్)- 130 పరుగులు- 1996లో చెన్నైలో
3. ఇబ్రహీం జద్రాన్(అఫ్గనిస్తాన్)- 129* పరుగులు- 2003 ముంబైలో
4. శిఖర్ ధావన్(ఇండియా)- 117 పరుగులు- 2019లో ది ఓవల్‌లో
5. రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్)- 116 పరుగులు- 2023లో ధర్మశాలలో.
అఫ్గనిస్తాన్‌కు ఇదే భారీ స్కోరు:
ముంబైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా.. అఫ్గనిస్తాన్ వరల్డ్‌కప్ టోర్నీలో తమ అత్యధిక స్కోరు నమోదు చేసింది. జద్రాన్ అజేయ శతకం కారణంగా 291 పరుగులు సాధించి ఈ మేరకు తమ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది.
వరల్డ్‌కప్ టోర్నీలో ఇప్పటి వరకు అఫ్గనిస్తాన్ సాధించిన టాప్-5 స్కోర్లు ఇవే
►ఆస్ట్రేలియా మీద- 2023లో ముంబైలో- 291/5.
►వెస్టిండీస్ మీద- 2019లో లీడ్స్‌లో- 288.
►పాకిస్తాన్ మీద- 2023లో చెన్నైలో- 286/2.
►ఇంగ్లండ్ మీద- 2023లో ఢిల్లీలో- 284.
►టీమిండియా మీద- 2023లో ఢిల్లీలో- 272/8.
చదవండి: వరల్డ్‌కప్‌లో అఫ్గన్ తరఫున ఒకే ఒక్క సెంచరీ.. సచిన్, కోహ్లికి కూడా సాధ్యం కాని రికార్డు
Comments
Please login to add a commentAdd a comment