Rahmat Shah
-
రికార్డు డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్
ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీ (246) చేసిన షాహిది.. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో రెండు డబుల్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. షాహిది 2021లో జింబాబ్వేపై తొలి డబుల్ సెంచరీ (200) చేశాడు.తాజాగా డబుల్‌తో షాహిది మరో రికార్డు కూడా సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (246) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇదే మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రహ్మత్ షా (234) కూడా డబుల్ సెంచరీ చేశాడు. షాహిదికి ముందు రహ్మత్ షాదే ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక స్కోర్‌గా ఉండేది.మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో మూడు డబుల్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. ఈ మూడింటిలో రెండు ఇదే మ్యాచ్‌లో నమోదు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు (అఫ్సన్ జజాయ్) సెంచరీ (113) చేశాడు.రహ్మత్, షాహిది డబుల్.. జజాయ్ సెంచరీ సాధించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (699) చేసింది. టెస్ట్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోర్. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆఫ్ఘన్ ఆటగాళ్లు మూడంకెల స్కోర్లు సాధించడం కూడా ఇదే మొదటిసారి. 639 పరుగుల వరకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్.. ఆతర్వాత 60 పరుగుల వ్యవధిలో మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే బౌలర్లలో బ్రియాన్ బెన్నెట్ ఐదు వికెట్లు పడగొట్టగా.. సీన్ విలియమ్స్ 2, ముజరబానీ, గ్వాండు, న్యామ్హురి తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు జింబాబ్వే సైతం తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (586) చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సైతం ముగ్గురు మూడంకెల స్కోర్లు సాధించారు. సీన్ విలియమ్స్ (154), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. కెరీర్లో తొలి టెస్ట్ ఆడుతున్న బెన్ కర్రన్ (ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రన్ అన్న) అర్ద సెంచరీతో (68) రాణించాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్‌తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ 113 పరుగులు ఎక్కువగా సాధించింది. జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ సెంచరీ సహా ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేయడం మరో విశేషం.113 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 5 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. బెన్ కర్రన్ (23), జాయ్‌లార్డ్ గుంబీ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు జింబాబ్వే ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. మ్యాచ్ చివరి రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. కాగా, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లను ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గిన ఆఫ్ఘన్లు.. వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకున్నారు. ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుండగా.. రెండో టెస్ట్ జనవరి 2న ప్రారంభంకానుంది. -
డబుల్ సెంచరీతో చెలరేగిన అఫ్గాన్ ఆటగాడు..
బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వేకు అఫ్గానిస్తాన్ ధీటుగా బదులిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి అఫ్గానిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇంకా 161 పరుగులు వెనంజలో ఉంది. 95/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన అఫ్గాన్ జట్టు వికెట్ నష్టపోకుండా 330 పరుగులు చేసింది.రహ్మత్ షా డబుల్ సెంచరీ..అఫ్గానిస్తాన్ ఫస్ట్ డౌన్ బ్యాటర్ రహ్మత్ షా (416 బంతుల్లో 23 ఫోర్లు, 3 సిక్స్‌లు 231 బ్యాటింగ్) ఆజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీతో కలిసి ఇన్నింగ్స్‌ను అద్బుతంగా నడిపించాడు. రహ్మత్‌కు ఇదే తొలి టెస్టు డబుల్ సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు షాహిదీ(276 బంతుల్లో 16 ఫోర్లు, 141 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 361 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.రహ్మత్ షా అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగిన రహ్మత్ షా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అఫ్గాన్ తరపున అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్‌గా రహ్మత్(231*) నిలిచాడు. గతంలో ఈ రికార్డు హష్మతుల్లా షాహిదీ(200) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో షాహిదీ ఆల్‌టైమ్ రికార్డును షా బ్రేక్ చేశాడు. అదే విధంగా టెస్టు మ్యాచ్‌లో ఒక రోజు మొత్తం వికెట్ కోల్పోకపోవడం ఇదే తొలిసారి 2019 తర్వాత ఇదే తొలిసారి.చదవండి: VHT 2024-25: పంజాబ్ ఓపెనర్ విధ్వంసం.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో -
Afg vs SA: ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు!
అఫ్గనిస్తాన్- సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అఫ్గన్ బ్యాటర్ రహ్మత్ షా అవుటైన తీరు నెట్టింట వైరల్ అవుతోంది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అఫ్గనిస్తాన్.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడింది.అనూహ్య రీతిలో తొలి రెండు మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే, నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం ప్రొటిస్ జట్టు అఫ్గన్‌పై పైచేయి సాధించింది. ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. షార్జా వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డేలో 7 వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసింది.రహ్మనుల్లా గుర్బాజ్ ఒంటరి పోరాటంఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. 34 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (94 బంతుల్లో 89; 7 ఫోర్లుర, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా... ఘజన్‌ఫార్ (15 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. రహ్మత్ షా (1), అబ్దుల్ మాలిక్ (9), కెప్టెన్ హష్మతుల్లా (10), అజ్మతుల్లా (2), ఇక్రామ్ (4), నబీ (5) విఫలమయ్యారు.ఇక సఫారీ బౌలర్లలో ఎంగిడి, పీటర్, ఫెలుక్వాయో తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్రమ్ (67 బంతుల్లో 69 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌ను ప్రొటిస్ పేసర్ లుంగి ఎంగిడి వేశాడు.అప్పుడు రహ్మనుల్లా గుర్బాజ్ క్రీజులో ఉండగా.. రహ్మత్ షా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో ఎంగిడి ఓవర్లో ఐదో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు రహ్మనుల్లా. దీంతో సింగిల్ తీసేందుకు రెడీగా ఉన్న రహ్మత్ అప్పటికే క్రీజు నుంచి బయటకు రాగా.. రహ్మనుల్లా సైతం నాన్ స్ట్రైకర్ ఎండ్‌వైపు పరుగు మొదలుపెట్టాడు.పాపం.. ఊహించి ఉండడుఅయితే, ఆ కొద్ది సమయంలోనే ఊహించని సంఘటన జరిగింది. రహ్మనుల్లా కొట్టిన బంతిని ఆపేందుకు ఎంగిడి చేయి అడ్డం పెట్టాడు. అయితే, బంతి అతడి చేతికి చిక్కకపోయినా.. చేయిని గీసుకుంటూ.. రహ్మత్‌కు తాకి స్టంప్స్‌ను ఎగురగొట్టింది. ఫలితంగా రహ్మత్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘‘అయ్యో పాపం.. ఇలా అవుటవుతాడని ఊహించి ఉండడు’’ అంటూ క్రికెట్ ప్రేమికులు రహ్మత్ షా(1)ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు.చదవండి: కెప్టెన్‌గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు!This is how Rahmat Shah got out Against South Africa ❤️😂😂😂 pic.twitter.com/kw9VSJb9sl— Sports Production (@SportsProd37) September 22, 2024 -
ఇదెక్కడి క్రేజీ క్యాచ్ రా సామీ.. నమ్మశక్యంగా లేదు..!
క్రికెట్ చరిత్రలో మరో అద్భుతమైన క్యాచ్ నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 2) మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక వికెట్‌కీపర్ సదీర సమరవిక్రమ నమ్మశక్యంకాని రీతిలో క్రేజీ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసిన వాళ్లు 'కలయా నిజమా..' అని అంటున్నారు. సమరవిక్రమ ముందుచూపుకు హ్యాట్సాఫ్ అంటున్నారు. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ఆఫ్ఘన్ ఆటగాడు రెహ్మత్ షా లెగ్‌సైడ్ స్వీప్ షాట్ ఆడాడు. సాధారణంగా అయితే ఈ షాట్ వికెట్‌కీపర్‌కు చాలా దూరంగా (లెగ్ స్లిప్ అనవచ్చు) వెళ్తూ బౌండరీకి చేరుకుంటుంది. అయితే షా ఈ షాట్ ఆడతాడని ముందుగానే పసిగట్టిన సమరవిక్రమ బంతి పిచ్ కాగానే లెగ్‌సైడ్ దిశగా వెళ్లి తక్కువ ఎత్తులో గాల్లోకి లేచిన బంతిని ఇట్టే పట్టేసుకున్నాడు. బ్యాటర్, బౌలర్ సహా ఈ తంతు మొత్తం చూస్తున్న వారు నివ్వెరపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. Crazy catch 😳pic.twitter.com/wQgNRGtSsO — CricTracker (@Cricketracker) February 2, 2024 కాగా, స్వదేశంలో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. అషిత ఫెర్నాండో (14.4-1-24-3), విశ్వ ఫెర్నాండో (12-1-51-4), ప్రభాత్ జయసూర్య (25-7-67-3) విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక.. రెండో బంతికే ఆఫ్ఘన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌ను (0) పెవిలియన్‌కు పంపింది. ఆతర్వాత వన్‌డౌన్ ఆటగాడు రెహ్మత్ షా (91).. మరో ఓపెనర్, అరంగేట్రం ఆటగాడు నూర్ అలీ జద్రాన్‌తో (31) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. సమరవిక్రమ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ అయిన రెహ్మత్ షాను పెవిలియన్‌కు పంపిన అనంతరం ఆఫ్ఘన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది 17, నసీర్ జమాల్ 0, ఇక్రమ్ అలికిల్ 21, కైస్ అహ్మద్ 21, జియా ఉర్ రెహ్మాన్ 4, నిజత్ మసూద్ 12, మొహమ్మద్ సలీం 0 పరుగులకు ఔటయ్యారు. 44 పరుగుల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్ చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌తో ఏకంగా నలుగురు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు (నూర్ అలీ జద్రాన్, నవీద్ జద్రాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, మొహమ్మద్ సలీం) టెస్ట్ అరంగేట్రం చేయడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. నిషాన్ మధుష్క (36), దిముత్ కరుణరత్నే (42) క్రీజ్‌లో ఉన్నారు. -
WC 2023: వన్డేల్లో చరిత్ర సృష్టించిన అఫ్గనిస్తాన్ ఓపెనర్.. అరుదైన ఘనతలు
ICC WC 2023- Afg Vs Aus: అఫ్గనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అఫ్గన్ బ్యాటర్లెవరికీ గతంలో సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు. కాగా ప్రపంచకప్-2023లో భాగంగా ముంబైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ను ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ 21 పరుగులకే పెవిలియన్‌కు పంపగా.. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ నిలకడగా ఆడుతూ అర్ధ శతకంతో మెరిశాడు. అఫ్గన్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్ ఐదో బంతికి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఫోర్ బాది యాభై రెండు పరుగులు పూర్తి చేసుకున్నాడు. అఫ్గన్ తొలి బ్యాటర్‌గా అరుదైన ఘనతలు ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో ఒక ఏడాది(క్యాలెండర్ ఇయర్)లో అత్యధిక పరుగులు చేసిన అఫ్గనిస్తాన్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. తద్వారా అఫ్గన్ తరఫున మెరుగైన రికార్డు ఉన్న బ్యాటర్ రహ్మత్ షాను వెనక్కినెట్టి అతడి రికార్డు బ్రేక్ చేశాడు. అదే విధంగా క్యాలెండర్ ఇయర్లో 50 కంటే ఎక్కువ పరుగులు ఏడుసార్లు సాధించిన అఫ్గన్ క్రికెటర్‌గా రహ్మత్ షా రికార్డును సమం చేశాడు. అంతేకాదు వరల్డ్‌కప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన అఫ్గన్ క్రికెటర్‌గా ఈ 21 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అంతర్జాతీయ వన్డేల్లో క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు ►765* - ఇబ్రహీం జద్రాన్(2023) ►722 - రహ్మత్ షా (2018) ►646 - రహ్మత్ షా (2019) ►631 - రహ్మనుల్లా గుర్బాజ్ (2023) ►616 - రహ్మత్ షా (2022) . వన్డేల్లో అఫ్గన్ తరఫున అత్యధికసార్లు 50కి పైగా పరుగులు సాధించిన అఫ్గనిస్తాన్ బ్యాటర్లు ►7 - రహ్మత్ షా(2018) ►7 - ఇబ్రహీం జద్రాన్(2023) ►6 - రహ్మత్ షా (2017) ►6 - రహ్మత్ షా (2022) ►6 - హష్మతుల్లా షాహిది (2023). చదవండి: WC 2023: ‘టైమ్డ్ అవుట్’ అప్పీలుతో చరిత్రకెక్కిన బంగ్లాదేశ్‌కు భారీ షాక్! View this post on Instagram A post shared by ICC (@icc) -
రహ్మత్ షా శతకం
చిట్టగాంగ్: అఫ్గానిస్తాన్ బ్యాట్స్‌మన్ రహ్మత్ షా (187 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) పేరు ఆ దేశ టెస్టు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. బంగ్లాదేశ్‌తో గురువారం ఇక్కడ ప్రారంభమైన ఏకైక టెస్టులో సెంచరీ బాదిన అతడు అఫ్గాన్ తరఫున ఈ ఘనత అందుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. షాకు తోడు అస్గర్ అఫ్గాన్ (160 బంతుల్లో 88 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో తొలి రోజు ఆట ముగిసేసరికి అఫ్గాన్ ఐదు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్... ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్ (21), ఇహ్సానుల్లా (9) వికెట్లను త్వరగానే కోల్పోయింది. లంచ్ సమయానికి నాలుగో నంబరు బ్యాట్స్‌మన్ హష్మతుల్లా షహీదీ (14) కూడా ఔట్ కావడంతో జట్టు 77/3తో నిలిచింది. ఈ దశలో షా, అస్గర్ నాలుగో వికెట్‌కు 120 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆ వెంటనే నబీ (0) వెనుదిరిగాడు. అస్గర్, వికెట్ కీపర్ అఫ్సర్ జజాయ్ (90 బంతుల్లో 35 బ్యాటింగ్; 4 ఫోర్లు, సిక్స్) ఆరో వికెట్‌కు అబేధ్యంగా 74 పరుగులు జోడించి రోజును ముగించారు. స్పిన్నర్ల పైనే భరోసా ఉంచిన బంగ్లా ఈ మ్యాచ్‌కు ప్రధాన పేసర్లు లేకుండానే బరిలో దిగింది. ఆ జట్టు తరఫున 8 మంది బౌలింగ్ చేయడం గమనార్హం. రషీద్... చిన్న వయసు టెస్టు కెప్టెన్ బంగ్లాతో టెస్టులో అఫ్గాన్‌కు నాయకత్వం వహించడం ద్వారా మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ (20 ఏళ్ల 350 రోజులు) అతి చిన్న వయసు కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు జింబాబ్వేకు చెందిన తతెంద తైబు (20 ఏళ్ల 358 రోజులు– 2004లో శ్రీలంకపై) పేరిట ఉన్న రికార్డును రషీద్ సవరించాడు. 1962లో 21 ఏళ్ల 77 రోజుల వయసులో భారత్‌కు సారథ్యం వహించిన దివంగత మన్సూర్ అలీఖాన్ పటౌడీ... అతి చిన్న వయసు కెప్టెన్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. -
అఫ్గాన్ ‘సెంచరీ’ రికార్డు
చాట్టోగ్రామ్: అఫ్గానిస్తాన్ క్రికెటర్ రహ్మత్ షా అరుదైన జాబితాలో చేరిపోయాడు. టెస్టు ఫార్మాట్లో ఆ దేశం తరఫున సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గురువారం బంగ్లాదేశ్‌తో ఆరంభమైన ఏకైక టెస్టు మ్యాచ్‌లో రహ్మత్ షా శతకం బాదాడు. 187 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. ఫలితంగా అఫ్గాన్ తరఫున తొలి టెస్టు సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.(ఇక్కడ చదవండి: రషీద్ ఖాన్ అరుదైన ఘనత) ఈ మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్లో వచ్చిన రహ్మత్ షా సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. మూడో వికెట్‌కు 29 పరుగులు జత చేసిన రహ్మత్ షా.. నాల్గో వికెట్‌కు 120 పరుగుల్ని జత చేశాడు. ఈ క్రమంలోనే సెంచరీ మార్కును చేరాడు. టీ బ్రేక్ తర్వాత సెంచరీ పూర్తి చేసుకున్న రహ్మత్ షా.. ప్రధానంగా బంగ్లాదేశ్ స్పిన్నర్లే లక్ష్యంగా ఆడాడు. ఈ ఏడాది రహ్మత్ షాకు రెండుసార్లు టెస్టు సెంచరీ చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. మార్చి నెలలో ఐర్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగుల వద్ద రహ్మత్ షా ఔట్ కావడంతో తృటిలో సెంచరీ కోల్పోయాడు. అటు తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగుల వద్ద నిష్క్రమించాడు. తమ దేశాల తరఫున తొలి టెస్టు సెంచరీ సాధించిన జాబితా ఇలా ఉంది.. దేశం తరఫున తొలి టెస్టు సెంచరీ సాధించిన వారు.. చార్లెస్ బ్యానర్మేన్( ఆస్ట్రేలియా) అమినుల్ ఇస్లామ్(బంగ్లాదేశ్) డబ్యూ జీ గ్రేస్(ఇంగ్లండ్) లాలా అమర్నాథ్(భారత్) కెవిన్ ఒబ్రియన్(ఐర్లాండ్) డెమ్ష్టర్(న్యూజిలాండ్) నాజర్ మహ్మద్(పాకిస్తాన్) జిమ్మీ సింక్లైర్(దక్షిణాఫ్రికా) సిదాత్ వెట్టిమ్యూనీ(శ్రీలంక) క్లైఫర్డ్ రోచ్(వెస్టిండీస్) డేవ్ హాటన్(జింబాబ్వే) రహ్మత్ షా(అఫ్గానిస్తాన్)