షార్జా వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది (2-1 తేడాతో). నిన్న (మార్చి 18) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఐర్లాండ్ 17.2 ఓవర్లలో 98 పరుగులకే చాపచుట్టేసింది.
మెరుపు అర్దశతకంతో సత్తా చాటిన జద్రాన్..
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ మెరుపు అర్దశతకంతో విరుచుకుపడ్డాడు. 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో జద్రాన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. మొహమ్మద్ ఇషాక్ (27), సెదీఖుల్లా అటల్ (19), ఇజాజ్ అహ్మద్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, జాషువ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, కర్టిస్ క్యాంపర్, డెలానీ, బెంజమిన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు.
నిప్పులు చెరిగిన ఒమర్‌జాయ్, నవీన్ ఉల్ హక్..
156 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (4-0-9-4), నవీన్ ఉల్ హక్ (2.2-0-10-3) నిప్పులు చెరగడంతో 98 పరుగులకే కుప్పకూలింది. ఫజల్ హక్ ఫారూకీ, రషీద్ ఖాన్, ఖరోటే తలో వికెట్ పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ క్యాంపర్ (28) టాప్ స్కోరర్‌గా నిలువగా.. గెరాత్ డెలానీ (21), హ్యారీ టెక్టార్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఐర్లాండ్ గెలువగా.. ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment