యూఏఈతో జరగనున్న టీ20 సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు అఫ్గాన్ రెగ్యూలర్ కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో అతడి స్ధానంలో యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌కు జట్టు పగ్గాలను అఫ్గాన్ సెలక్టర్లు అప్పగించారు.
అదే విధంగా ఈ జట్టులో పేసర్లు ఫజల్‌హక్ ఫరూకీ, నవీన్ ఉల్ హక్‌కు చోటు దక్కింది. కాగా వీరిద్దరిపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. అయితే వీరు అఫ్గాన్ సెంట్రల్ కాంట్రాక్టులను వదులకోనున్నారని వార్తలు వినిపించాయి.
కానీ వీరు ఫ్రాంచైజీ క్రికెట్ కంటే జాతీయ జట్టు తరపున ఆడేందుకు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే యూఏఈ సిరీస్‌కు సెలక్టర్లు వీరిద్దరిని ఎంపిక చేశారు. డిసెంబర్ 29 నుంచి షార్జా వేదికగా జరగనున్న తొలి టీ20తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. మొత్తం మూడు మ్యాచ్‌లు షార్జా వేదికగానే జరగనున్నాయి.
అఫ్గానిస్తాన్ టీ20 జట్టు: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మహ్మద్ ఇషాక్, హజ్రతుల్లా జజాయ్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, దర్విష్ రసూలీ, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మౌల్లా ఒమర్జాయ్, ఎఫ్ షరఫుద్దీనాల్, ఎఫ్. అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీమ్ మరియు కైస్ అహ్మద్.
చదవండి: IND vs SA: గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్..
Comments
Please login to add a commentAdd a comment