తొలి ఆఫ్ఘాన్ ప్లేయర్గా.. | Mohammad Nabi has First player from Afghanistan | Sakshi
Sakshi News home page

తొలి ఆఫ్ఘాన్ ప్లేయర్గా..

Published Mon, Feb 20 2017 12:02 PM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM

తొలి ఆఫ్ఘాన్ ప్లేయర్గా..

తొలి ఆఫ్ఘాన్ ప్లేయర్గా..

ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -10 వేలంలో ఆఫ్ఘానిస్తాన్ ఆటగాడు మొహ్మద్ నబీని రూ. 30 లక్షల ధరతో సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అసోసియేట్ దేశాలకు చెందిన ఆరుగురు క్రికెటర్లు ఈసారి ఐపీఎల్ వేలం బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. వీరిలో మొహ్మద్ నబీ ఒకడు. అయితే ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్న తొలి  ఆఫ్ఘాన్ ప్లేయర్ గా నబీ గుర్తింపు పొందాడు.

 

అతను కనీస ధర రూ.30 లక్షలు కాగా, అదే ధరకు సన్ రైజర్స్ కొనుగోలు చేసింది.  ఆల్ రౌండర్ కావడంతో అతన్ని తీసుకోవాడానికి సన్ రైజర్స్ ఆసక్తి కనబరిచింది. కుడి చేత వాటం ఆటగాడైన నబీ.. ఆఫ్ బ్రేక్ బౌలర్ కూడా. ఆఫ్ఘాన్ తరపున 72 వన్డేలు ఆడిన నబీ 1724 పరుగులు చేయగా,  73 వికెట్లు తీశాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement