
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తనకు అవకాశం ఇస్తే బ్యాట్‌తో కూడా రాణించాలని ఉందని అంటున్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ. టీ 20ల్లో అఫ్గానిస్తాన్ తరపున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు కల్గిన నబీ తన బ్యాటింగ్ పవర్‌ను ఐపీఎల్‌లో కూడా చూపించాలని ఉందన్నాడు. హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున‍్నందుకు ఆనందంగా ఉందన్న నబీ.. తాజా సీజన్‌లో బ్యాటింగ్‌లో ఆకట్టుకోవడమే తన లక్ష్యంగా పేర్కొన్నాడు.
‘ఈ లీగ్‌లో హైదరాబాద్‌పై అంచనాలు బాగానే ఉన్నాయి. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని మా జట్టు అభిమానుల్ని అలరించడం ఖాయం. నాకు ఆడే అవకాశం లభిస్తే బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లో కూడా రాణిస్తా. ఐపీఎల్‌లో కూడా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాలని ఉంది’ అని నబీ తెలిపాడు. తొలుత తన బౌలింగ్‌కు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్న ఈ అఫ్గాన్ ఆల్‌రౌండర్.. బ్యాటింగ్‌లో కూడా సత్తా చూపడతానని ధీమా వ్యక్తం చేశాడు. గతేడాది ఐర్లాండ్‌తో జరిగిన టీ 20లో నబీ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా అఫ్గాన్ తరపున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన ఖాతాలో లిఖించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment