
కాబోల్: గత కొన్ని రోజులుగా తాను చనిపోయానంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని అఫ్గానిస్తాన్ క్రికెటర్ మహ్మద్ నబీ స్పష్టం చేశాడు. తాను చనిపోయానంటూ కొంతమంది కావాలనే రూమర్లు క్రియేట్ చేశారని నబీ వెల్లడించాడు. నబీ గుండె పోటుతో మృతి చెందాడంటూ వార్తలు వ్యాపించాయి. ఈ విషయాన్ని తాజాగా గ్రహించిన నబీ.. తాను చనిపోలేదని, బ్రతికే ఉన్నానంటూ ట్వీటర్‌లో వివరణ ఇచ్చుకున్నాడు. దీనిలో భాగంగా కబిల్ స్టేడియంలో నబీ ప్రాక్టీస్ చేస్తున్న కొన్ని ఫోటోలను సైతం అఫ్గాన్ క్రికెట్ బోర్డు పోస్ట్ చేసింది. ఇటీవల నబీ అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్న ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. ఈ క‍్రమంలోనే విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.
కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నబీ అజేయంగా 84 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. దాంతో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో 12వసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. ఇది ఓవరాల్‌గా అత్యుత్తమం. కాగా, ఆ తర్వాత స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కొనసాగుతున్నాడు. టీ20ల్లో భారత్ తరఫున కోహ్లి 11సార్లు మాత్రమే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు కైవసం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment