ప్రపంచకప్‌నకు జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్(PC: ACB)
T20 World Cup 2022- Afghanistan Squad: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకై అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును పంపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అఫ్గన్ బోర్డు గురువారం ప్రకటన విడుదల చేసింది.
కెప్టెన్‌గా నబీ.. వైస్ కెప్టెన్‌గా..
ప్రధాన జట్టుతో పాటు నలుగురు రిజర్వు ప్లేయర్లను ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇక వరల్డ్‌కప్‌లో మహ్మద్ నబీ అఫ్గన్ జట్టుకు సారథ్యం వహించనుండగా.. నజీబుల్లా జద్రాన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆసియాకప్- 2022 టోర్నీకి రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైన యువ బౌలర్ కైస్ అహ్మద్.. ఈసారి 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియాలో ఈ మెగా టోర్నీ జరుగనుంది.
ఆసియా కప్ ఆరంభంలో అదుర్స్.. కానీ
ఇక ఇటీవల ముగిసిన ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో అఫ్గనిస్తాన్ లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన నబీ బృందం.. తమ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది.
అయితే, సూపర్ -4 దశలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మొదటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆఖరి వరకు గట్టిపోటీనిచ్చినా చివరికి పరాజయం పాలైంది. టీమిండియాతో చేతిలో ఓడి.. ఓటమితో టోర్నీని ముగించింది.
టీ20 ప్రపంచకప్-2022కు అఫ్గనిస్తాన్ ప్రకటించిన జట్టు:
మహ్మద్ నబీ(కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, కైస్ అహ్మద్, ఉస్మాన్ ఘని, ముజీబ్‌జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సలీం సఫీ, రషీద్ ఖాన్, ఇబ్రహీం జద్రాన్, డార్విష్ రసూలీ, ఫజల్ హక్ ఫారుకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్, నవీన్ ఉల్ హక్.
రిజర్వు ప్లేయర్లు:
అఫ్సర్ జజాయ్, షరాఫుదీన్ అష్రఫ్, గుల్‌బదిన్ నాయీబ్, రహ్మత్ షా.
చదవండి: T20 WC 2022: అందుకే రసెల్‌ను ఎంపిక చేయలేదు: విండీస్ చీఫ్ సెలక్టర్
'ఆ ముగ్గురు ఐపీఎల్‌లో అదరగొట్టారు.. టీ20 ప్రపంచకప్ భారత జట్టులో ఉండాల్సింది'
🚨 BREAKING NEWS 🚨
— Afghanistan Cricket Board (@ACBofficials) September 15, 2022
Afghanistan Cricket Board today announced its 15-member squad for the ICC @T20WorldCup 2022, which will be played from 16th October to 13th November in Australia.
More: https://t.co/1x7it7hx5w pic.twitter.com/ToTKvyCzM4
Comments
Please login to add a commentAdd a comment