Avishka Fernando Run Out: శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20లో అవిష్క ఫెర్నాండో రనౌట్ అయిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణాఫ్రికా ఆటగాడు నోర్ట్జే మెరుపు వేగంతో వేసిన త్రో దాటికి స్టంప్ బయటికి రావడంతో పాటు స్టంప్ మైక్ కూడా ఊడి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 6వ ఓవర్‌ను రబడ వేశాడు.
ఓవర్ ఐదో బంతిని అవిష్క ఫెర్నాండో మిడాన్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న నోర్ట్జే మెరుపువేగంతో బంతిని నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసిరాడు. అంతే బులెట్ వేగంతో వచ్చిన బంతి మిడిల్ స్టంప్‌ను బయటపడేలా చేసింది. దీంతో పాటు మైక్ స్టంప్ కూడా ఊడి వచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 28 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
చదవండి: Shane Warne: టీమిండియా అద్భుతం; ఆటతీరుతో నా టోపీని ఎత్తుకెళ్లారు
Dinesh Chandimal's 66* | 1st T20I #SLvSA @chandi_17
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 11, 2021
Full Highlights➡️ https://t.co/vt7jmJz8AZ pic.twitter.com/ypTwToUaP5
Comments
Please login to add a commentAdd a comment