
లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. డిసెంబర్21న దంబుల్లా జెయింట్సతో జరిగిన క్వాలిఫైయర్ 2లో 23 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈమ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ ఓపెనర్ అవిష్క ఫెర్నాండో సెంచరీతో మెరిశాడు. 64 బంతుల్లో అవిష్క ఫెర్నాండో 100 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జాఫ్నా కింగ్స్‌కు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, అవిష్క ఫెర్నాండో 122 పరుగల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గుర్బాజ్ 40 బంతుల్లో 70 పరుగలు సాధించాడు.
దీంతో నిర్ణీత 20 ఓవరల్లో జాఫ్నా కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దంబుల్లా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 పరుగులకే పరిమితమైంది. కాగా అఖరిలో 75 పరగులతో దంబుల్లా బౌలర్ కరుణరత్నే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఫలితం లేకుండా పోయింది. ఇక జాఫ్నా కింగ్స్ బౌలర్లలో సీల్స్ మూడు వికెట్లు పడగొట్టగా, మహేష్ తీక్షణ, పెరెరా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా డిసెంబర్23న ఫైనల్లో గాలె గ్లాడియటర్స్‌తో జాఫ్నా కింగ్స్ తలపడనుంది.
చదవండి: ఆ టీమిండియా బ్యాటర్‌కి బౌలింగ్ చేయడం చాలా కష్టం: పాక్ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment