Lanka Premier League 2021: Bowler Different Style Celebration After Getting Wicket Shocks Batsman - Sakshi
Sakshi News home page

LPL 2021: బౌలర్‌ వింత సెలబ్రేషన్‌కు బ్యాట్స్‌మన్‌ షాక్‌

Published Sat, Dec 18 2021 8:22 AM | Last Updated on Sat, Dec 18 2021 10:35 AM

Bowler Different Style Celebration After Getting Wicket Shocks Batsman - Sakshi

Bowler Celebration Became Viral After Getting Wicket.. లంక ప్రీమియర్‌ లీగ్‌(ఎల్‌పీఎల్‌)లో భాగంగా కాండీ వారియర్స్‌, డంబుల్లా జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాండీ వారియర్స్‌ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విషయం పక్కనపెడితే.. కాండీ వారియర్స్‌ బౌలర్‌ బినురా ఫెర్నాండో సెలబ్రేషన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. డంబుల్లా జెయింట్స్‌ బ్యాట్స్‌మన్‌ ఫిలిప్‌ సాల్ట్‌ను బినురా ఫెర్నాండో ఒక తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో వికెట్‌ తీశాననే ఆనందంలో ఫెర్నాండో..  యూట్యూట్‌లో బాగా ఫేమస్‌ అయిన సాల్ట్‌ బే సెలబ్రేషన్‌ను తనదైన స్టైల్లో చేశాడు. అయితే ఔటైన బ్యాట్స్‌మన్‌ ఫిలిప్‌ సాల్ట్‌ పేరులో ''సాల్ట్‌'' ఉండడం విశేషం.

చదవండి: PAK Vs WI: ఇది పాక్‌ క్రికెటర్లకే సాధ్యం.. 13 ఏళ్లకు సేమ్‌సీన్‌ రిపీట్‌

ఫెర్నాండో సెలబ్రేషన్స్‌ చూసి ఆశ్చర్యపోయిన ఫిలిప్‌ సాల్ట్‌.. తననేమైనా కామెంట్‌ చేస్తున్నాడా అన్నట్లు గమనించాడు. కానీ ఫెర్నాండో చివరలో పెవిలియన్‌ వైపు వెళ్తున్న సాల్ట్‌ వైపు నవ్వుతూ ఫ్లైయింగ్‌ కిస్‌ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. అయితే సాల్ట్‌ బే సెలబ్రేషన్‌కు ఇంత పాపులారిటి రావడానికి కారణం.. ఒక తుర్కీష్‌ చెఫ్ వంటకాలు తయారు చేసే సమయంలో తనదైన స్టైల్‌లో స్ప్రింకిల్‌ చేయడం అతనికి విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించి పెట్టింది.

ఇక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో కాండీ వారియర్స్‌ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన డంబుల్లా జెయింట్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆర్‌ మెండిస్‌ 41 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. జయతిలకే 34 పరుగులు చేశాడు. బినురా ఫెర్నాండో, అల్‌ అమిన్‌ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన కాండీ వారియర్స్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రవి బొపారా (59 పరుగులు నాటౌట్‌) విజయంలో కీలకపాత్ర పోషించాడు.

చదవండి: కోపంతో ఊగిపోయిన బౌలర్‌.. తన స్టైల్లో ప్రతీకారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement