Rovman Powell Hitting 61 Runs From 19 Balls In LPL.. లంక ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్)లో భాగంగా కాండీ వారియర్స్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్ విధ్వంసం సృష్టించాడు. 19 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 61 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే జట్టును మాత్రం ఓటమి నుంచి రక్షించలేకపోయాడు. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆటను 14 ఓవర్లుకు కుదించారు. తొలుత బ్యాటింత్ చేసిన జఫ్నా కింగ్స్ 14 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 181 పరుగులు భారీ స్కోరు చేసింది. అవిష్క ఫెర్నాండో (23 బంతుల్లో 53, 7 సిక్సర్లు), తిసారా పెరీరా( 21 బంతుల్లో 53 , 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అలరించారు.
చదవండి: Big Bash League 2021: కసిగా 213 పరుగులు కొట్టారు.. ప్రత్యర్థి జట్టు మాత్రం
అనంతరం బ్యాటింగ్ చేసిన కాండీ వారియర్స్‌కు ఓపెనర్లు కెన్నార్ లూయిస్ (41), చరిత్ అసలంక(42) మంచి ఆరంభం ఇచ్చారు. తర్వాత వచ్చిన రోవ్‌మన్ పావెల్ భీకర ఇన్నింగ్స్ ఆడడంతో కాండీ వారియర్స్ 11 ఓవర్లలో 145 పరుగులు చేసి విజయానికి దగ్గరగా వచ్చింది. అయితే పావెల్ ఔటైన అనంతరం మ్యాచ్ జఫ్నా కింగ్స్ వైపు మళ్లింది. ఇక అక్కడినుంచి జఫ్నా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరకు 14 ఓవర్లలో 166 పరుగులకు పరిమితమై 14 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Powell's dominance from start was a testament to his reputation as a power-hitter! @Ravipowell26 @ipg_productions #LPL2021 #එක්වජයගමු #ஒன்றாகவென்றிடுவோம் #EkwaJayagamu #Cricket #WinTogether #SriLanka #Season2 #T20cricket #LankaPremierLeague #TheFutureisHere pic.twitter.com/aiQTDa4pmp
— LPL - Lanka Premier League (@LPLT20) December 8, 2021
Comments
Please login to add a commentAdd a comment