హంబన్‌తోట: పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది మరొకసారి బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. శ్రీలంక వేదికగా జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్) టీ20 ఆరంభపు సీజన్‌లో గాలే గ్లాడియేటర్స్‌కు సారథ్యం వహిస్తున్న అఫ్రిది బ్యాటింగ్‌లో రెచ్చిపోయి ఆడాడు. జఫ్నా స్టాలియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది 20 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి తన బ్యాటింగ్ పవర్ మరోసారి చూపెట్టాడు.(రాహుల్‌కు క్షమాపణ చెప్పా: మ్యాక్స్‌వెల్)
అఫ్రిది హాఫ్ సెంచరీలో మూడు ఫోర్లతో పాటు ఆరు సిక్సర్లు ఉండటం విశేషం. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అఫ్రిది వచ్చీ రావడంతో బ్యాట్ ఝుళిపించాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో అఫ్రిది యాభైకి పైగా పరుగులు సాధించడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2017లో టీ20 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా హాంప్‌షైర్ తరఫున ఆడిన అఫ్రిది.. డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం సాధించాడు. అపై ఇదే అఫ్రిదికి టీ20ల్లో పెద్ద స్కోరు.
కాగా, ఎల్‌పీఎల్‌లో అఫ్రిది దూకుడుతో గాలే గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కానీ అఫ్రిది జట్టు గెలవలేదు. జఫ్నా స్టాలియన్స్ ఇంకా మూడు బంతులు ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అవిష్కా ఫెర్నాండో 63 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. షోయబ్ మాలిక్(27 నాటౌట్) అండగా నిలిచాడు. ఈ జోడి 110 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment