ICC: శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు భారీ షాకిచ్చిన ఐసీసీ.. జింబాబ్వే తర్వాత.. | Sri Lanka Cricket Suspended By ICC Over Governance Breach - Sakshi
Sakshi News home page

ICC: శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు భారీ షాకిచ్చిన ఐసీసీ.. జింబాబ్వే తర్వాత..

Published Sat, Nov 11 2023 2:55 AM | Last Updated on Sat, Nov 11 2023 8:50 AM

Sri Lanka Cricket Board suspended - Sakshi

దుబాయ్‌: శ్రీలంక క్రికెట్‌ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) కఠిన నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్‌ బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు... ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. ఈనెల 21న ఐసీసీ బోర్డు సమావేశం జరుగుతుందని, ఆ తర్వాతే శ్రీలంక బోర్డు భవిష్యత్‌ కార్యాచరణపై స్పష్టత వస్తుందని ఐసీసీ తెలిపింది.

భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. దాంతో శ్రీలంక జట్టు ఆటతీరుపై ఆ దేశ ప్రభుత్వ క్రీడా మంత్రి రోషన్‌ రణసింఘే ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీలంక క్రికెట్‌ బోర్డును రద్దు చేశారు. మాజీ కెపె్టన్‌ అర్జున రణతుంగ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని నియమించారు.

అయితే ఈ నిర్ణయంపై బోర్డు కోర్టుకు వెళ్లింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు క్రికెట్‌ బోర్డును పునర్నియమించింది. జింబాబ్వే (2021) తర్వాత ఐసీసీ ద్వారా సస్పెన్షన్‌కు గురైన రెండో పూర్తిస్థాయి సభ్యత్వ దేశం శ్రీలంక కావడం గమనార్హం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement