కొలంబో: భారత్‌లో పర్యటించేందుకు వస్తున్న శ్రీలంక టి20 జట్టును సోమవారం ప్రకటించారు. 18 మంది సభ్యుల జట్టులో ఆఫ్‌స్పిన్నర్ అషియాన్ డానియెల్ కొత్తగా ఎంపికవగా... మిగతావారంతా ఆస్ట్రేలియాతో తాజా సిరీస్ ఆడినవారే. డానియెల్ లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌ల్లో ప్రతిభ కనబర్చడం ద్వారా భారత సిరీస్‌కు ఎంపిక చేశారు. కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ దసున్ షనకనే కొనసాగిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) తెలిపింది. ఫిట్‌నెస్ సమస్యలెదుర్కొంటున్న మిడిలార్డర్ బ్యాటర్ భానుక రాజపక్స ఈ సిరీస్‌కూ దూరమయ్యాడు.
లంక ఆటగాళ్లు ఆస్ట్రేలియా నుంచి నేరుగా భారత పర్యటనకు వస్తున్నారు. అలా బబుల్ నుంచి బబుల్‌కు మారనుండటంతో క్వారంటైన్ ఇబ్బందుల్లేవు. మూడు పొట్టి మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టి20 ఈ నెల 24న లక్నోలో జరుగుతుంది. మిగతా రెండు మ్యాచ్‌లు 26, 27 తేదీల్లో ధర్మశాలలో జరుగనున్నాయి.
శ్రీలంక టి20 జట్టు: దసున్ షనక (కెప్టెన్), నిసాంక, కుశాల్ మెండిస్, అసలంక, చండిమాల్, దనుష్క గుణతిలక, కమిల్ మిశార, జనిత్ లియనగె, హసరంగ, చమిక కరుణరత్నే, చమీరా, లాహిరు కుమార, బినుర ఫెర్నాండో, షిరన్ ఫెర్నాండో, మహీశ్ తీక్షణ, జెఫ్రె వండెర్సే, ప్రవీణ్ జయవిక్రమ, అషియాన్ డానియెల్.
Comments
Please login to add a commentAdd a comment