
ఇషాన్ కిషన్‌తో హార్దిక్ పాండ్యా (పాత ఫొటో)
India vs Sri Lanka, 1st T20I- Hardik Pandya: ‘‘మేము గతం గురించి ఆలోచించడం లేదు. అయితే, ఒక్కటి మాత్రం నిజం. వాళ్లు ఇండియాలో ఉన్నారన్న భావన కలిగేలా చేస్తాం. కావాల్సినంత మజా అందిస్తాం’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. కాగా శ్రీలంకతో టీ20 సిరీస్ మంగళవారం నుంచి మొదలు కానున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో తొలి టీ20 ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన పాండ్యా ప్రత్యర్థి జట్టును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆసియా కప్-2022 టోర్నీలో శ్రీలంక చేతిలో ఓటమి గురించి ఆలోచించడం లేదన్న హార్దిక్ పాండ్యా.. ‘‘వాళ్లు (శ్రీలంక) మేటి అంతర్జాతీయ జట్టు ఇండియాతో.. అది కూడా ఇండియాలో ఆడుతున్నారన్న భావన కచ్చితంగా కలిగిస్తాం. మా కుర్రాళ్ల తరఫున నేను మీకు మాట ఇస్తున్నా. మేము వాళ్లను స్లెడ్జ్ చేయాల్సిన అవసరం లేదు.
మా బాడీ లాంగ్వేజ్ చాలు
వాళ్లను భయపెట్టడానికి మా బాడీ లాంగ్వేజ్ చాలు. మీరు మంచి గేమ్ చూడబోతున్నారని మాట ఇస్తున్నా’’ అని పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్ టోర్నీ సూపర్-4లో లంక చేతిలో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతో పాండ్యా.. ఆసియా చాంపియన్ దసున్ షనక బృందాన్ని ఢీకొట్టనున్నాడు.
చదవండి: BCCI: బిగ్ ట్విస్ట్.. రేసు నుంచి వెంకటేశ్ ప్రసాద్ అవుట్!? చీఫ్ సెలక్టర్‌గా మళ్లీ అతడే!
Ind Vs SL: ఆసియా చాంప్‌తో ఆషామాషీ కాదు! అర్ష్‌దీప్‌పైనే భారం! ఇషాన్, రుతు.. ఇంకా
Comments
Please login to add a commentAdd a comment