IND Vs SL: సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించిన లంక బోర్డు | IND Vs SL: Sri Lanka Cricket Board Announces Revised Timings Of ODI And T20 Series | Sakshi
Sakshi News home page

IND Vs SL: సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించిన లంక బోర్డు

Published Mon, Jul 12 2021 8:35 PM | Last Updated on Mon, Jul 12 2021 10:17 PM

IND Vs SL: Sri Lanka Cricket Board Announces Revised Timings Of ODI And T20 Series - Sakshi

కొలొంబో: భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్‌ బోర్డు సోమవారం ప్రకటించింది. ముందుగా ప్రకటించిన విధంగానే ఈ నెల 18 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభమవుతుందని, అయితే స్వల్ప సమయ మార్పులు జరిగాయని వెల్లడించింది. జులై 18, 20, 23న జరిగే వన్డే మ్యాచ్‌లు అరగంట ఆలస్యంగా(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు), 25, 27, 29న జరిగే టీ20లు గంట ఆలస్యంగా(భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఇదిలా ఉంటే, ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న లంక జట్టులో ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లు జులై 18కి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే లంక బోర్డు ఆయా మ్యాచ్‌ల ప్రారంభ సమయాల్లో స్వల్ప మార్పులు చేసింది. ఇంతకుముందు షెడ్యూల్‌ ప్రకారం వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 గంటలకు.. టీ20లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకావాల్సి ఉండింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement