Revised Schedule
-
IND Vs SL: సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించిన లంక బోర్డు
కొలొంబో: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ముందుగా ప్రకటించిన విధంగానే ఈ నెల 18 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుందని, అయితే స్వల్ప సమయ మార్పులు జరిగాయని వెల్లడించింది. జులై 18, 20, 23న జరిగే వన్డే మ్యాచ్‌లు అరగంట ఆలస్యంగా(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు), 25, 27, 29న జరిగే టీ20లు గంట ఆలస్యంగా(భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. #SLvIND pic.twitter.com/LQSJT5tDmM — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 12, 2021 ఇదిలా ఉంటే, ఇటీవల ఇంగ్లండ్ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న లంక జట్టులో ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లు జులై 18కి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే లంక బోర్డు ఆయా మ్యాచ్‌ల ప్రారంభ సమయాల్లో స్వల్ప మార్పులు చేసింది. ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 గంటలకు.. టీ20లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకావాల్సి ఉండింది. -
ఓటుహక్కు నమోదుకు అవకాశం
బేల: ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. పేరు లేకున్నా.. ఏమైనా సవరణలు ఉన్నా.. దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయం, అన్ని పోలింగ్‌బూత్‌లలో ఓటరు జాబితా అందుబాటులో ఉంది. ఆ జాబితాలో తమ పేర్లను పరిశీలించుకునే విధంగా అవకాశం కల్పించారు అధికారులు. పేర్లు తప్పుగా ఉన్నవారు, మార్పుల, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అభ్యంతరాల స్వీకరణతో పాటు కొత్త ఓటరు నమోదుకు డిసెంబర్ 15వరకు అవకాశం కల్పించింది. నియోజకవర్గం అధికారులు ముసాయిదా జాబితాను ఇటీవల విడుదల చేశారు. అర్హులకు అవకాశం.. రాజ్యాంగం ప్రకారం 18ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడికి ఓటు హక్కును కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి కొత్తగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2021 జనవరి 1వరకు 18ఏళ్లు నిండిన వారు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ప్రత్యేక ప్రణాళిక.. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతారు. ఈ ఏడాది కూడా నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు రోజులు పోలింగ్ కేంద్రాలు, తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు స్వీకరించే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈనెల 21, 22తేదీలతో పాటు డిసెంబర్ 5, 6న ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా ఓటరు నమోదు చేసుకునే వీలుంటుంది. 2020 డిసెంబర్ 15 వరకు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. 2021 జనవరి 5న దరఖాస్తులు పరిశీలించిన అనంతరం జనవరి 14న తొలి జాబితాను విడుదల చేస్తారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. -
ఏప్రిల్ 7 నుంచి గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు
సాక్షి, అమరావతి : గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 7వ తేదీ నుంచి 19 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు గురువారం రివైజ్డ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా పలువురు అభ్యర్థుల నుంచి పరీక్షలు వాయిదా వేయాలని విన్నపాలు అందడంతో కమిషన్ ఇటీవల పరీక్షల్ని వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తేదీల వారీగా, పేపర్ల వారీగా ఆయా పరీక్షల రివజ్డ్ షెడ్యూల్ ఇలా... ఏప్రిల్ 7 : తెలుగుపేపర్ (క్వాలిఫయింగ్ నేచర్) ఏప్రిల్ 8 : ఇంగ్లిష్ పేపర్ (క్వాలిఫయింగ్ నేచర్) ఏప్రిల్ 11 : పేపర్1 ఏప్రిల్ 13 : పేపర్2 ఏప్రిల్ 15 : పేపర్3 ఏప్రిల్ 17 : పేపర్4 ఏప్రిల్ 19 : పేపర్5 వీటితో పాటు గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 10, 11 : అసిస్టెంట్ బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ మే 11 : మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ మే 12 : సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్ ,ఇంజనీరింగ్ పీటీవో, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ కెమిస్ట్ ఏపీ గ్రౌండ్ వాటర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ -
‘గురుకుల’ పరీక్షా విధానంలో మార్పులు
ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల రాత పరీక్ష ఒకే పూట సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల విధానంలో టీఎస్పీఎస్సీ మార్పులు చేసింది. గురువారం ఈ మేరకు రివైజ్డ్ షెడ్యూల్‌ను జారీ చేసింది. ఇదివరకు ప్రతి కేటగిరీలో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించేలా రెండు పేపర్ల విధానాన్ని ప్రకటించింది. తాజాగా ప్రతి కేటగిరీలో ఒకే పేపర్‌గా రాత పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ జారీ చేసింది. ఈనెల 31న ఆర్ట్ టీచర్ పోస్టులకు ఉదయం జనరల్ స్టడీస్, మధ్యాహ్నం ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుందని పేర్కొనగా.. ఇప్పుడు దానిని మార్పు చేసింది. 31వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జనరల్ స్టడీస్–ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. అలాగే క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టుల పరీక్షల పేపర్లలోనూ మార్పులు చేసింది. వచ్చే నెల 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జనరల్ స్టడీస్–క్రాఫ్ట్ అండ్ క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ పరీక్ష, అదే రోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జనరల్ స్టడీస్–మ్యూజిక్ అండ్ మ్యూజిక్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుందని వివరించింది. పూర్తి వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని వెల్లడించింది.