శ్రీలంక క్రికెట్ బోర్డుపై రణతుంగ ఫైర్ | Indian tour has hurt sri lanka's World Cup preparation: Arjuna Ranatunga | Sakshi
Sakshi News home page

శ్రీలంక క్రికెట్ బోర్డుపై రణతుంగ ఫైర్

Published Fri, Nov 14 2014 11:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

శ్రీలంక క్రికెట్ బోర్డుపై రణతుంగ ఫైర్

శ్రీలంక క్రికెట్ బోర్డుపై రణతుంగ ఫైర్

కొలంబో : శ్రీలంక క్రికెట్ బోర్డుపై మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీసీఐని మెప్పించడం కోసం శ్రీలంక క్రికెట్ జట్టును నిరాశ నిస్పృహల్లో మునిగేలా చేశారని వ్యాఖ్యానించారు. భారత్లో 4వ వన్డేలో శ్రీలంక పరాజంయ అనంతరం రణతుంగ నిప్పులు చెరిగాడు. సెలక్షన్ ఛైర్మన్ జయసూర్య, జాతీయ కోచ్ ఆటపట్టు, కెప్టెన్ ఏంజిలో మ్యాథ్యూస్‌లు ఓటమికి బాధ్యత వహించాలని అతడు డిమాండ్ చేశాడు.

ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంక జట్టు ఒక్క మ్యాచ్లోనూ గెలుపొందలేదు. దాంతో భారత్ కు 4-0 ఆధిక్యం దక్కింది. కాగా వెస్టిండీస్ బోర్డుకు, క్రికెటర్లకు మధ్య జీత భత్యాల చెల్లింపుపై విభేదాలు నెలకొనడంతో భారత పర్యటన నుంచి వెస్టిండీస్ జట్టు వైదొలగిన విషయం తెలిసిందే. దాంతో వెస్టిండీస్ పర్యటనకు ప్రత్యామ్నాయంగా శ్రీలంక జట్టు పర్యటనను బీసీసీఐ ఖరారు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement