కొలంబో : శ్రీలంక క్రికెటర్ తరంగ పరణవితన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ శుక్రవారం తెలిపింది. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు బోర్డుకు పరణవితన స్వయంగా వెల్లడించాడు.38 ఏండ్ల పరణవితన జాతీయ జట్టు తరపుణ 32 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. రెండు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలతో మొత్తం 1792 పరుగులు చేశాడు. 2009లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన తరంగ తన రెండు సెంచరీలను 2010లో భారత్‌పైనే నమోదు చేశాడు. 2012లో తన చివరి మ్యాచ్‌ను ఆడాడు. చదవండి : (ఊహించని ట్విస్ట్.. పాపం కెవిన్ ఒబ్రెయిన్)
Comments
Please login to add a commentAdd a comment