అభిమాన క్రికెటర్ కోసం రోడ్డెక్కిన ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. భారత పర్యటన కోసం ఎంపిక చేసిన లంక జట్టులో తమ ఫేవరెట్ క్రికెటర్ భానుక రాజపక్సకు చోటు కల్పించకపోవడంపై అతని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకొని రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. శ్రీలంక క్రికెట్ బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం లంక క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తూ, క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభంకానున్న భారత పర్యటనలో లంక జట్టు మూడు టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇందు కోసం లంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) 19 మంది సభ్యుల జట్టును కొద్ది రోజుల కిందట ప్రకటించింది. ఫిట్‌నెస్ కారణాలను సాకుగా చూపి భానుక రాజపక్సేకు జట్టులో చోటు కల్పించకపోవడం అతని అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
కాగా, గతేడాది టీ20 ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత భానుక రాజపక్సే వెలుగులోకి వచ్చాడు. ఆ మెగా టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అతను.. రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. భానుక శ్రీలంక తరఫున 5 వన్డేలు, 18 టీ20లు మాత్రమే ఆడినప్పటికీ లంకేయుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే, అనూహ్యంగా ఈ ఏడాది జనవరిలో రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. తిరిగి కొన్ని రోజుల్లోనే వెనక్కు తగ్గి మరోసారి వార్తల్లో నిలిచాడు.
చదవండి: Sachin Tendulkar: కోహ్లి నా సాయం కోరాడు.. సమయం వెచ్చించమని రిక్వెస్ట్ చేశాడు
Comments
Please login to add a commentAdd a comment