దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన చైర్మన్‌గా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జై షా క్రికెట్‌ను సమున్నత శిఖరాలకు తీసుకెళ్తానని అన్నారు. గురువారం చైర్మన్‌గా తొలిసారి ఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ కొత్త బాధ్యతలు ఉత్తేజంగా పని చేసేందుకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.
‘నేను దేన్నయితే ఆసక్తిగా చూసేవాడినో (క్రికెట్)... అదే ఇప్పుడు నన్ను ప్రోత్సహిస్తుంది. మంచి గుర్తింపును ఇస్తుంది. అయితే నాకిది ఆరంభం మాత్రమే! క్రికెట్ క్రీడకు మరింత సొబగులద్దాలి. ఆట కొత్త శిఖరాలు అధిరోహించేందుకు ఐసీసీ ఉన్నతాధికారులతో కలిసి ఇప్పటి నుంచే కష్టపడతాను.
మేమంతా స్పష్టమైన విజన్‌తో ముందుకెళ్తాం’ అని అన్నారు. కార్యాలయ సందర్శన వల్ల సహచరులతో కలిసి పనిచేసేందుకు చక్కని సమన్వయం కుదురుతుందని, ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందన్నారు. రోడ్‌మ్యాప్‌కు అవసరమైన వ్యూహాలు ఇక్కడే మొదలవుతాయన్నారు.
అంకితభావంతో పనిచేసే ఐసీసీ బృందంతో ఇలా పనిచేయడం మంచి అనుభూతి ఇస్తుందని పేర్కొన్నారు. జై షాకు సాదర స్వాగతం పలికిన డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా ఐసీసీ కొత్త చైర్మన్ పదవీ కాలంలో మరెన్నో మైలురాళ్లు సాధించాలని ఆకాంక్షించారు.
చదవండి: SA vs SL 2nd Test: రికెల్టన్ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే
Comments
Please login to add a commentAdd a comment