IPL 2022 Mega Auction Players List Announced: Check Details Of 590 Shortlisted Cricketers - Sakshi
Sakshi News home page

IPL 2022 Auction Players List: మెగా వేలంలో పాల్గొనబోయేది వీళ్లే: బీసీసీఐ

Published Tue, Feb 1 2022 3:24 PM | Last Updated on Tue, Feb 1 2022 5:23 PM

IPL 2022 Mega Auction: Players List Announced 590 Cricketers Shortlisted - Sakshi

PC: IPL

IPL 2022 Mega Auction: ఐపీఎల్‌ మెగా వేలం-2022 నేపథ్యంలో 1214 మంది ఆటగాళ్లు తమ పేరు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో 590 మంది క్రికెటర్లు వేలానికి షార్ట్‌లిస్ట్‌ అయినట్లు బీసీసీఐ మంగళవారం వెల్లడించింది. ఇందులో 228 మంది క్యాప్డ్‌ ప్లేయర్లు కాగా... 355 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్‌ దేశాలకు చెందిన వారు ఉన్నారు. 

ఇక టీమిండియా నుంచి శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్‌ ధావన్‌, అశ్విన్‌, మహ్మద్‌ షమీ, ఇషాన్‌ కిషన్‌, అజింక్య రహానే, సురేశ్‌ రైనా, యజువేంద్ర చహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌ తదితర స్టార్‌​ ప్లేయర్లు రేసులో నిలిచారు. 

అదే విధంగా అఫ్గనిస్తాన్‌ నుంచి 17, ఆస్ట్రేలియా నుంచి 47, బంగ్లాదేశ్‌ నుంచి 5, ఇంగ్లండ్‌ నుంచి 24, ఐర్లాండ్‌ నుంచి 5, న్యూజిలాండ్‌ నుంచి 24, దక్షిణాఫ్రికా నుంచి 33, శ్రీలంక నుంచి 23, వెస్టిండీస్‌ నుంచి 34, జింబాబ్వే నుంచి ఒకరు, నమీబియా నుంచి ముగ్గురు, నేపాల్‌ నుంచి ఒకరు, స్కాట్లాండ్‌ నుంచి ఇద్దరు, అమెరికా నుంచి ఒకరు వేలంలో పాల్గొననున్నారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటన విడుదల చేశారు.

కనీస ధర 2 కోట్లు... 48 మంది ప్లేయర్లు..
మెగా వేలం నేపథ్యంలో 48 మంది తమ కనీస ధరను 2 కోట్లుగా పేర్కొనగా... 20 మంది ఒకటిన్నర కోటి, 34 మంది ఒక కోటి రూపాయలను తమ బేస్‌ ప్రైస్‌గా పేర్కొన్నారు.  కాగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చదవండి: IPL 2022: ఆ డబ్బుతో మొదట ఐఫోన్‌, సెకండ్‌ హాండ్‌ కారు కొన్నా.. అందులో ఏసీ లేదు: సిరాజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement