అధ్యక్షుడు, కార్యదర్శితో పాటు ఇతర ఆఫీస్ బేరర్ల పదవీకాలం పొడిగించుకునే వీలుగా బీసీసీఐ రాజ్యాంగంలో సవరణలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ రేపటికి (జులై 21) వాయిదా పడింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును రేపటికి వాయిదా వేసింది. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ప్రస్తుత బీసీసీఐ పాలకమండలి 2020లో ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
బోర్డు రాజ్యాంగంలో ఆరు సవరణలు చేసేందుకు అనుమతి కావాలని బీసీసీఐ సుప్రీంను ఆశ్రయించింది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, కార్యదర్శిగా జై షా పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముగియనున్న నేపథ్యంలో వీరిద్దరు కోర్డు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చదవండి: కామన్ వెల్త్ గేమ్స్‌కు ముందు భారత్‌కు భారీ షాక్..!
Comments
Please login to add a commentAdd a comment