టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీకి సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జై షా బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. షమీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో (స్వదేశంలో) జరిగే టెస్ట్ సిరీస్ సమయానికి అందుబాటులోకి వస్తాడని షా తెలిపారు.
షా స్టేట్‌మెంట్‌ను బట్టి చూస్తే షమీ టీ20 వరల్డ్‌కప్‌తో పాటు ఐపీఎల్ ఆడడని ఖరారైపోయింది. లండన్‌లో చీలిమండ గాయానికి శస్త్రచికిత్స చేసుకుని ఇటీవలే స్వదేశానికి వచ్చిన షమీ.. గతేడాది భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత జట్టుకు దూరమయ్యాడు.
జై షా షమీ హెల్త్ అప్‌డేట్ ఇస్తున్న సందర్భంగానే మరో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌కు సంబంధించిన అప్‌డేట్ కూడా ఇచ్చారు. వెన్ను సమస్యతో బాధపడుతున్న రాహుల్.. ఐపీఎల్ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని షా తెలిపారు.
ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రాహుల్‌కు ఇంజెక్షన్ అవసరముందని షా పేర్కొన్నారు. వెన్ను సమస్య కారణంగా రాహుల్ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని చివరి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
కాగా, జై షా వీరిద్దరి గురించే కాకుండా మరో టీమిండియా ఆటగాడి హెల్త్ గురించి కూడా అప్‌డేట్ ఇచ్చడు. 2022లో కారు ప్రమాదానికి గురై ప్రస్తుతం ఎన్‌సీఏ రీహ్యాబ్‌లో ఉన్న రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడని షా తెలిపారు. పంత్ మునపటిలా బ్యాటింగ్ చేస్తున్నాడని పేర్కొన్నారు. త్వరలోనే పంత్‌కు ఎన్‌ఓసీ ఇస్తామని షా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment