బీసీసీఐ ఉదారత.. భారత అథ్లెట్లకు ఆర్థిక సాయం | BCCI Will Provide INR 8.5 Crore To Indian Olympic Association For Upcoming Olympics Campaign, See Details | Sakshi
Sakshi News home page

బీసీసీఐ ఉదారత.. భారత అథ్లెట్లకు ఆర్థిక సాయం

Published Sun, Jul 21 2024 8:15 PM | Last Updated on Mon, Jul 22 2024 11:18 AM

BCCI Will Provide INR 8.5 Crore To Indian Olympic Association For Upcoming Olympics Campaign

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉదారత చాటుకుంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్ల బృందానికి ఆర్ధిక సాయం ప్రకటించింది. అథ్లెట్లకు ప్రోత్సాహకంగా ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌కు 8.5 కోట్ల రూపాయలు అందజేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ఈ విషయాన్ని షా ట్విటర్‌ ద్వారా తెలిపారు.

ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న అథ్లెట్లకు బీసీసీఐ మద్దతు ఇస్తుందని తెలపడానికి గర్విస్తున్నాను. ఈ ఒలింపిక్స్​ కోసం బీసీసీఐ రూ.8.5కోట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్​ అందిస్తుంది. మన అథ్లెట్లందరికీ ఆల్​ ది బెస్ట్. భారత్ గర్వించేలా చేయండి. జై హింద్ అని షా తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

కాగా, ఈ నెల 26 నుంచి ప్రారంభం కాబోయే పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి 117 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. భారత బృందంలో 70 మంది పరుషులు, 47 మహిళా సభ్యులు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement