ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లకు బీసీసీఐ అదిరిపోయే న్యూస్ అందించింది. ఐపీఎల్-2025 సీజన్ నుంచి ప్రతీ ఆటగాడికి మ్యాచ్ ఫీజు కింద రూ.7.50 లక్షలు ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ఎక్స్ వేదికగా శనివారం వెల్లడించారు.
"ఐపీఎల్ మ్యాచ్ ఫీజులు పెంచాలని నిర్ణయించున్నాం. మా క్రికెటర్లు ఇకపై ఒక్కో గేమ్‌కు రూ.7.5 లక్షల ఫీజు అందుకోనున్నారు. ఈ చారిత్రత్మక నిర్ణయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఓ క్రికెటర్ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే కాంట్రాక్ మొత్తంతో పాటు అదనంగా రూ.1.05 కోట్లు పొందుతాడు. ప్రతీ ఫ్రాంచైజీ సీజన్ మ్యాచ్ ఫీజుగానూ రూ. 12.60 కోట్లు కేటాయిస్తుంది. ఐపీఎల్‌కు, ప్లేయర్లకు ఇది కొత్త శకం' అని ఎక్స్‌లో జైషా రాసుకొచ్చారు. కాగా గతంలో ఒక్కో మ్యాచ్‌కు ఫీజు రూ. 2 - 4 లక్షల మధ్యలో ఉండేది.
In a historic move to celebrate consistency and champion outstanding performances in the #IPL, we are thrilled to introduce a match fee of INR 7.5 lakhs per game for our cricketers! A cricketer playing all league matches in a season will get Rs. 1.05 crores in addition to his…
— Jay Shah (@JayShah) September 28, 2024
Comments
Please login to add a commentAdd a comment