BCCI Announces Equal Pay For Indian Women Cricketers As Male Cricketers - Sakshi
Sakshi News home page

బీసీసీఐ చారిత్రక నిర్ణయం

Published Thu, Oct 27 2022 1:45 PM | Last Updated on Thu, Oct 27 2022 3:20 PM

BCCI Announces Equal Pay For Indian Women Cricketers As Male Cricketers - Sakshi

సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కలిగిన భారత మహిళా క్రికెటర్ల మ్యాచ్‌ ఫీజ్‌కు సంబంధించి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) చారిత్రక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కలిగిన పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్‌ ఫీజ్‌ చెల్లించాలని డిసైడైంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఇవాళ (అక్టోబర్‌ 27) ట్వీట్‌ చేశాడు. మహిళా క్రికెటర్లపై ఉన్న వివక్షను పారద్రోలేలా ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు షా వెల్లడించాడు.

లింగ భేదం లేకుండా పే ఈక్విటి విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ప్రకటించాడు. మహిళల క్రికెట్‌లో ఇదో సరికొత్త అధ్యాయమని ఆయన వర్ణించాడు. ఇకపై భారత పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా టెస్ట్‌ మ్యాచ్‌కు 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20కి 3 లక్షల రూపాయలు చెల్లించనున్నట్లు షా ప్రకటించాడు.

సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కలిగిన పురుష క్రికెటర్ల మ్యాచ్‌ ఫీజ్‌ విషయానికొస్తే.. ఏ ప్లస్‌ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు ఏడాదికి 7 కోట్లు, ఏ కేటగిరిలోని ప్లేయర్లకు 5 కోట్లు, బి కేటగిరిలో ఉన్న వారికి 3 కోట్లు, సీ కేటగిరి ప్లేయర్లకు కోటి రూపాయలు వార్షిక రుసుముగా అందుతుంది. 

అదే మహిళా క్రికెటర్ల విషయానికొస్తే.. ఏ గ్రేడ్‌ ప్లేయర్లకు 50 లక్షలు, బీ గ్రేడ్‌ వారికి 30 లక్షలు, సీ గ్రేడ్‌లో ఉన్న ప్లేయర్లకు 10 లక్షలు వార్షిక వేతనంగా అందుతుంది. ఇది పురుష క్రికెటర్ల వార్షిక వేతనం కేవలం పది శాతం మాత్రమే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement