Match fee
-
ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్
బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఓటమితో బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. బంగ్లాతో తొలి వన్డేలో స్లోఓవర్ రేట్ కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 80శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా షెడ్యూల్ సమయానికి ఓవర్లు పూర్తి చేయలేకపోతే 20 శాతం మ్యాచ్ ఫీజుని పెనాల్టీని విధిస్తారు. అయితే తొలి వన్డేలో టీమిండియా... ఓవర్ రేటుకి ఏకంగా నాలుగు ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో తక్కువ వేసిన ఒక్కో ఓవర్‌కి 20 శాతం చొప్పున 80 శాతం మ్యాచ్ ఫీజును కోత విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. ''ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ నిబంధన ప్రకారం స్లో ఓవర్ రేటు చేసిన జట్టు ప్లేయర్లకు, సపోర్టింగ్ స్టాఫ్‌కి, అలాగే జట్టుతో సంబంధం ఉన్న ఇతర సిబ్బందికి ఒక్కో ఓవర్‌కి 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించడం జరుగుతుంది.మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లే, టీమిండియా నెట్ ఓవర్ రేటుకి ఏకంగా నాలుగు ఓవర్లు తక్కువగా వేసినట్టు గుర్తించారు'' అంటూ ఐసీసీ తన ట్విటర్లో పేర్కొంది. కాగా స్లో ఓవర్ రేటుపై రిఫరీకి క్షమాపణలు తెలిపిన రోహిత్ శర్మ మ్యాచ్ ఫీజు కోతకి అంగీకరించాడు. దీంతో తొలి వన్డేలో ఆడిన టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్ ఫీజు కింద కేవలం 20 శాతం మాత్రమే అందుకోనున్నారు. ఇక ఢాకాలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండడంతో టీమిండియా బౌలర్లు కూడా చెలరేగారు. దీంతో బంగ్లాదేశ్ 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరొక వికెట్ తీస్తే చాలు, టీమిండియాదే విజయం అనుకుంటున్న సమయంలో మెహిడీ హసన్, ముస్తాఫిజుర్ రహ్మన్ కలిసి 10వ వికెట్‌కి 51 పరుగులు జోడించి జట్టుకు చారిత్రక విజయాన్ని అందించారు. 2019లో కెప్టెన్‌గా బంగ్లాదేశ్‌పై టీ20 మ్యాచ్ ఓడిపోయిన రోహిత్ శర్మ, వన్డే మ్యాచ్‌లోనూ పరాజయాన్ని చవిచూశాడు. బంగ్లాదేశ్‌పై టీ20, వన్డేల్లో ఓటమి చవిచూసిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా రోహిత్ చెత్త రికార్డు నెలకొల్పాడు . ఇరు జట్ల మధ్య డిసెంబర్ 7న(బుధవారం) రెండో వన్డే జరగనుంది. ఇప్పటికే తొలి వన్డేలో ఓడిన భారత జట్టు రెండో వన్డేలో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. అయితే స్వదేశంలో ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్..రోహిత్ సేనపై ఇదే రిజల్ట్‌ని రిపీట్ చేయాలని భావిస్తోంది. చదవండి: FIFA: మ్యాచ్ సమయంలో మెస్సీ ఎందుకు నడుస్తాడో తెలుసా? ఫలితం రాదనుకున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద్బుతం -
బీసీసీఐ చారిత్రక నిర్ణయం
సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన భారత మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజ్‌కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చారిత్రక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజ్ చెల్లించాలని డిసైడైంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఇవాళ (అక్టోబర్ 27) ట్వీట్ చేశాడు. మహిళా క్రికెటర్లపై ఉన్న వివక్షను పారద్రోలేలా ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు షా వెల్లడించాడు. I’m pleased to announce @BCCI’s first step towards tackling discrimination. We are implementing pay equity policy for our contracted @BCCIWomen cricketers. The match fee for both Men and Women Cricketers will be same as we move into a new era of gender equality in 🇮🇳 Cricket. pic.twitter.com/xJLn1hCAtl — Jay Shah (@JayShah) October 27, 2022 లింగ భేదం లేకుండా పే ఈక్విటి విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ప్రకటించాడు. మహిళల క్రికెట్లో ఇదో సరికొత్త అధ్యాయమని ఆయన వర్ణించాడు. ఇకపై భారత పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా టెస్ట్ మ్యాచ్‌కు 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20కి 3 లక్షల రూపాయలు చెల్లించనున్నట్లు షా ప్రకటించాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన పురుష క్రికెటర్ల మ్యాచ్ ఫీజ్ విషయానికొస్తే.. ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు ఏడాదికి 7 కోట్లు, ఏ కేటగిరిలోని ప్లేయర్లకు 5 కోట్లు, బి కేటగిరిలో ఉన్న వారికి 3 కోట్లు, సీ కేటగిరి ప్లేయర్లకు కోటి రూపాయలు వార్షిక రుసుముగా అందుతుంది. అదే మహిళా క్రికెటర్ల విషయానికొస్తే.. ఏ గ్రేడ్ ప్లేయర్లకు 50 లక్షలు, బీ గ్రేడ్ వారికి 30 లక్షలు, సీ గ్రేడ్‌లో ఉన్న ప్లేయర్లకు 10 లక్షలు వార్షిక వేతనంగా అందుతుంది. ఇది పురుష క్రికెటర్ల వార్షిక వేతనం కేవలం పది శాతం మాత్రమే. -
కివీస్ క్రికెట్లో ‘సమ’శకం.. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు
క్రైస్ట్‌చర్చ్: ప్రపంచ క్రికెట్లో సమ, నవ శకానికి న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జెడ్‌సీ) నాంది పలికింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆధిపత్యం చలాయిస్తున్న పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టులు ఇవ్వనున్నట్లు ఎన్‌జెడ్‌సీ ప్రకటించింది. దీనికి సంబంధించిన విధాన నిర్ణయాన్ని వెలువరించింది. వచ్చే ఐదేళ్ల కాంట్రాక్టులో నూతన సమాన వేతనాలను ఒక్క అంతర్జాతీయ క్రికెట్‌కే పరిమితం చేయకుండా ఎన్‌జెడ్‌సీ బోర్డు దేశవాళీ క్రికెట్లోనూ ప్రవేశపెట్టడం నిజంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడమే! ఇప్పుడు కివీస్ స్టార్లు విలియమ్సన్ సహచరులకు ఎంత మొత్తం లభిస్తుందో... సోఫీ డివైన్ బృందం కూడా అంతే మొత్తం మ్యాచ్ ఫీజులు, వేతన భత్యాలు పొందుతుంది. శాసించే చోట సమానత్వం అంతర్జాతీయ క్రికెట్ అంటేనే పురుషుల క్రికెట్. అది ప్రపంచకప్ అయినా... యాషెస్ సిరీస్ అయినా... ఆసియా కప్ అయినా పురుషాధిక్యమే మైదానంలో మెరుపుల్ని మెరిపిస్తుంది. వారి బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లను జమచేసుకుంటుంది. ఇలా శాసించే చోట సమానత్వం కొత్త ఒరవడే కాదు... ఆ బోర్డు చేసే సాహసమే! పురుషుల సిరీస్‌లకు వచ్చేంత రాబడి మహిళల ప్రపంచకప్‌కు రాదు. అయినప్పటికీ న్యూజిలాండ్ సమాన చెల్లింపుల విధానంతో ఏకంగా ఐదేళ్లు కాంట్రాక్టు ఇవ్వడం అనేది క్రికెట్లో పెద్ద సంచలనం. ఎన్‌జెడ్‌సీ ఫీజులను పరిశీలిస్తే ఒక్కో టెస్టుకు 10,500 న్యూజిలాండ్ డాలర్లు (రూ. 5 లక్షల 11 వేలు), ఒక్కో వన్డేకు 4,000 డాలర్లు (రూ. లక్షా 94 వేలు), ఒక్కో టి20 మ్యాచ్‌కు 2,500 డాలర్లు (రూ. లక్షా 21 వేలు) చెల్లిస్తారు. అయితే న్యూజిలాండ్ అమ్మాయిల జట్టు 2004 నుంచి ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. -
ఐపీఎల్ నిబంధన ఉల్లంఘన.. కేఎల్ రాహుల్‌కు భారీ జరిమానా
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ నిబంధనలను అతిక్రమించిన కారణంగా కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ మేనేజ్మెంట్ తెలిపింది. డీవై పాటిల్ వేదికగా ఆర్సీబీతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నిబంధన అతిక్రమించినట్లు సమాచారం అందింది. కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేఎల్ రాహుల్ లెవల్-1 నిబంధన ఉల్లఘించినట్లు తేలింది. రాహుల్ కూడా తన తప్పును ఒప్పుకోవడంతో రూల్ ప్రకారం అతని మ్యాచ్ ఫీజు నుంచి 20 శాతం కోత విధిస్తున్నాం అంటూ ప్రకటనలో తెలిపింది. కాగా కేఎల్ రాహుల్ ఇప్పటికే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా 12 లక్షల జరిమానా పడింది. మరో రెండుసార్లు రాహుల్ స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే ఒక మ్యాచ్ బ్యాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తృటిలో తప్పించకున్న మార్కస్ స్టోయినిస్ లక్నో సూపర్ జెయింట్స్‌కే చెందిన బ్యాట్స్‌మన్ మార్కస్ స్టోయినిస్ తృటిలో జరిమానా నుంచి తప్పించకున్నాడు. వైడ్ విషయంలో అంపైర్‌ను తప్పుబట్టి ఐపీఎల్ లెవెల్-1 నిబంధన అతిక్రమించాడు. అయితే మేనేజ్మెంట్ మాత్రం స్టోయినిస్‌ను వార్నింగ్‌తో సరిపెట్టింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద స్టోయినిస్ లెవెల్-1 నిబంధనను అతిక్రమించాడు. అయితే ఇది మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరించి వదిలేస్తున్నాం అంటూ ప్రకటనలో పేర్కొంది, ఇక మ్యాచ్ విషయానికి వస్తే లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. కృనాల్ పాండ్యా 42 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కేఎల్ రాహుల్ 30, స్టోయినిస్ 24 పరుగులు చేశారు. చదవండి: LSG vs RCB: అంపైర్ వైడ్ ఇచ్చుంటే లక్నో మ్యాచ్ గెలిచేదేమో! Virat Kohli Golden Duck In IPL: అదే నిర్లక్ష్యం.. కోహ్లి ఖాతాలో అనవసర రికార్డు -
1983 వరల్డ్‌కప్: టీమిండియా సభ్యుల మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా?
భారత క్రికెట్లో '1983' సంవత్సరం ఒక పెను సంచలనం. దేశంలో క్రికెట్‌ను పిచ్చిగా అభిమానించే స్థాయికి కారణమైన ఏడాది. క్రికెట్లో ఉండే మజాను భారత అభిమానులకు పరిచయం చేసింది ఆ సంవత్సరం. 1983 వన్డే ప్రపంచకప్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రపంచకప్ సాధించిన కపిల్ డెవిల్స్ అద్బుతం చేసి చూపెట్టింది. అప్పటివరకు సాధారణ వ్యక్తులుగా కనిపించిన ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోయారు. ప్రపంచకప్ సాధించిన టీమిండియాలోని 14 మంది ఆటగాళ్లు తర్వాతి తరానికి ఒక ఐకాన్‌గా మారిపోయారు. తాజాగా బాలీవుడ్లో కపిల్ డెవిల్స్ సాధించిన 1983 వరల్డ్‌కప్‌ను బేస్ చేసుకొని కబీర్ ఖాన్ దర్శకత్వంలో '83' సినిమా తెరకెక్కిందన్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభం నుంచే మంచి హైప్ తెచ్చుకుంది. ఈ మధ్యన విడుదలైన ట్రైలర్‌తో తెరపై ఒక అద్భుతం చూపించబోతున్నారని క్లియర్‌గా అర్థమవుతుంది. కపిల్ దేవ్‌గా రణ్‌వీర్‌సింగ్ నటిస్తుండడంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చి చేరింది. డిసెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనున్న '83' సినిమా బ్లాక్బాస్టర్గా నిలవడం ఖామమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక కలెక్షన్ల విషయంలోనూ ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను తిరగారాసే అవకాశముందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సినిమా సంచలనం చేస్తుందా లేదా అన్నది పక్కనబెడితే.. 1983 ప్రపంచకప్‌లో టీమిండియా జట్టు సభ్యుల పారితోషికం విలువ సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. చదవండి: 83 Movie Trailer Out: '83' ట్రైలర్ విడుదల.. సెలబ్రిటీల ప్రశంసలు ఇప్పుడంటే టీమిండియా క్రికెట్ బోర్డు బీసీసీఐ.. క్రికెట్‌ను కనుసైగలతో శాసిస్తోంది. ఏకంగా ఐసీసీని కూడా ఒప్పించగల శక్తి ఉంది. మరి 1983 ప్రపంచకప్‌లో పాల్గొన్న టీమిండియా జట్టు సభ్యుల రోజువారి అలవెన్స్, మ్యాచ్ ఫీజు తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ. అప్పట్లో కపిల్ సేనకు ఒక్కో మ్యాచ్‌కు ఫీజు రూ. 1500, అలవెన్స్ కింద రోజుకు రూ.200 చొప్పున మూడురోజులకు గానూ రూ.600.. మొత్తంగా రూ.2100 అందించారు. ఆ ప్రపంచకప్‌లో టీమిండియా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ జట్టు సభ్యులు ప్రతీసారి రూ.2100 మాత్రమే అందుకోవడం విశేషం. చదవండి: Kapil Dev: కపిల్‌లా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ చేయండి.. 2019లో మర్కండ్ వెయిన్గాంకర్ అనే జర్నలిస్ట్.. 1983 వరల్డ్‌కప్ టీమిండియా జట్టు 14 మంది సభ్యుల వేతనాలకు సంబంధించిన ఫోటోను తన ట్విటర్లో షేర్ చేస్తూ అప్పటి ఆటగాడు కనీస విలువ రూ.10 కోట్లుగా ఉంటుంది. అని చెప్పడం వైరల్‌గా మారింది. తాజాగా '83' సినిమా విడుదల నేపథ్యంలో మరోసారి టీమిండియా ఆటగాళ్ల వేతనాల ఫోటోను షేర్ చేయడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా 83 సినిమా నేపథ్యంలో 1983 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్ అయిన కపిల్‌దేవ్ సేనకు సినిమా టీమ్ ప్రత్యేకంగా రూ.15 కోట్లు అందించినట్లు సమాచారం. ఈ మేరకు కెప్టెన్ అయిన కపిల్ దేవ్ రూ. 5 కోట్లు తీసుకోనున్నాడని.. మిగతా రూ. 10 కోట్లను జట్టులోని మిగతా 13 మంది సభ్యలకు సమానంగా పంచనున్నట్లు సమాచారం. Each one of them deserve 10 Cr. pic.twitter.com/BzBYSgqit6 — Makarand Waingankar (@wmakarand) July 16, 2019 ఇక ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న ఒక క్రికెటర్‌కు ఇస్తున్న పారితోషికం ఈ విధంగా ఉంది ►ఒక టెస్టు మ్యాచ్ ఆడితే రూ. 15 లక్షలు.. ఒక వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు.. టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు అందుతుంది. ►సెంట్రల్ కాంట్రాక్ట్ కింద ఏప్లస్ కేటగిరీలో ఉన్న ఆటగాడికి ఏడాదికి గానూ రూ. 7 కోట్లు.. ఇక గ్రేడ్ ఏ కింద ఉన్న ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, గ్రేడ్ బి కింద ఉన్న ఆటగాళ్లకు రూ. 3 కోట్లు, గ్రేడ్ సి కింద ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. కోటి అందజేస్తున్నారు ►ఒక మ్యాచ్‌లో ఎవరైనా బ్యాట్స్‌మన్ డబుల్ సెంచరీ సాధిస్తే రూ. 7 లక్షలు. ఇక ఐదు వికెట్లు తీసిన బౌలర్‌కు.. టెస్టులో సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌కు రూ. 5లక్షలు అదనంగా ఇస్తున్నారు. 1983 ప్రపంచకప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా లీగ్ దశలో తొలుత ఓటములు ఎదురైనప్పటికీ బెరుకు లేకుండా ముందుకు సాగుతూ ఒక్క మెట్టు ఎక్కింది. చూస్తుండగానే సెమీస్‌లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో అప్పటికే రెండుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంది. ఫైనల్‌కు ముందు ''టీమిండియా ఇంతవరకు రావడమే గొప్ప.. బలమైన విండీస్‌ను మీరు ఓడించలేరు.. వట్టి చేతులతో ఇంటికి వెళ్లండి'' అంటూ పలువురు అవమానకరంగా మాట్లాడారు. వీటన్నింటిని ఒక చాలెంజ్‌గా స్వీకరించిన భారత్ ఫైనల్లో విండీస్‌తో పోరాడైనా కప్ సాధించాలనుకుంది. జూన్ 25, 1983న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కపిల్ సేన విండీస్ బౌలర్ల దాటికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంకేముంది ఈసారి కూడా టైటిల్ విండీస్‌దే అని అంతా భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. క్లైవ్ లాయిడ్ సేన బ్యాటింగ్ సాగుతున్న కొద్దీ టీమిండియా బౌలర్లు చెలరేగి వికెట్లు తీశారు. చివరికి విండీస్ 140 పరుగులకే ఆలౌట్ కావడంతో 43 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా విశ్వవిజేతగా అవతరించింది. చదవండి: MS Dhoni International Debut: ఎంఎస్ ధోని@17.. ఎన్నిసార్లు చదివినా బోర్ కొట్టదు -
క్రికెటర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..
Jay Shah Good News For Domestic Cricketers: దేశవాళీ క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా శుభవార్త చెప్పారు. 2019-20 సీజన్‌కు గానూ ఆటగాళ్లందరికీ 50 శాతం మేర అదనంగా మ్యాచ్ ఫీజు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా 2020-2021 సీజన్ జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారంగా ఈ మేరకు అదనపు ఫీజు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదే విధంగా... దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 40 మ్యాచులకు పైగా ఆడిన సీనియర్లకు రూ. 60 వేలు, అండర్-23 ప్లేయర్లకు 25 వేలు, అండర్-19 క్రికెటర్లకు 20 వేలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ట్విటర్ వేదికగా జై షా ప్రకటన చేశారు. ఈ మేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది జరగాల్సిన దేశవాళీ సహా వివిధ క్రికెట్ టోర్నీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ వేగవంతం కావడం, కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ ఏడాది ఆరంభం నుంచి పలు క్రీడా ఈవెంట్లు మొదలయ్యాయి. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్-2021 యూఏఈ వేదికగా ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. డొమెస్టిక్ క్రికెట్ 2021-2022 షెడ్యూల్ ఇలా... ►సీనియర్ వుమెన్ వన్డే లీగ్: సెప్టెంబరు 21, 2021న మొదలు. ►సీనియర్ వుమెన్ వన్డే చాలెంజర్ ట్రోఫీ- అక్టోబరు 27, 2021. ►సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: అక్టోబరు 20, 2021- నవంబరు 12, 2021. ►రంజీ ట్రోఫీ: నవంబరు 16, 2021- ఫిబ్రవరి 19, 2022. ►విజయ్ హజారే ట్రోఫీ: ఫిబ్రవరి 23, 2022- మార్చి 26, 2022. చదవండి: CSK Vs MI: పొలార్డ్ చేసిన తప్పు ఇదే.. లేదంటే చెన్నై 80 పరుగులకే ఆలౌట్ అయ్యేది! -
విజేతకు ఇంకా డబ్బులు అందలేదు!
ముంబై: పుష్కర కాలం తర్వాత విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్న ముంబై జట్టు సభ్యులకు ఇప్పటి వరకు టోర్నీకి సంబంధించిన ఒక్క రూపాయి కూడా లభించలేదు. ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ)లో పరిపాలన స్తంభించిపోవడంతో వారికి ఈ పరిస్థితి ఎదురైంది. నిబంధనల ప్రకారం బీసీసీఐ నేరుగా ఆటగాళ్లకు డబ్బు లు ఇవ్వకుండా సదరు సంఘం ద్వారానే చెల్లింపులు జరుపుతుంది. ఒక్కో ఆటగాడికి రోజూవారీ భత్యం కింద రూ.1500 లభిస్తుంది. దాదాపు నెల రోజులు సాగిన ఈ టోర్నీ ద్వారా ఒక్కో ఆటగాడికి రూ. 45 వేల వరకు రావాల్సి ఉంది. విజేతగా నిలిచిన జట్టుకు లభించే రూ. 20 లక్షల ప్రైజ్‌మనీ కూడా ముంబై ఆటగాళ్లకు దక్కలేదు. దీంతో పాటు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్ ఫీజు కింద రూ. 35 వేల వంతున కూడా ఇవ్వాల్సి ఉంది. ఎంసీఏలో చెక్‌లపై సంతకం పెట్టే అధికారం కూడా ప్రస్తుతం ఎవరికీ లేకపోవడంతో ఆటగాళ్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
ఆటగాళ్ల ఫీజులు పెంచాలి: అనిల్ కుంబ్లే
హైదరాబాద్: భారత క్రికెట్ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ లు ఆటగాళ్ల, టీం సపోర్టింగ్ స్టాఫ్ ల కాంట్రాక్టు ఫీజులు పెంచాలని బీసీసీఐ నిర్వాహకుల కమిటీని(సీఓఏ) కోరారు. ఆదివారం హైదరాబాద్ లో సీఈవో రాహుల్ జోహ్రి, జాయింట్ సెక్రటరీ అమితాబ్ చౌదరిలకు కోచ్ అనిల్ కుంబ్లే పీజులు 150 శాతం పెంచాలని కోరుతూ పూర్తి నివేదికను అందజేశారు. హైదరబాద్ లో కోహ్లీ లేకపోవడంతో స్కైప్ ద్వారా ప్యానెల్ మీటింగ్ చర్చలో పాల్గొన్నాడు. ఇప్టటికే గ్రేడ్ ఏ ఆటగాళ్లు రూ.2 కోట్లు, గ్రేడ్ బి ఆటగాళ్లు రూ. 1కోటి, గ్రేడ్ సీ వారు రూ. 50 లక్షలు పొందుతున్నారు. అయితే కోహ్లీ, కుంబ్లే లు అన్నిఫార్మాట్లలో కలిపి గ్రేడ్ ఏ ఆటగాళ్లకు ఒక్కో సీజన్ కు రూ.5 కోట్లు చేయాలని ప్రతిపాదించారు. అనిల్ కుంబ్లే, కోహ్లీ వేరువేరుగా ఆటగాళ్ల ఆర్ధిక పరిస్ధితులను సీఓఏకు వివరించారు. పుజార లాంటి టెస్టు బ్యాట్స్‌మన్ ఐపీఎల్ ఆడలేదిని, కేవలం రంజీలు ఆడే పవన్ నేగి ఐపీఎల్ లో 45 రోజుల్లో రూ.8.5 కోట్లు సంపాందించారని తెలిపారు. ఇక కుంబ్లే నివేదిక లో టీం ఇండియా సపోర్ట్ స్టాఫ్ ఫీజులు కూడా పెంచాలని పేర్కొన్నారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫి అనంతరం కుంబ్లే కోచ్ కాంట్రాక్ట్ ముగియనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫి అనంతరం జరిగే వెస్టిండీస్ టూర్ వరకు కోచ్ గా కుంబ్లే కొనసాగే అవకాశం ఉంది. ఆ మధ్య భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ రంజీ ఆటగాళ్ల ఫీజులు పెంచాలని కోరుతూ భారత్ కోచ్ కుంబ్లేకు లేఖ రాశాడు. -
మాజీ ఆటగాళ్లకు బీసీసీఐ నజరానా
వంద టెస్టులు ఆడిన వారికి రూ. కోటిన్నర ముంబై: బీసీసీఐ తమ మాజీ ఆటగాళ్లకు భారీ ఎత్తున నగదు ప్రయోజనాలను ప్రకటించింది. వార్షిక సభ్య సమావేశానికి (ఏజీఎం) ఒక రోజు ముందు తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం దేశవాళీ, అంతర్జాతీయ మాజీ ఆటగాళ్లకు నెలవారీ, ఏక మొత్తం అందనుంది. అలాగే అంపైర్లకు మ్యాచ్ ఫీజులను కూడా ప్రకటించింది. 2003-04కు ముందు వంద టెస్టు మ్యాచ్‌లు ఆడిన మాజీలకు ఏక మొత్తం పథకం కింద రూ.1.5 కోట్లు... 75 నుంచి 99 మ్యాచ్‌లు ఆడిన వారికి రూ.కోటి... 50 నుంచి 74 మ్యాచ్‌లు ఆడిన వారికి రూ.75 లక్షలు ఇస్తారు. ఇక కెరీర్లో 25 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1993 డిసెంబర్ 31లోపు వీడ్కోలు పలికిన మాజీలకు బోర్డు ఇక నుంచి నెలకు రూ.50 వేలు ఇవ్వనుంది. అదే గడువులోపు రిటైర్ అయ్యి 25 టెస్టులకన్నా తక్కువ ఆడిన వారికి నెలకు రూ.25 వేలు దక్కనున్నాయి. జనవరి 1, 1994 తర్వాత తప్పుకున్న వారికి నెలకు రూ. 22,500. దివంగతులైన టెస్టు ఆటగాళ్లు, అంపైర్ల భార్యలకు జీవితాంతం నెలకు రూ. 22,500.అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన మాజీలకు నెలకు రూ.15 వేలు.రిటైరైన టెస్టు అంపైర్లకు నెలకు రూ. 22,500.1957-58 సీజన్‌కు ముందు కనీసం పది మ్యాచ్‌లు ఆడిన రంజీ ఆటగాళ్లకు నెలకు రూ.15 వేలు లభిస్తాయి.2003-04 సీజన్ వరకు కనీసం 25 నుంచి 49 మ్యాచ్‌లు ఆడిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్లందరికీ నెలకు రూ.15 వేలు.. 50 నుంచి 74 మ్యాచ్‌లు ఆడిన వారికి రూ.22,500; 75 అంతకుమించి ఆడిన వారికి రూ.30 వేలు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు సంబంధించి ఫీల్డ్ అంపైర్లు(వన్డే, టి20), థర్డ్ అంపైర్‌కు మ్యాచ్ ఫీజు కింద రోజుకి రూ.లక్షా 82 వేల 500 ఇవ్వనున్నారు.