Courtesy: IPL Twitter
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ నిబంధనలను అతిక్రమించిన కారణంగా కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ తెలిపింది. డీవై పాటిల్ వేదికగా ఆర్సీబీతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నిబంధన అతిక్రమించినట్లు సమాచారం అందింది. కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేఎల్ రాహుల్ లెవల్-1 నిబంధన ఉల్లఘించినట్లు తేలింది.
రాహుల్ కూడా తన తప్పును ఒప్పుకోవడంతో రూల్ ప్రకారం అతని మ్యాచ్ ఫీజు నుంచి 20 శాతం కోత విధిస్తున్నాం అంటూ ప్రకటనలో తెలిపింది. కాగా కేఎల్ రాహుల్ ఇప్పటికే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా 12 లక్షల జరిమానా పడింది. మరో రెండుసార్లు రాహుల్ స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే ఒక మ్యాచ్ బ్యాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
తృటిలో తప్పించకున్న మార్కస్ స్టోయినిస్
లక్నో సూపర్ జెయింట్స్‌కే చెందిన బ్యాట్స్‌మన్ మార్కస్ స్టోయినిస్ తృటిలో జరిమానా నుంచి తప్పించకున్నాడు. వైడ్ విషయంలో అంపైర్‌ను తప్పుబట్టి ఐపీఎల్ లెవెల్-1 నిబంధన అతిక్రమించాడు. అయితే మేనేజ్‌మెంట్ మాత్రం స్టోయినిస్‌ను వార్నింగ్‌తో సరిపెట్టింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద స్టోయినిస్ లెవెల్-1 నిబంధనను అతిక్రమించాడు. అయితే ఇది మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరించి వదిలేస్తున్నాం అంటూ ప్రకటనలో పేర్కొంది,
ఇక మ్యాచ్ విషయానికి వస్తే లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. కృనాల్ పాండ్యా 42 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కేఎల్ రాహుల్ 30, స్టోయినిస్ 24 పరుగులు చేశారు.
చదవండి: LSG vs RCB: అంపైర్ వైడ్ ఇచ్చుంటే లక్నో మ్యాచ్ గెలిచేదేమో!
Virat Kohli Golden Duck In IPL: అదే నిర్లక్ష్యం.. కోహ్లి ఖాతాలో అనవసర రికార్డు
Comments
Please login to add a commentAdd a comment