IPL 2022: Lucknow CEO Raghu-Iyer Serious Accident Ahead Of Match Vs PBKS - Sakshi
Sakshi News home page

IPL 2022: పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌.. తీవ్ర దిగ్బ్రాంతిలో లక్నో సూపర్‌ జెయింట్స్‌

Published Fri, Apr 29 2022 7:26 PM | Last Updated on Fri, Apr 29 2022 7:49 PM

IPL 2022 Lucknow CEO Raghu-Iyer Serious Accident Ahead Match Vs PBKS - Sakshi

PC: IPL Twitter

పంజాబ్‌ కింగ్స్‌తో శుక్రవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌ మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్‌ ప్రారంభానికి ముందే లక్నో జట్టుకు బిగ్‌షాక్‌ తగిలింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ సీఈవో రఘు అయ్యర్‌ కార్‌ యాక్సిడెంట్‌కు గురయ్యారు. ఇవాళ సాయంత్రం రఘు అయ్యర్‌.. టీం సభ్యులతో కలిసి హోటల్‌ నుంచి మ్యాచ్‌ జరగనున్న పుణే స్టేడియానికి బయలుదేరారు. టీం మొత్తం బస్సులో వెళ్లగా.. సీఈవో రఘు అయ్యర్‌ మరో ఇద్దరు కలిసి కారులో బస్సును ఫాలో అయ్యారు.

కొద్దిదూరం వెళ్లగానే రఘు అయ్యర్‌ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురయ్యింది. రఘు అ‍య్యర్‌కు తీవ్ర గాయాలు కాగా.. మిగతా ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా ప్రస్తుతం ఈ ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా వీరంతా క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా సమాచారం అందుకున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది.

చదవండి: IPL 2022: లక్నో సూపర్‌ జెయింట్స్‌ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement