Jay Shah Good News For Domestic Cricketers: దేశవాళీ క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా శుభవార్త చెప్పారు. 2019-20 సీజన్‌కు గానూ ఆటగాళ్లందరికీ 50 శాతం మేర అదనంగా మ్యాచ్ ఫీజు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా 2020-2021 సీజన్ జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారంగా ఈ మేరకు అదనపు ఫీజు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అదే విధంగా... దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 40 మ్యాచులకు పైగా ఆడిన సీనియర్లకు రూ. 60 వేలు, అండర్-23 ప్లేయర్లకు 25 వేలు, అండర్-19 క్రికెటర్లకు 20 వేలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ట్విటర్ వేదికగా జై షా ప్రకటన చేశారు. ఈ మేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది జరగాల్సిన దేశవాళీ సహా వివిధ క్రికెట్ టోర్నీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ వేగవంతం కావడం, కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ ఏడాది ఆరంభం నుంచి పలు క్రీడా ఈవెంట్లు మొదలయ్యాయి. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్-2021 యూఏఈ వేదికగా ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.
డొమెస్టిక్ క్రికెట్ 2021-2022 షెడ్యూల్ ఇలా...
►సీనియర్ వుమెన్ వన్డే లీగ్: సెప్టెంబరు 21, 2021న మొదలు.
►సీనియర్ వుమెన్ వన్డే చాలెంజర్ ట్రోఫీ- అక్టోబరు 27, 2021.
►సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: అక్టోబరు 20, 2021- నవంబరు 12, 2021.
►రంజీ ట్రోఫీ: నవంబరు 16, 2021- ఫిబ్రవరి 19, 2022.
►విజయ్ హజారే ట్రోఫీ: ఫిబ్రవరి 23, 2022- మార్చి 26, 2022.
చదవండి: CSK Vs MI: పొలార్డ్ చేసిన తప్పు ఇదే.. లేదంటే చెన్నై 80 పరుగులకే ఆలౌట్ అయ్యేది!
Comments
Please login to add a commentAdd a comment