మిండియా హెడ్ కోచ్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. భారత జట్టు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది. అతడితో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కాంట్రాక్ట్‌లను కూడా బీసీసీఐ పెంచింది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడుతూ.. భారత క్రికెట్ బోర్డు నుంచి పూర్తి మద్దతు ద్రవిడ్‌కు ఉంటుందని తెలిపాడు. కాగా ద్రవిడ్ కొత్త కాంట్రాక్ట్ వివరాలను మాత్రం బోర్డు బహిర్గతం చేయలేదు. అయితే వచ్చ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌కు ద్రవిడ్ హెడ్‌కోచ్ పదవిలో కొనసాగే ఛాన్స్ ఉంది.
"భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ ద్రవిడ్‌ను మించిన గొప్ప వ్యక్తి లేడని నేను ముందే చెప్పాను. ద్రవిడ్ మరోసారి తన నిబద్ధతతో జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ద్రవిడ్ తన కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు ఒప్పుకోవడంతో టీమిండియా యూనిట్ మరింత బలంగా మారనుంది. ఇప్పటికే అతడి నేతృత్వంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో నెం1 జట్టుగా అవతరించింది.
ఇది ఒక్కటి చాలు అతడి కోచింగ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. కోచ్‌గా తనంటో ద్రవిడ్ నిరూపించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో కూడా భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓటమిపాలైంది. హెడ్‌కోచ్ ద్రవిడ్‌కు బోర్డు నుంచి ఎల్లప్పడూ సపోర్ట్ ఉంటుంది. భారత జట్టును అంతర్జాతీయ స్దాయిలో మరింత అద్బుతంగా ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాని" జై షా పేర్కొన్నాడు. కాగా ద్రవిడ్ తిరిగి మళ్లీ దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు జట్టుతో కలవనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment