India Vs Pakistan- Asia Cup 2023: సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియా పాకిస్తాన్ పర్యటనకు సిద్ధమైందా? ప్రతిష్టాత్మక టోర్నీ ఆడేందుకు దాయాది దేశానికి వెళ్లనుందా? అంటే ఆ అవకాశం ఉందనే సమాధానం వినిపిస్తోంది క్రీడావర్గాల్లో! ఆసియా కప్-2023 ఈవెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుందన్న విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
బాయ్‌కాట్ చేస్తుందా?
ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ 2023- 2027లో భాగంగా ఆసియా కప్ వన్డే టోర్నీ సహా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ ఈవెంట్లకు పాక్ వేదిక కానున్నట్లు ఆగష్టులో వెల్లడించింది. కాగా అనివార్య కారణాల వల్ల 2008 తర్వాత భారత్ ఇప్పటి వరకు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ను భారత్ బాయ్‌కాట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
బీసీసీఐ నోట్‌లో ఏముంది?
అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజా ఎజెండాలో భాగంగా టీమిండియా పాల్గొననున్న ఐసీసీ ఈవెంట్ల లిస్టులో ఆసియా కప్ గురించి ప్రస్తావన ఉండటంతో.. 14 ఏళ్ల తర్వాత తొలిసారి భారత జట్టు పాక్‌కు వెళ్లనుందన్న వార్తలు గుప్పుమన్నాయి.
క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. అక్టోబరు 18న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) జరుగనుంది. ఇందులో ప్రస్తావించిన అంశాల ప్రకారం.. 2023లో భారత జట్టు పాల్గొనే ఐసీసీ ఈవెంట్లు
►ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్‌కప్, సౌతాఫ్రికా
►ఐసీసీ వుమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్‌కప్, సౌతాఫ్రికా
►ఆసియా కప్, పాకిస్తాన్
►ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్, ఇండియా
ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ గురువారం ఓ నోట్ షేర్ చేసినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రోహిత్ సేన ఆసియా కప్-2023లో పాల్గొనేందుకు పాక్‌కు వెళ్లనుందన్న వార్తలకు ఊతమిచ్చింది. ఈ క్రమంలో ఓ బీసీసీఐ అధికారిని సంప్రదించగా.. ‘‘భారత ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అన్న అంశం మీదే ఈ విషయం ఆధారపడి ఉంటుంది’’ అని అన్నట్లు క్రిక్‌బజ్ పేర్కొంది.
కాగా పాక్‌లో మెగా టోర్నీలు ఆడేందుకు పలు దేశాలు విముఖత చూపిన నేపథ్యంలో పీసీబీ యూఏఈని వేదికగా ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రస్తుత అధ్యక్షుడిగా బీసీసీఐ కార్యదర్శి, భారత హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చదవండి: Ind Vs Pak- Babar Azam: భారత్‌తో మ్యాచ్ కోసమే ఇదంతా: పాక్ కెప్టెన్ బాబర్ ఆజం
PAK Vs NZ: ఇంకా నయం బ్యాట్ మాత్రమే విరిగింది..
🚨 Key points from Pakistan Men's Future Tours Programme (FTP) 2023-2027 🚨 pic.twitter.com/nSl57p0WRa
— Pakistan Cricket (@TheRealPCB) August 17, 2022
Comments
Please login to add a commentAdd a comment